నియోజకవర్గం : అసెంబ్లీ

సూర్యాపేట

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
203367
పురుషులు :
100850
స్త్రీలు :
102506
ప్రస్తుత ఎమ్మెల్యే :
గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఓట‌ర్లు

నియోజకవర్గ మొత్తం ఓటర్లు: 203367
పురుషులు: 100850
మహిళలు: 102506
ఇతరులు: 11
 
నియోజకవర్గంలో కీలకవర్గాలు: నియోజక వర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారి తర్వాత ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బీసీల్లో యాదవులు, గౌడ కులస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

అసెంబ్లీ నియోజక వర్గం: సూర్యాపేట
రిజర్వేషన్: జనరల్‌
జిల్లా: సూర్యాపేట(నల్లగొండ) 
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి: సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట మునిసిపాలిటీ, సూర్యాపేట మండలం, ఆత్మకూర్‌(ఎస్‌), చివ్వెంల, పెన్‌పహాడ్‌
ఏ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఉంది: నల్లగొండ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 జగదీశ్ రెడ్డి టీఆర్‌ఎస్ ఆర్.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ 6032
2014 గుంటకండ్ల జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సంకినేని వెంకటేశ్వర్‌రావు ఇండిపెండింట్‌ 2219
2009 రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ 6000
2004 వేదాసు వెంకయ్య కాంగ్రెస్‌ పాల్వాయి రజనీకుమారి టీడీపీ 11000
1999 దోసపాటి గోపాల్‌ కాంగ్రెస్‌ ఆకారపు సుదర్శన్‌ టీడీపీ 9105
1994 ఆకారపు సుదర్శన్‌ టీడీపీ జన్నపాల ఎల్లయ్య కాంగ్రెస్‌ 25098
1989 ఆకారపు సుదర్శన్‌ టీడీపీ ఈద దేవయ్య కాంగ్రెస్‌ 4411
1985 దైద సుందరయ్య టీడీపీ ఎ.పరందాములు కాంగ్రెస్‌ 20723
1983 ఈద దేవయ్య టీడీపీ బీఎం.రాజు కాంగ్రెస్‌ 1342
1978 ఎ.పరందాములు కాంగ్రెస్‌ మారపంగు మైసయ్య జనతా 11402
1972 ఎడ్ల గోపయ్య కాంగ్రెస్‌ కె.ఎల్లయ్య సీపీఎం 15424
1967 ఉప్పల మల్సూర్‌ సీపీఎం మారపంగు మైసయ్య కాంగ్రెస్‌ 83
1962 ఉప్పల మల్సూర్‌ సీపీఐ ఎడ్ల గోపయ్య కాంగ్రెస్ 3113

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

వెదిరె రాంమోహన్‌రెడ్డి: సూర్యాపేట పట్టణంలో వెదిరె రాంమోహన్‌రెడ్డి వివాద రహితుడిగా పేరొందారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉండరు. సంఘ సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. అరవిందో సోసైటీని స్థాపించి ఉచితంగా మహిళలకు కంప్యూటర్లు, కుట్టుమిషన్లు, అల్లికల శిక్షణ ఇప్పిస్తారు. అరవిందో స్వామి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు.

కొల్లు మధుసూదన్‌రావు: సూర్యాపేట పట్టణానికి చెందిన కొల్లు మధుసూదన్‌రావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహితగా పేరొందారు. పీఆర్‌టీయూ వ్యవస్థాపకుల్లో ఒకరు. సూర్యాపేట పట్టణంలో పలు విద్యా కేంద్రాలను స్థాపించారు. అరవిందో సోసైటీలో కూడా క్రియశీలకంగా ఉంటారు. పలు జిల్లా పరిషత్‌ చైర్మన్ల వద్ద ప్రభుత్వ పీఏగా పని చేశారు.

పెద్దిరెడ్డి గణేష్‌: సాహితివేత్తగా పేరొందిన పెద్దిరెడ్డి గణేష్‌ పలు పుస్తకాలు రచించారు. సుధా కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఎండీగా పని చేస్తున్నారు. ఎల్‌జీలు అనే పుస్తకాన్ని ర చించగా ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆవిష్కరించారు. సుధా బ్యాంక్‌ త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. మనమ్‌ వికాస్‌ వేదిక ఆధ్వర్యంలో పలు సాహితి కార్యక్రమాలు చేపడుతారు.
 
ఇరిగి కోటీశ్వరీ: స్పూర్తిక్లబ్‌ వ్యవస్థాపకురాలలో ఇరిగి కోటీశ్వరీ ఒకరు. మహిళలకు సంబంధించిన సమస్యలపై గళమెత్తారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ మెంబర్‌గా కూడా కొనసాగుతున్నారు. భార్యభర్తల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు కౌన్సిలింగ్‌ ఇచ్చి సర్దిచెబుతారు.

అభివృద్ధి ప‌థ‌కాలు

సూర్యాపేట నియోజక వర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్‌లో సుమారు రూ.11 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం జరుగుతోంది. దీంతో పాటు రూ.20 కోట్లతో సద్దుల చెరువును మినీ ట్యాంక్‌‌బండ్‌గా మారుస్తున్నారు. దాని పక్కనే పార్కు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు రూ.3 కోట్లతో హిందూ స్మశాన వాటిక నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో మూసీ, పాలేరు వాగులపై చెక్‌ డ్యాంలను నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. సూర్యాపేట పట్టణంతో పాటు నియోజక వర్గంలోని గ్రామాలలో సీసీ, తారు రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటితో విద్యుత్‌ లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించేందుకు రూ.17 కోట్లతో నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం, స్తంభాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీటితో పాటు జిల్లా కేంద్రంలోని 100 ఏళ్ల చరిత్ర కల్గిన పెద్ద మసీదును సుమారు రూ.50 లక్షలతో ఆధునీకరించనున్నారు. ఇవే కాకుండా వివిధ కులాలకు చెందిన వారికి కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అమృత్‌సిటీ పథకం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో సుమారు 20వేల ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

సూర్యాపేట నియోజక వర్గంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. సూర్యాపేట పట్టణం హైద్రాబాద్‌-విజయవాడ నగరాలకు మధ్యలో ఉంది. రెండేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడింది. సూర్యాపేట పట్టణం అన్ని రంగాలలో దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. నిత్యం సమీప ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం సుమారు 50వేల మంది సూర్యాపేటకు వచ్చి వెళ్తుంటారు. అయితే సూర్యాపేట పట్టణంలో రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్ల విస్తరణకు మోక్షం కలగడం లేదు. రోడ్ల విస్తరణ చేపట్టేందుకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలో మరో ప్రధాన సమస్య 60 అడుగుల రోడ్డులో ఉన్న నాలా. వర్షాలు వచ్చినప్పుడు నాలా పొంగి పొర్లడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. నాలాను నిర్మించకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. నాలా నిర్మాణానికి కాంగ్రెస్‌ పాలనలో చర్యలు చేపట్టినా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. నాలా నిర్మాణ విషయమై ఇటీవల రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్వయంగా పరిశీలించి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పాటు సూర్యాపేట నియోజక వర్గానికి ఎస్సారెస్పీ ఆశించిన మేర రావడంలేదు. కాల్వలు కంపచెట్లతో నిండిపోతున్నాయి. మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వలు ఆధునీకరణకు నోచుకోక పూడి పోతున్నాయి. చివరి ఆయకట్టు భూములకు నీరు అందడంలేదు. సూర్యాపేట పట్టణానికి తాగునీటి సమస్య నెలకొంది. మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీరు వస్తే తాగు నీటి సమస్య పరిష్కారం కానుంది.

ముఖ్య ప్రాంతాలు

సూర్యాపేట నియోజకవర్గం ఉద్యమాలకు పుట్టినిల్లు. సూర్యాపేట నియోజక వర్గంలో మూసీ ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు కింద నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో సుమారు 30వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. దీంతో పాటు ఎస్సారెస్పీ రెండో దశ పథకం ద్వారా నియోజక వర్గంలోని కొన్ని వేల ఎకరాలకు నీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. వీటితో పాటు ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అందులో సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి శివాలయం, చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి లింగమంతులస్వామి దేవాలయం, ఉండ్రుగొండలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ప్రసిద్దిగాంచినవి. అంతేకాక సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొన్ని వేల మందికి ఉపాధి ఇచ్చే సుధాకర్‌ పీవీసీ కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటు సువెన్‌ ఫార్మా కంపెనీని కూడా కొన్నేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. సూర్యాపేట గ్రంథాలయానికి వంద ఏళ్ల చరిత్ర ఉంది.

వీడియోస్

ADVT