నియోజకవర్గం : అసెంబ్లీ

బోథ్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
అదిలాబాద్
మొత్తం ఓటర్లు :
180713
పురుషులు :
89238
స్త్రీలు :
91459
ప్రస్తుత ఎమ్మెల్యే :
రాథోడ్‌ బాపురావ్‌
ప్రస్తుత ఎంపీ :
గోడం నగేష్‌

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం జనాభా: 2,64,202
పురుషులు: 1,42,304
స్ర్తీలు: 1,21,898
 
నియోజకవర్గం మొత్తం ఓటర్లు: 1,80,713
పురుషులు: 89,238
స్ర్తీలు: 91,459
ఇతరులు: 16 
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: బోథ్‌ నియోజక వర్గంలో ప్రధానంగా లంబాడా, ఆదివాసీ గిరిజన ఓటర్లే కీలకంగా ఉన్నారు. అలాగే గిరిజనేతర ఓటర్లు కూడా అభ్యర్థుల గెలుపోటముల ప్రభావం చూప్తారు. ఈ సారి మాత్రం ఆదివాసీ గిరిజనులు తమ తెగకు చెందిన అభ్యర్థికే ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నియోజక వర్గంలో ఉన్న 24వేల ఆదివాసీ గిరిజనులు అభ్యర్థుల గెలుపోటముల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సారి అన్ని పార్టీలు ఆదివాసీ గిరిజన తెగకు చెందిన అభ్యర్థులనే బరిలో దింపేందుకు సమయత్తమవుతున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌ : ఎస్టీ
నియోజక వర్గంలో ఏ ఏ మండలాలు ఉన్నాయి : 1. బోథ్‌, 2. నేరడిగొండ, 3. గుడిహత్నూర్‌, 4. తాంసి, 5. తలమడుగు, 6. బజార్‌హత్నూర్‌, 7. ఇచ్చోడ, 8. సిరికొండ, 9. భీంపూర్‌.
ఏ లోక్‌సభ నియోజవర్గ పరిధిలో ఉంది : ఆదిలాబాద్‌ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 రాథోడ్‌ బాపురావ్‌ టీఆర్‌ఎస్‌ సోయం బాపూరావ్ కాంగ్రెస్ 6639
2014 రాథోడ్‌బాపురావ్‌ టీఆర్‌ఎస్‌ జాదవ్‌ అనిల్‌ కాంగ్రెస్ 26993
2009 జి.నగేష్‌ టీడీపీ జాదవ్‌అనిల్‌ కాంగ్రెస్ 51145
2004 సోయంబాపురావ్‌ టీఆర్‌ఎస్‌ జి.నగేష్‌ టీడీపీ 53940
1999 జి.నగేష్‌ టీడీపీ కొడప కోసురావు కాంగ్రెస్ 49155
1994 జి.నగేష్‌ టీడీపీ కె.చౌహాన్‌ కాంగ్రెస్ 51593
1989 జి.రామారావ్‌ టీడీపీ అమర్‌సింగ్‌ కాంగ్రెస్ 17806
1985 జి.రామారావ్‌ టీడీపీ ఎస్‌.భీంరావ్‌ కాంగ్రెస్ 25539
1983 ఎం.కాశీరాం కాంగ్రెస్ వీజీరెడ్డి సీపీఐ 18704
1978 అమర్‌సింగ్‌ కాంగ్రెస్-ఐ గణేష్‌జాదవ్‌ జనతాపార్టీ 22333
1972 ఎస్‌ఏ దేవ్‌షా కాంగ్రెస్ డి.ఆర్‌రావ్‌ సీపీఐ 24181
1967 ఎస్‌ఏ దేవ్‌షా కాంగ్రెస్ డి.ఆశారావ్‌ సీపీఐ 16299
1962 సి.మాధవ్‌రెడ్డి కాంగ్రెస్ ఆర్‌.రెడ్డి సీపీఐ 15990

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజక వర్గంలో ప్రముఖ సంస్థలు ఏమి లేవు. మత్తడి వాగు ప్రాజెక్టు ఉంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం 150కి పైగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే నేరడిగొండ మండలంలో కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కుంటాల జలపాతం సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గోమూత్రి రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

పెండింగ్ ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో కుంటాల జలపాతం వద్ద భద్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.దీని కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే బోథ్‌ మండలం నుంచి నిర్మల్‌ జిల్లా అడెల్లి పోచమ్మ ఆలయం వరకు రోడ్డు నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు. దీనికి అటవీశాఖ అనుమతులు అందాల్సి ఉంది. కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తే కుంటాల జలపాతానికి మూడు కాలాల పాటు నీటి వసతి సౌకర్యం ఉంటుంది.

ముఖ్య ప్రాంతాలు

ఈ నియోజకవర్గంలో కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, గాయత్రి జలపాతం, కనకాయి జలపాతం, గుంజాల జలపాతాలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

ఈ నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఎంపీ గోడం నగేష్‌ వచ్చే ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడమే దీనికి అసలు కారణం. ఎవరికి వారే అన్నట్లుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకే పార్టీ టికెట్ కేటాయించడంతో గోడం నగేష్ ఆశలు ఆవిరయ్యాయి. ఇది రిజర్వేషన్‌ స్థానం కావడంతో ఇక్కడ ఆదివాసీల ఆథిపత్యమే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆదివాసీల ఉద్యమ ప్రభావంతో నేతల రాజకీయ భవిష్యత్తే తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది.

వీడియోస్

ADVT