నియోజకవర్గం : అసెంబ్లీ

ఆలేరు

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
206389
పురుషులు :
103926
స్త్రీలు :
102444
ప్రస్తుత ఎమ్మెల్యే :
గొంగిడి సునీత
ప్రస్తుత ఎంపీ :
డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌

ఓట‌ర్లు

 మొత్తం ఓటర్లు: 206389
పురుషులు: 103926
స్త్రీలు: 102444
ఇతరులు: 19

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: ఆలేరు
రిజర్వేషన్‌: జనరల్
ఏ జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా(నల్లగొండ)
నియోజకవర్గంలోని మండలాలు: ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మల రామారం, గుండాల(జనగాంజిల్లా), ఆత్మకూర్‌(ఎం), మోటకొండూరు
ఏ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది: భువనగిరి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 గొంగిడి సునీత టీఆర్‌ఎస్ భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ 33086
2014 గొంగిడి సునీత టీఆర్ఎస్ బూడిద భిక్షమయ్య కాంగ్రెస్ 31477
2009 బూడిద భిక్షమయ్య కాంగ్రెస్ కె. యాదగిరిరెడ్డి టీఆర్ఎస్ 12902
2004 డాక్టర్ కుడుదుల నగేష్ టీఆర్ఎస్ మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ 3924
1999 మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ డాక్టర్ కుడుదుల నగేష్ టీడీపీ 7617
1994 మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ డాక్టర్ నాగేష్ కాంగ్రెస్ 38975
1989 మోత్కుపల్లి నర్సింహులు ఇండిపెండెంట్ వై .బసాని సున్నం టీడీపీ 12481
1985 మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ చెట్టుపల్లి కెన్నెడీ కాంగ్రెస్ 36146
1983 మోత్కుపల్లి నర్సింహులు ఇండిపెండెంట్ సాలూరు పోచయ్య కాంగ్రెస్ 7675
1978 సాలూరు పోచయ్య కాంగ్రెస్(ఐ) పి. వెంకటరాములు జనతా 19137
1972 అనిరెడ్డి పొన్నారెడ్డి కాంగ్రెస్ కె. యాకుబ్ రెడ్డి ఇండిపెండెంట్ 7375
1967 అనిరెడ్డి పొన్నారెడ్డి కాంగ్రెస్ పి.సి రెడ్డి సీపీఐ 10603
1962 ఆరుట్ల కమలాదేవి సీపీఐ అనిరెడ్డి పొన్నారెడ్డి కాంగ్రెస్ 1669
1957 ఆరుట్ల కమలాదేవి పీడీఎఫ్ అనిరెడ్డి పొన్నారెడ్డి కాంగ్రెస్ 4127

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

సుద్దాల అశోక్‌ తేజ: గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన సుద్దాల అశోక్‌ తేజ సుప్రసిద్ద సినీ గేయ రచయిత. స్వాతంత్ర సమరయోధులు సుద్దాల హన్మంతు కుమారుడు. ఆయన తన గేయాలకు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్నారు.
 
బండ్రు నర్సింహులు: ఆలేరు పట్టణానికి చెందిన నక్సలైట్‌ నేత. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడిగా పేరు, సీపీఐ ఎంల్‌ నాయకుడిగా ఈ ప్రాంతంలో పోరాటాలు చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు విమలక్క ఆయన కూతురే.
 
ఆసు మల్లేశం: చేనేత కార్మికుడికి అతిముఖ్యమైన ఆసు యంత్రానికి సృష్టి కర్త ఆసు మల్లేశం.ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
 
చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌: ప్రఖ్యాత చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌ ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం మోటకొండూరు మండలం కదిరేనిగూడెం వాసి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార చిహ్నం రూపశిల్పి. ఆయన చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఎన్నోదక్కాయి.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

పారిశ్రామికంగా ప్రిమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ మినహా ముఖ్యమైన పరిశ్రమలు, సంస్థలు లేవు.

అభివృద్ధి ప‌థ‌కాలు

ఆలేరు నియోజకవర్గంలో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని రూ.1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గంధమల్ల వద్ద 4.6 టీఎంసీల సామర్ధ్యంగల రిజర్వాయర్‌ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. యాదగిరిగుట్ట నుంచి నలువైపులా నాలుగు లేన్ల రహదారులు, హైదరాబాద్‌ నుంచి ఎంఎంటీఎస్‌ ప్రతిపాదనలు ఉన్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

ఆలేరు నియోజకవర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాగునీరు, తాగునీరు. సాగునీటి అవసరాలను తీర్చడానికి కాలేళ్వరం ప్రాజెక్టును ప్రతిపాదించారు. కాని అది ఇంకా భూసేకరణ స్థాయిని దాటలేదు.. త్వరితగతిన రిజర్వాయర్‌ పనులు పూర్తిచేస్తే సాగునీటి అవసరాలు తీరుతాయని భావిస్తున్నారు. అదేవిధంగా తాగునీటి అవసరాలు తీర్చడానికి మిషన్‌ భగీరథ పధకం అమలు చేస్తున్నారు. అయితే ఈ పధకం నుంచి పూర్తిస్థాయిలో నీరందే పరిస్థితులు లేవు. విద్యా, వైద్య పరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. యాదగిరిగుట్ట, ఆత్మకూర్‌, వంటి ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. కానీ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

యాదాద్రి ఆలయం: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. తెలంగాణ తిరుమలగా భక్తుల కొంగుబంగారమైన ఆలయాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ది చేస్తున్నారు.
 
కొలనుపాక: చారిత్రక, ఆధ్యాత్మిక పట్టణం కొలనుపాక. ప్రపంచ ప్రసిద్ధమైన జైన తీర్థకరుడు మహవీర్‌ ఆలయం ఎంతో ప్రాశస్త్యమైంది. అదే విధంగా ఈ పట్టణంలోని సోమేశ్వర ఆలయం వీరశైవులకు భక్తి ప్రదాయని. ఈ ఆలయంలోనే రేణుకాచార్యులు వీరశైవ ధర్మసంస్థాపన చేశారు. అదేవిధంగా 18 కుల మఠాలకు చెందిన పురాణాలు ఈ పట్టణంలో ఉన్నాయి. అదే విధంగా పురావస్తుశాఖ మ్యూజియం కూడా ఉంది.

ఇతర ముఖ్యాంశాలు

ఆలేరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ముక్కోణ పోటీ నెలకొననుంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ బలమైన పట్టుకలిగి ఉండగా గతంలో అయిదు పర్యాయాలు వరుస విజయాలు సాధించిన టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్నికల బరిలోకి దిగితే మరొకసారి ముక్కోణపు పోటీ ఉండనున్నట్టు తప్పనిసరిగా తెలుస్తోంది. అయితే ఆయన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి పోటీ చేస్తారని, లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నారని అంతా అనుకున్నారు. కానీ, అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు మరొకసారి టికెట్ దక్కడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారో లేదా మరే ఇతర పార్టీ నుంచి బరిలో దిగుతారా  అనేది వేచి చూడాలి. దీంతో నియోజకవర్గంలో గతంలో ముఖాముఖిగా ఉన్న పోటీ ఈసారి త్రిముఖ పోటీగా మారనుంది. టీడీపీ, బీజేపీ, సీపీఐ పోటీలో ఉన్నప్పటికి వాటి ప్రభావం నామమాత్రంగానే ఉంటుంది.

వీడియోస్

ADVT