నియోజకవర్గం : అసెంబ్లీ

మునుగోడు

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
214847
పురుషులు :
109133
స్త్రీలు :
105704
ప్రస్తుత ఎమ్మెల్యే :
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 214847
పురుషులు:  109133
స్త్రీలు: 105704
ఇతరులు:  10

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: మునుగోడు
రిజర్వేషన్‌: ఓపెన్‌
ఏ జిల్లాలో ఉంది: యాదాద్రి భువనగిరి(నల్లగొండ)
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి
ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: భువనగిరి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కె.ప్రభాకర్ రెడ్డి టీఆర్‌ఎస్ 22316
2014 కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌ 38055
2009 ఉజ్జిని యాదగిరిరావు సీపీఐ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ 3594
2004 పల్లా వెంకట్‌రెడ్డి సీపీఐ సి.కాశీనాథ్‌ టీడీపీ 11285
1999 పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ జెల్ల మార్కండేయులు టీడీపీ 4129
1994 ఉజ్జిని నారాయణరావు సీపీఐ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ఇండింపెండెంట్‌ 31554
1989 ఉజ్జిని నారాయణరావు సీపీఐ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ 8262
1985 ఉజ్జిని నారాయణరావు సీపీఐ ఎం.నారాయణరావు కాంగ్రెస్‌ 20783
1983 పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ బి.ధర్మభిక్షం సీపీఐ 10311
1978 పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ కె.రామకృష్ణారెడ్డి జనతా 13631
1972 పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ ఉజ్జిని నారాయణరావు సీపీఐ 8769
1967 పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ ఉజ్జిని నారాయణరావు సీపీఐ 15622
1965 కొండా లక్ష్మణ్‌ బాపూజీ కాంగ్రెస్‌ జెఎం.రెడ్డి సీపీఐ 27038
1962 కె.గురునాథ్‌రెడ్డి సీపీఐ కొండా లక్ష్మణ్‌ బాపూజీ కాంగ్రెస్‌ 536
1957 కొండా లక్ష్మణ్‌బాపూజీ కాంగ్రెస్‌ కె.వెంకట్రామారావు పీడీఎఫ్‌ 3503
1952 కె.వెంకట్రామారావు పీడీఎఫ్‌ బీవీఎన్‌.రావు కాంగ్రెస్‌ 10827

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

పల్లె రవికుమార్‌: పత్రికా రంగం(తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు)
జాజుల శ్రీనివాస్‌గౌడ్‌: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

అభివృద్ధి ప‌థ‌కాలు

మునుగోడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి డబుల్‌ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. గ్రామాలలో రహదారులు, సీసీ రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు పూర్తయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లో కుల సంఘాలకు కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు శంఖుస్థాపన చేస్తున్నారు. నియోజకవర్గంలోని సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌, చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనులు కొనసాగుతున్నాయి. చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురంలో మోటార్‌ వెహికల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ కేంద్రాన్ని నిర్మించారు. యంత్రాలు అమర్చగానే ఈ కేంద్రం ప్రారంభం కానుంది.

పెండింగ్ ప్రాజెక్టులు

దశాబ్దాల కాలంగా మునుగోడు నియోజకవర్గాన్ని ఫ్లోరైడ్‌ సమస్య పట్టిపీడిస్తోంది. పాలకులు ప్రజలకు కృష్ణాజలాలను అందిస్తున్నప్పటికీ, సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఫ్లోరైడ్‌ సమస్యతో వేలాది మంది ప్రజల కాళ్లు, చేతులు వంకర్లు పోయి, జీవశ్చవాలుగా జీవిస్తున్నారు. ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి దండు మల్కాపురంలో ఫ్లోరైడ్‌ పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసినప్పటికీ, నేటికీ శంఖుస్థాపనకు నోచుకోలేదు. సాగునీటి సౌకర్యం లేక నియోజకవర్గంలోని వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారాయి. సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎంతో కాలంగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు, రాజకీయ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. సాగునీటి సౌకర్యంతోనే అటు ఫ్లోరైడ్‌ సపస్య పరిష్కారంతో పాటు బీడు భూములు సాగులోకి వచ్చే అవకాశాలున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో చండూరులో మాత్రమే డిగ్రీ కళాశాల ఉంది.

ముఖ్య ప్రాంతాలు

సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని రాచకొండ గుట్టలు పర్యాటకాన్ని తలపిస్తాయి. రేచర్ల పద్మనాయకుల కాలంలో ఇక్కడ రాచకొండ రాజ్యంగా పాలన సాగింది. నాటి తెలంగాణ అంతటికి రాచకొండ ప్రాంతం రాజధానిగా విలసిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకానికి చౌటుప్పల్‌ మండల కేంద్రంలో ఫైలాన్‌ నిర్మించారు. ఇది పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురంలోని ఆంథోల్‌ మైసమ్మ దేవాలయం, అల్లాపురంలోని సరళమైసమ్మ దేవాలయం పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయి. మర్రిగూడ మండలం ఆజ్మాపురంలో బుగ్గజాతర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇతర ముఖ్యాంశాలు

1952లో చిన్నకొండూరు నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గం ఉండేది. 1952 నుంచి 1965వరకు చిన్నకొండూరు నియోజకవర్గంగా ఎన్నికలు నిర్వహించారు. 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 5 పర్యాయాలు కాంగ్రెస్‌, 5 పర్యాయాలు సీపీఐ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యమివ్వాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వీడియోస్

ADVT