నియోజకవర్గం : అసెంబ్లీ

వనపర్తి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
144864
పురుషులు :
73651
స్త్రీలు :
71213
ప్రస్తుత ఎమ్మెల్యే :
ఎస్.నిరంజన్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
నంది ఎల్లయ్య

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 2,21,418
పురుషులు: 1,11,749
స్త్రీలు: 1,09,643
ఇతరులు: 26

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలోని మండలాలు:
1) వనపర్తి
2) గోపాల్‌పేట
3) పెబ్బేరు
4) శ్రీరంగాపూర్‌ (కొత్త)
5) పెద్దమందడి
6) ఖిల్లాఘన్‌పూర్‌
7) రేవల్లి (కొత్త)
లోక్‌సభ స్థానం : నాగర్‌కర్నూలు (ఎస్సీ)
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఎస్.నిరంజన్ రెడ్డి టీఆర్‌ఎస్ జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ 51685
2014 చిన్నారెడ్డి కాంగ్రెస్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి టీఆర్ఎస్ 4291
2009 రావుల చంద్రశేఖర రెడ్డి టీడీపీ జి. చిన్నారెడ్డి కాంగ్రెస్ 12000
2004 జి. చిన్నారెడ్డి కాంగ్రెస్ లావణ్య టీడీపీ 3975
1999 జి. చిన్నారెడ్డి కాంగ్రెస్ రావుల చంద్రశేఖర రెడ్డి టీడీపీ 3353
1994 చంద్రశేఖర రెడ్డి టీడీపీ జి. చిన్నారెడ్డి కాంగ్రెస్ 21982
1989 జి. చిన్నారెడ్డి కాంగ్రెస్ బాలకృష్ణయ్య టీడీపీ 27875
1989 జి. చిన్నారెడ్డి కాంగ్రెస్ బాలకృష్ణయ్య టీడీపీ 3353
1985 బాలకృష్ణయ్య టీడీపీ జి. చిన్నారెడ్డి కాంగ్రెస్ 11458
1978 జయరాములు కాంగ్రెస్ (ఐ) బాలకిష్టయ్య జె.ఎన్.పి 4969
1972 అయ్యప్ప కాంగ్రెస్ బాల కిష్టయ్య ఇండిపెండెంట్ 1689
1967 జె.కె.దేవి కాంగ్రెస్ జె. రెడ్డి ఇండిపెండెంట్ 14420
1962 కుముదిని దేవి కాంగ్రెస్ జి. శివారెడ్డి ఇండిపెండెంట్ 22642

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గం పరిధిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. అయితే కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల పథకాలతో పాటు జూరాల ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి నీరందుతుంది. ముఖ్యమైన సంస్థలు లేవు. ఒక ప్రైవేటు షుగర్‌ ఫ్యాక్టరీ, ఏడీబీ లిక్కర్‌ కంపెనీలు ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో 21 వేల ఎకరాలకు నీరు అందించే పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌ పనులు జరుగుతుండటం.
జిల్లా, నియోజకవర్గ కేంద్రమైన వనపర్తిలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఇక పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా నిర్మాణం చేపట్టిన ఏదుల రిజర్వాయర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

వనపర్తి నియోజకవర్గంలో పట్టణ రోడ్ల విస్తరణ దీర్ఘకాలిక సమస్య. మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ రోడ్ల విస్తరణ డిమాండ్‌ ఉంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రెండు పర్యాయాలు రోడ్ల విస్తరణ జరిగినా వనపర్తి అందుకు నోచుకోలేదు. జిల్లాల ఏర్పాటు సమయంలో రోడ్ల విస్తరణ చేస్తున్నామని, రూ. 204 కోట్లు కూడా మంజూరయ్యాయని అధికారపార్టీ నాయకులు ప్రచారం చేసినా ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదు. ఇక వనపర్తిలో రాష్ట్రంలోనే మొదటి పాలిటెక్నిక్‌ కళాశాలను జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించి సాంకేతిక విద్యకు తోడ్పాటునందించినా, ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత విద్యాసంస్థలు లేక విద్యార్థులు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సమస్య, నియోజకవర్గ కేంద్రాలకు డబుల్‌రోడ్డు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. జాతీయ రహదారి నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి డబుల్‌రోడ్డు పనులు రెండు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. గద్వాల- మాచర్ల రైల్వేలైన్‌ పనులు కూడా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంది.

ముఖ్య ప్రాంతాలు

తమిళనాడులోని శ్రీరంగంలోని పద్మనాభ స్వామి ఆకారంలో నిర్మించిన శ్రీరంగాపురం రంగనాయకస్వామి దేవాలయం పర్యాటకులను ఆకర్షిస్తోంది. అలాగే వనపర్తి రాజావారి సంస్థానానికి గుర్తుగా రాజప్రసాదం ఉంది. అందులో ప్రస్తుతం పాలిటెక్నిక్‌ కళాశాలను నడుపుతున్నారు. ఖిల్లాఘనపురంలోని ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ ట్రెక్కింగ్‌ చేసే విధంగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ADVT