నియోజకవర్గం : అసెంబ్లీ

చొప్పదండి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
208056
పురుషులు :
102241
స్త్రీలు :
105813
ప్రస్తుత ఎమ్మెల్యే :
సుంకె రవిశంకర్
ప్రస్తుత ఎంపీ :
బి. వినోద్ కుమార్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,08,056
పురుషులు : 1,02,241
స్త్రీలు: 1,05,813
ఇతరులు:  02
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: 
నియోజకవర్గంలో అత్యధికంగా 22 శాతం ఎస్సీ ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత బీసీ వర్గంలో పద్మశాలి జనాభా అధికంగా ఉంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఎస్సీ
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి:
- చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల, బోయినిపల్లి
ఏ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది:
- కరీంనగర్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 సుంకె రవిశంకర్ టీఆర్ఎస్ మేడిపల్లి సత్యం కాంగ్రెస్ 42127
2014 బొడిగె శోభ టీఆర్‌ఎస్‌ సుద్దాల దేవయ్య కాంగ్రెస్‌ 54981
2009 సుద్దాల దేవయ్య టీడీపీ గునుకొండ బాబు కాంగ్రెస్‌ 32979
2004 సాన మారుతి టీడీపీ కె సత్యనారాయణగౌడ్‌ కాంగ్రెస్‌ 4125
1999 కె సత్యనారాయణగౌడ్‌ కాంగ్రెస్‌ ఎన్‌ రాంకిషన్‌రావు టీడీపీ 1912
1994 ఎన్‌ రాంకిషన్‌రావు టీడీపీ కె సత్యనారాయణగౌడ్‌ కాంగ్రెస్‌ 25887
1989 ఎన్‌ రాంకిషన్‌రావు టీడీపీ కె సత్యనారాయణగౌడ్‌ కాంగ్రెస్‌ 7862
1985 ఎన్‌ రాంకిషన్‌రావు టీడీపీ రామస్వామి కాంగ్రెస్‌ 39437
1983 జి మాధవరెడ్డి టీడీపీ ఎఎస్‌ రెడ్డి కాంగ్రెస్‌ (ఐ) 17472
1978 ఎన్‌ శ్రీపతిరావు కాంగ్రెస్‌(ఐ) ఎం కృష్ణారెడ్డి కాంగ్రెస్‌ 6259
1962 బి రాములు కాంగ్రెస్‌ ఆర్‌ రెడ్డి సీపీఐ 7469
1957 సిహెచ్‌ రాజేశ్వర్‌రావు పీడీఎప్ బి రాములు కాంగ్రెస్‌ 1021

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

బోయినిపల్లి మండలం మానువాడలో మిడ్‌మానేరు డ్యాం, కొడిమ్యాల మండలం నాచుపల్లిలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఉంది. చొప్పదండి మండల కేంద్రంలో జవహర్‌ నవోదయ పాఠశాల ఉన్నది.

అభివృద్ధి ప‌థ‌కాలు

రామడుగు మండలం లక్ష్మిపూర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజి పనులు కొనసాగుతున్నాయి. మల్యాల మండలంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ పునరుజ్జీవ పనులు కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో లెదర్‌పార్కు నిర్మాణం పెండింగ్‌లో ఉంది.

ముఖ్య ప్రాంతాలు

మల్యాల మండలం కొండగట్టులో సుప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రం, గంగాధర మండలంలో చారిత్రాత్మకమైన బొమ్మలగుట్ట ప్రదేశాలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో రెండు గ్రూప్‌లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నాయకులు 6 మండలాలలో ఉన్నారు. బోయినిపల్లి మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 2 శాఖలు, కార్యవర్గాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే శోభ అనుకూల, వ్యతిరేక వర్గాలు వేరువేరుగా మండల కార్యవర్గాలను ఏర్పాటుచేసుకున్నారు.

వీడియోస్

ADVT