నియోజకవర్గం : అసెంబ్లీ

మిర్యాలగూడ

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
205894
పురుషులు :
101862
స్త్రీలు :
104022
ప్రస్తుత ఎమ్మెల్యే :
నల్లమోతు భాస్కర్‌రావు
ప్రస్తుత ఎంపీ :
గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 205894
పురుషులు: 101862
స్త్రీలు: 104022
ఇతరులు:  10
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: నియోజకవర్గంలో రెడ్డి, ఆర్యవైశ్యుల ఓట్లు అధికంగా ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నియోజకవర్గంలోని దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో ఎస్టీ సామాజిక వర్గాల ఓట్లు సైతం అధికంగా ఉండడతో ఆ వర్గం నాయకుల మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికల్లో వారిని ప్రసన్నం చేసుకుంటారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: మిర్యాలగూడ
రిజర్వేషన్: ఓపెన్ క్యాటగిరి
ఏ జిల్లాలో ఉంది: నల్లగొండ
నియోజకవర్గంలో ఏ ఏ మండలాలు ఉన్నాయి: మిర్యాలగూడ మండలంతో పాటు దామరచర్ల, వేములపల్లి, కొత్తగా ఏర్పడిన అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి మండలంలోని ఆరు గ్రామాలు మినహా మండలం మొత్తం ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.
ఏ లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: నల్లగొండ
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 నల్లమోతు భాస్కర్ టీఆర్‌ఎస్ ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ 30571
2014 ఎన్‌. భాస్కర్‌రావు కాంగ్రెస్‌ ఎ. అమరేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ 5811
2009 జూలకంటి రంగారెడ్డి సీపీఎం టి. గంగాధర్‌ కాంగ్రెస్‌ 4363
2004 జూలకంటి రంగారెడ్డి సీపీఎం పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ 11470
1999 రేపాల శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ సుందరి అరుణ టీడీపీ 8504
1994 జూలకంటి రంగారెడ్డి సీపీఎం టి. విజయసింహారెడ్డి కాంగ్రెస్‌ 20093
1989 టి.విజయసింహారెడ్డి కాంగ్రెస్‌ ఎ. లక్ష్మినారాయణ సీపీఎం 5341
1985 ఎ. లక్ష్మినారాయణ సీపీఎం జి. చిలినమ్మ కాంగ్రెస్‌ 30412
1983 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్‌(ఐ) ఎ. లక్ష్మినారాయణ సీపీఐ 6141
1978 ఎ. లక్ష్మినారాయణ సీపీఎం టి. లింగయ్య కాంగ్రెస్‌(ఐ) 2141
1972 తిప్పన చినకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ ఎంఎస్‌. రామయ్య సీపీఎం 20100
1967 తిప్పన చినకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ చల్లా సీతారాంరెడ్డి సీపీఎం 540
1962 తిప్పన చినకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ చల్లా సీతారాంరెడ్డి సీపీఐ 4388
1957 సి. వెంకటరెడ్డి పీడీఎఫ్ డి.ఎన్‌.రెడ్డి కాంగ్రెస్‌ 6602

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

వేనేపల్లి పాండురంగారావు: తెలంగాణ మట్టిమనిషిగా పేరొందిన ఆలగడప మాజీ సర్పంచ్‌ అయిన పాండురంగారావు తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు. గ్రామ సర్పంచ్‌గా ఉన్న సమయంలో తనకు తానే రిఫరెండం నిర్వహించిన తొలి సర్పంచ్‌గా రికార్డు సృష్టించారు.
డాక్టర్‌ జె. రాజు: మిర్యాలగూడ జిల్లా సాధన సమితి చైర్మన్‌గా పాపులర్‌ అయిన వ్యక్తి ప్రముఖ వైద్యుడు జె.రాజు. జనవిజ్ఞాన వేదికతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నిత్యం జనం మధ్యలో ఉంటున్నారు.
పి. సుబ్బారావు: పౌరహక్కుల సంఘం నేతగా, విద్యావేత్తగా నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చర్చాగోష్టుల్లో కీలకపాత్ర పోషిస్తారు.
బీఎల్‌ఆర్‌ (బత్తుల లక్ష్మారెడ్డి): ఈయన అన్నదాన కార్యక్రమాలతో ప్రసిద్ధి చెందారు. నియోజకవర్గంలో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా వేలాది మందికి ఆయన నేతృత్వంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గ కేంద్రమైన మిర్యాలగూడ పట్టణ శివారుల్లో 130 వరకు రైస్‌ మిల్లులున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 4000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించే పనులు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద రివర్సబుల్‌ టర్బైన్ల ద్వారా నీటిని రీసైక్లింగ్‌ చేసుకొని విద్యుత్‌ ఉత్పాదన చేసేందుకు అనువుగా దామరచర్ల మండలం అడవిదేవులపల్లి, గుంటూరు జిల్లా సత్రశాలల మధ్య టేల్‌పాండ్‌ ప్రాజెక్టును నిర్మించారు. అదేవిధంగా తెలంగాణలోనే ఎక్కువ ఎత్తిపోతల పథకాలు ఉన్న నియోజకవర్గంగా మిర్యాలగూడ ఖ్యాతిగాంచింది. నాగార్జునసాగర్‌ ఎడమకాలవపై 41 ఎత్తిపోతల పథకాలుండగా ఈ నియోజకవర్గ పరిధిలోనే 16 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రధాన అభివృద్ధి పనంటే యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రమనే చెప్పొచ్చు. పట్టణంలోని పందిర్లపల్లి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా గుర్తించి రూ.9.70 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా పురపాలక సంఘంలోని సాగర్‌రోడ్డును విస్తరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దామరచర్ల మండలంలో తుంగపాడు బంధంపై రెండు ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నారు. ఇవి పూర్తయితే 15వేల ఎకరాలకు సాగు నీరందుతుంది.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గ ప్రజలను రైస్‌మిల్లుల కాలుష్యం దీర్ఘకాలికంగా వెంటాడుతోంది. మిర్యాలగూడ మండలంలోని 28 గ్రామాలకు కృష్ణా జలాలు అందని ద్రాక్షలా మారాయి. కాగా కేసీఆర్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకురావడంతో ఈ గ్రామాల్లో ఇప్పుడిప్పుడే వాటర్‌ ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల పనులు జరుగుతుండడంతో దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న కృష్ణా మంచినీరు త్వరలోనే ఆ గ్రామాలకు అందనుంది. పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఏర్పాటు డిమాండ్‌ కలగానే మిగిలింది. దాని ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. అంతేకాకుండా రూ. 30కోట్ల వ్యయంతో పదేళ్ల క్రితం ప్రారంభించిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) పనులు పూర్తి కాకపోవడంతో పురపాలక సంఘం కంపుకొడుతోంది. ఆ పనులను పూర్తి చేసేందుకు పాలకవర్గాలు పెద్దగా చొరవ తీసుకోవడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

దామరచర్ల మండలం వాడపల్లిలో కృష్ణా, మూసీ నదుల సంగమం ఉంది. ఈ సంగమం వద్దనే లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంది. కొత్తగా ఏర్పడిన అడవిదేవులపల్లి మండలకేంద్ర సమీపంలో కృష్ణానది ఒడ్డున సూర్యదేవాలయం ఉంది. పర్యాటక ప్రదేశంగా వాడపల్లి ప్రసిద్ధి గాంచింది. వాడపల్లిలో ఇండియా సిమెంట్‌ కర్మాగారం ఉంది. తెలంగాణలోని అతిపెద్ద ఎఫ్‌సీఐ మిర్యాలగూడ పట్టణంలో ఉంది.

వీడియోస్

ADVT