నియోజకవర్గం : అసెంబ్లీ

హుజూర్‌నగర్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
218703
పురుషులు :
108104
స్త్రీలు :
110589
ప్రస్తుత ఎమ్మెల్యే :
నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,18,703
పురుషులు: 1,08,104
స్త్రీలు: 1,10,589
ఇతరులు: 10
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: రెడ్డి, కాపు, గౌడ

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: హుజుర్‌నగర్‌
రిజర్వేషన్: జనరల్‌ క్యాటగిరి
ఏ జిల్లాలో ఉంది: సూర్యాపేట(నల్లగొండ)
నియోజకవర్గంలో ఏ ఏ మండలాలు ఉన్నాయి: హుజుర్‌నగర్‌, మఠంపల్లి, మేళ్లచెర్వు, నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి, చింతలపాలెం.
ఏ లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: నల్లగొండ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సైది రెడ్డి టీఆర్‌ఎస్ 7446
2014 నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ కాసోజు శంకరమ్మ టీఆర్‌ఎస్‌ 23000
2009 నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ గుంటకండ్ల జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ 28000

పెండింగ్ ప్రాజెక్టులు

హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో మట్టపల్లి వద్ద రూ.50 కోట్లతో కృష్ణానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. హుజుర్‌నగర్‌లో 150 కోట్లతో చేపట్టిన మోడల్‌ కాలనీ ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. హుజూర్‌నగర్‌లో 22 కోట్లతో చేపట్టిన బైపాస్‌రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాలేదు.

ఇతర ముఖ్యాంశాలు

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒకటి, రెండు మినహా మిగతా కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. ఎమ్మెల్యే ఉత్తమ్‌ కార్యకర్తలకు అందుబాటులోను ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో కార్యకర్తల శుభకార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఉత్తమ్‌తో కార్యకర్తలకు ఏ పని కావాలన్నా హైద్రాబాద్‌లోని గాంధీభవన్‌కో, లేదా ఉత్తమ్‌ ఇంటికో వెళ్ళాల్సిందే మరి. పద్మావతిరెడ్డి హుజూర్‌నగర్‌లోని కార్యకర్తలతో అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ఇన్‌చార్జి శంకరమ్మ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొంటున్నారు.

వీడియోస్

ADVT