నియోజకవర్గం : అసెంబ్లీ

షాద్ నగర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
185024
పురుషులు :
94068
స్త్రీలు :
90936
ప్రస్తుత ఎమ్మెల్యే :
అంజయ్య యాదవ్
ప్రస్తుత ఎంపీ :
ఏ.పీ. జితేందర్ రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 1,85,024
పురుషులు: 94,068
స్త్రీలు: 90,936
ఇతరులు: 20
 
నియోజకవర్గంలోని కీలక వర్గాలు: 
షాద్‌నగర్‌ నియోజకవర్గంలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు. అందులో ప్రధానంగా 50 శాతం వరకు బీసీ ఓటర్లు ఉన్నారు. వీరిలో ముదిరాజ్‌ కులస్థులు మొదటిస్థానంలో, యాదవులు రెండో స్థానంలో, మూడో స్థానంలో ఎస్సీ ఓటర్లు ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఓపెన్‌ 
నియోజకవర్గంలోని మండలాలు: ఫరూఖ్‌నగర్‌, కొత్తూర్‌, కొందుర్గు, కేశంపేట, చౌదరిగూడ, నందిగామ
ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: మహబూబ్‌నగర్‌ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 వై.అంజయ్య యాదవ్ టీఆర్‌ఎస్ ప్రతాప రెడ్డి కాంగ్రెస్ 20556
2014 అంజయ్యయాదవ్‌ టీఆర్‌ఎస్‌ ప్రతాప్‌రెడ్డి ఐఎన్‌సీ 17328
2009 చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ఐఎన్‌సీ అంజయ్యయాదవ్‌ టీఆర్‌ఎస్‌ 9838
2004 పి. శంకర్‌రావు ఐఎన్‌సీ బక్కని నర్సింహులు టీడీపీ 10632
1999 పి. శంకర్‌రావు ఐఎన్‌సీ డాక్టర్‌ బాలు బీజేపీ 6010
1994 బక్కని నర్సింహులు టీడీపీ పి. శంకర్‌రావు ఐన్‌సీ 45822
1989 డాక్టర్‌ పి. శంకర్‌రావు ఐఎన్‌సీ ఎం. ఇందిర టీడీపీ 8700
1985 ఎం. ఇందిర టీడీపీ బి. కిష్టయ్య ఐఎన్‌సీ 7018
1983 డాక్టర్‌ పి. శంకర్‌రావు ఐఎన్‌సీ పి. రాధాకృష్ణ ఇండిపెండెంట్‌ 3003
1978 బీష్వ కిష్టయ్య ఐఎన్‌సీ బంగారు లక్ష్మణ్‌ జేఎన్‌పీ 9743
1972 ఎన్‌.వి.జగన్నాథం ఐఎన్‌సీ కంబయ్య ఐఎన్‌డీ 13827
1967 కె. నాగన్న ఐఎన్‌సీ బీఎం.రావు ఎస్‌డబ్ల్యుఏ 5370
1962 దామోదర్‌రెడ్డి ఐఎన్‌సీ అఫ్జల్‌బియాబనీ ఐఎన్‌డీ 7988

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో తాగునీటి సరఫరా కోసం మిషన్‌ భగీరథ, సాగునీటి కోసం మిషన్‌ కాకతీయ పనులు జరుగుతున్నాయి. దాంతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ పంచాయతీ రోడ్లు, బీటీ రోడ్లుగా మారుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

1692 నుంచి 1719 వరకు వనపర్తి సంస్థానాధీశుడు రాజా సవై వెంకట్‌రెడ్డి షాద్‌నగర్‌ను రాజధానిగా చేసుకొని 26 సంవత్సరాల పాటు పరిపాలన సాగించి తన తల్లి పెద్ద జానమ్మ పేర నిర్మించిన జానంపేట గ్రామానికి అనుబంధంగా వెలిసిన షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంగా 1952లో ఏర్పడింది. నాటి హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ప్రప్రథమంగా షాద్‌నగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. రాజా సవై వెంకట్‌రెడ్డి తన పరిపాలన కోసం నిర్మించిన చారిత్రాత్మక కట్టడాలు ఆక్రమణకు గురై కనుమరుగు కాగా షాద్‌నగర్‌కు ఉత్తర దిశగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం సాక్ష్యంగా నిలిచింది. మత సామరస్యానికి చిహ్నం కొత్తూరు. మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో జహంగీర్‌ పీర్‌ దర్గా ఉంది. సీతాన్వేషణ కోసం వెళ్లి రావణుడిని వధించి తిరుగు ప్రయాణంలో దండకారణ్య ప్రాంతమైన ఫరూఖ్‌నగర్‌ మండలంలోని జోగమ్మగూడ గుట్టలో శ్రీరాములు ప్రతిష్టించిన శివలింగం కూడా ఉత్తర రామేశ్వరం (రామలింగేశ్వరుడు)గా విరాజిల్లుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కొనసాగుతోంది.

ఇతర ముఖ్యాంశాలు

దేశంలోనే రెండవ పంచాయతీ సమితిని షాద్‌నగర్‌లో అప్పటి ప్రధానమంత్రి పండిట్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా 1994లో షాద్‌నగర్‌లో ఎలక్ర్టానిన్‌ ఓటింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌ స్టేట్‌ తొలి ముఖ్యమంత్రిగా ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామానికి చెందిన బహుభాష కోవిధుడు డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు పనిచేశారు.

వీడియోస్

ADVT