నియోజకవర్గం : అసెంబ్లీ

ఆళ్లగడ్డ

రాష్ట్రం :
ఆంధ్రప్రదేశ్
జిల్లా :
కర్నూలు
మొత్తం ఓటర్లు :
200437
పురుషులు :
99319
స్త్రీలు :
101105
ప్రస్తుత ఎమ్మెల్యే :
భూమా అఖిలప్రియ
ప్రస్తుత ఎంపీ :
ఎస్పీవై రెడ్డి

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం జనాభా: 2,97,577
పురుషులు: 1,48,169 ; మహిళలు: 1,49,400 ; థర్డ్‌ జండర్‌: 50
 
మొత్తం ఓటర్లు: 2,00,437
పురుషులు: 99,319 ; స్ర్తీలు: 1,01,105 ; థర్డ్‌ జండర్‌: 13
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: బలిజ కులం ఓటర్లు 40 వేల మంది ఉన్నారు. యాదవ ఓటర్లు 31 వేల మంది ఉన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా ఈ రెండు సామాజిక వర్గాలదే కీలకపాత్ర. బలిజ ఓటర్లు గత కొన్నేళ్లుగా భూమా కుటుంబానికి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ ప్రభావం కొంత ఉండే అవకాశం ఉంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: ఆళ్లగడ్డ
రిజర్వేషన్‌: జనరల్‌
ఏ జిల్లాలో ఉంది: కర్నూలు
నియోజకవర్గం పరిధిలో ఏఏ మండలాలు ఉన్నాయి: ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, ఉయ్యాలవాడ, శిరివెళ్ల, దొర్నిపాడు.
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: నంద్యాల
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2014 భూమా అఖిలప్రియ వైసీపీ 0 0 0
2012 భూమా శోభానాగిరెడ్డి వైసీపీ గంగుల ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ 36796
2009 భూమా శోభానాగిరెడ్డి ప్రజారాజ్యం గంగుల ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ 1958
2004 గంగుల ప్రతాపరెడ్డి కాంగ్రెస్‌ భూమా నాగిరెడ్డి టీడీపీ 10681
1999 భూమా శోభానాగిరెడ్డి టీడీపీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ 13659
1997 భూమా శోభానాగిరెడ్డి టీడీపీ ఇ.రాంపుల్లారెడ్డి కాంగ్రెస్‌ 46959
1994 భూమా నాగిరెడ్డి టీడీపీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ 15803
1992 భూమా నాగిరెడ్డి టీడీపీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ 10307
1989 భూమా వీరశేఖరరెడ్డి టీడీపీ గంగుల ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ 2952
1985 గంగుల ప్రతాపరెడ్డి కాంగ్రెస్‌ భూమా శేఖర్‌రెడ్డి టీడీపీ 1695
1983 ఎస్వీ సుబ్బారెడ్డి టీడీపీ గంగుల ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ 13734
1980 గంగుల ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎస్వీ సుబ్బారెడ్డి ఇండిపెండెంట్‌ 14502
1978 గంగుల తిమ్మారెడ్డి ఇండిపెండెంట్‌ ఎస్వీ సుబ్బారెడ్డి కాంగ్రెస్‌ 7403
1972 ఎస్వీ సుబ్బారెడ్డి ఇండిపెండెంట్‌ గంగుల తిమ్మారెడ్డి కాంగ్రెస్‌ 2578
1967 గంగుల తిమ్మారెడ్డి ఇండిపెండెంట్‌ ఎస్వీ సుబ్బారెడ్డి కాంగ్రెస్‌ 27975
1962 జయరాజ్‌ కాంగ్రెస్‌ ఎస్‌ఎస్‌ రాజు సీపీఐ 4362
1955 సీపీ తిమ్మారెడ్డి కాంగ్రెస్‌ సీఆర్‌ రెడ్డి సీపీఐ 5907
1952 శామ్యూల్‌ కాంగ్రెస్‌ 0 0 0

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

కేసీ కాలువ, తెలుగు గంగ కాలువ

అభివృద్ధి ప‌థ‌కాలు

పట్టణంలోని మొలకల వాగు ఆధునికీకరణ పనులు రూ.3 కోట్లతో జరుగుతున్నాయి. నీరు-చెట్టు కింద చెరువుల అభివృద్ధి పనులు జరుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగులపై.. వంతెనలు నిర్మించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెనల నిర్మాణాలు అనేది ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. తెలుగు గంగ ప్రధాన కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పంట కాలువలకు సాగునీరు అందడం లేదని రైతులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్య ప్రాంతాలు

ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో అహోబిలం నవ నరసింహా ఆలయం కూడా  ఒకటి.

ఇతర ముఖ్యాంశాలు

ఆళ్లగడ్డ ప్రాంతం శిల్పాల తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ తయారైన శిల్పాలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతాయి. నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.

వీడియోస్

ADVT