నియోజకవర్గం : అసెంబ్లీ

దేవరకొండ

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
210724
పురుషులు :
106695
స్త్రీలు :
104015
ప్రస్తుత ఎమ్మెల్యే :
రమావత్‌ రవీంద్రకుమార్‌
ప్రస్తుత ఎంపీ :
గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 210724
పురుషులు: 106695
స్త్రీలు: 104015
ఇతరులు: 14
నియోజకవర్గంలో కీలకవర్గాలు: దేవరకొండ నియోజకవర్గంలో ఎస్టీ (లంబాడ) జనాభా అత్యధికంగా ఉంది. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో ఎస్టీ వర్గానికి చెందినవారే ప్రజా ప్రతినిధులుగా పోటీపడుతుంటారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: దేవరకొండ
రిజర్వేషన్‌: ఎస్టీ 
జిల్లా పేరు: నల్లగొండ
నియోజకవర్గంలో ఉన్న మండలాలు: దేవరకొండ, చందంపేట, డిండి, చింతపల్లి, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి, పెద్దఅడిశర్లపల్లి.
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది: నల్లగొండ
 
1957లో దేవరకొండ నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు 1952 నుంచి పెద్దమునిగల్‌ నియోజకవర్గంగా కొనసాగింది. 1952లో పెద్దమునిగల్‌ నియోజకవర్గంగా ఏర్పడగా అప్పటి జనరల్‌ స్థానం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థి కందుల అనంతరామారావు గెలుపొందారు. దేవరకొండ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అప్పటి ద్విశాసనసభ స్థానాలు ఉండడంతో పీడీఎఫ్‌, సీపీఐ అభ్యర్ధులు విజయం సాధించారు. 1978లో దేవరకొండ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంగా ఆవిర్భవించింది. 1978 నుంచి ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడి దేవరకొండ, చందంపేట, డిండి, పీఏపల్లి, చింతపల్లి మండలాలతో నియోజకవర్గంగా ఏర్పడింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతనంగా మండలాలు ఏర్పాటు చేయడంతో నేరేడుగొమ్ము, కొండ మల్లేపల్లి మండలాలు ఏర్పడ్డాయి. ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి 7 పర్యాయాలు సీపీఐ అభ్యర్ధులే గెలుపొందారు. 5 పర్యాయాలు కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా 2 పర్యాయాలు పీడీఎఫ్‌ విజయం సాధించింది.  
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 రవీంద్ర కుమార్ టీఆర్‌ఎస్ బాలు నాయక్ కాంగ్రెస్ 38857
2014 ఆర్‌. రవీంద్రకుమార్‌ సీపీఐ బిల్యానాయక్‌ టీడీపీ 4116
2009 నేనావత్‌ బాలునాయక్‌ కాంగ్రెస్‌ రవీంద్రకుమార్‌ సీపీఐ 10000
2004 ఆర్‌. రవీంద్రకుమార్‌ సీపీఐ బి. శక్రునాయక్‌ టీడీపీ 17187
1999 డి. రాగ్యానాయక్‌ కాంగ్రెస్‌ వశ్యనాయక్‌ టీడీపీ 387
1994 బద్దు చౌహన్‌ సీపీఐ డి. రాగ్యానాయక్‌ ఇండిపెండెంట్‌ 2373
1989 బద్దు చౌహన్‌ సీపీఐ డి. రాగ్యానాయక్‌ కాంగ్రెస్‌ 5200
1985 బద్దు చౌహన్‌ సీపీఐ విజయలక్ష్మీ కాంగ్రెస్‌ 25121
1983 డి. రవీంద్రనాయక్‌ కాంగ్రెస్‌ హరియా సీపీఐ 3160
1978 డి. రవీంద్రనాయక్‌ కాంగ్రెస్‌ హరియా సీపీఐ 15674
1972 బి. రామశర్మ సీపీఐ బి. చౌహన్‌ కాంగ్రెస్‌ 10169
1967 జి. నారాయణరెడ్డి కాంగ్రెస్‌ పల్లా పర్వత్‌రెడ్డి సీపీఐ 20981
1962 వై. పెద్దయ్య సీపీఐ లక్ష్మయ్య కాంగ్రెస్‌ 4934
1957 ఎం. లక్ష్మయ్య కాంగ్రెస్‌ చంద్రయ్య పీడీఎఫ్‌ 9975
1952 అనంతరామారావు పీడీఎఫ్‌ ఏకేరావు కాంగ్రెస్‌ 11929

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

దేవరకొండ నియోజకవర్గంలో డిండి ఎత్తిపోతల, శ్రీశైలం సొరంగమార్గం పనులు కొనసాగుతున్నాయి. నిధుల కొరత, సాంకేతిక లోపాల కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫ్లోరైడ్‌ సమస్య నివారణకు డిండి ఎత్తిపోతల పథకమే శరణ్యం. 2005లో ప్రారంభమైన శ్రీశైలం సొరంగమార్గం పనులు 44 కిలోమీటర్లు తవ్వవలసి ఉన్నప్పటికి ఇప్పటి వరకు 33 కిలోమీటర్లు పూర్తయింది. 2015లో డిండి ఎత్తిపోతల పథ కాన్ని కేసీఆర్‌ ప్రారంభించి రెండున్నర సంవత్సరాలలో పూర్తిచేస్తానని హమీ ఇచ్చారు. కాని డిజైన్‌ల మార్పు, భూసేకరణ జాప్యంతో డిండి ఎత్తిపోతల పనులు ముందుకు సాగడంలేదు.

అభివృద్ధి ప‌థ‌కాలు

దేవరకొండ నియోజకవర్గంలో జడ్చర్ల - కోదాడ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. మిషన్‌భగీరథ పనులు, గ్రామీణ ప్రాంతాలలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

దేవరకొండలో వంద పడకల ఆసుపత్రి మంజూరైనప్పటికి ప్రారంభానికి నోచుకోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం లేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. పీఏపల్లిలో దొండ మార్కెట్‌ ఏర్పాటు చేసినప్పటికీ విక్రయాలు జరపకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్య ప్రాంతాలు

దేవరకొండ ఖిల్లాకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేవరకొండ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తానని హమీ ఇచ్చారు. కోటి రూపాయలు మంజూరు చేసినప్పటికి అవి సరిపడలేదు. దీంతో ఖిల్లాలో అభివృద్ధి పనులు జరుగడం లేదు. డిండి మండలం బాపన్‌కుంటను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయవలసి ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతమైన వైజాగ్‌కాలనీ వద్ద ఏకో టూరిజం పనులు వేగవంతంగా చేపట్టవలసి ఉంది. దీంతోపాటు గాజుబేడం గుహలు, మునుస్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరచవలసి ఉంది.

వీడియోస్

ADVT