నియోజకవర్గం : అసెంబ్లీ

నారాయణపేట్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
198551
పురుషులు :
98874
స్త్రీలు :
99662
ప్రస్తుత ఎమ్మెల్యే :
రాజేందర్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
ఏ.పి. జితేందర్ రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 1,98,551
పురుషులు:  98,874
స్త్రీలు:  99,662
ఇతరులు: 15
పోలీంగ్‌ కేంద్రాలు: 228
 
నియోజక వర్గంలో కీలక వర్గాలు:
నారాయణపేట నియోజకవర్గంలో ముదిరాజ్‌ బీసీ ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో బీసీ నినాదం కొంతమేర ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

2009 పునర్విభజన ప్రక్రియలో నారాయణపేట కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించింది. అంతకు ముందు మక్తల్‌ నియోజకవర్గంలోనే ఉండేది. నియోజకవర్గ పునర్విభజనలో కొత్తగా ఆవిర్భవించింది. నారాయణపేట సెగ్మెంట్‌లో 2009 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల మహా సంగ్రామంలో టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థులు బరిలో తలపడగా ప్రపథమంగా నియోజక వర్గంలో టీడీపీకి చెందిన ఏల్కోటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది కొత్త సెగ్మెంట్‌లో టీడీపీ పాగావేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి సూగప్పపై 12వేల పైచిలుకు మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రధానంగా చేనేత, మేలిమి బంగారానికి నారాయణపేట ప్రసిద్ధి. 
 
రిజర్వేషన్‌ : ఓపెన్‌
నియోజకవర్గంలో మండలాలు : కోయిల్‌ కొండ, మరికల్‌, ధన్వాడ, నారాయణపేట మండలంతో పాటు మున్సిపాలిటి, దామరగిద్ద.
లోక్‌సభ నియోజక వర్గం పరిధి: మహాబూబ్‌ నగర్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 రాజేందర్ రెడ్డి టీఆర్‌ఎస్ శివకుమార్ రెడ్డి బీఎల్‌ఎఫ్ 15187
2014 ఎస్. రాజేందర్ రెడ్డి టీడీపీ శివకుమార్ రెడ్డి టీఆర్ఎస్ 2270
2009 ఎల్లారెడ్డి టీడీపీ సుగప్ప కాంగ్రెస్ 12143

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేకపోగా ఒక్క కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు నుంచి మరికల్‌, ధన్వాడ మండలాల్లోని కొన్ని గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందుతోంది. మిగతా నియోజకవర్గ ప్రాంతాలు సాగునీరు వనరులు లేక వర్షాధార పంటలు, అరకొర బోర్ల ద్వారా వచ్చే నీటితో సేద్యం చేస్తున్నారు.

అభివృద్ధి ప‌థ‌కాలు

నారాయణపేటలో 28.50 కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు, దామరగిద్ద నుంచి పేట వరకు బీటీ రోడ్డు పనులు, మరికల్‌ ట్యాంక్‌ బండ్‌ పనులు, పలు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఏర్పాటు అవుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో సాగునీటి వనరులు లేకపోవడం, రైల్వేలైను సదుపాయం లేక కృష్ణా మునీరాబాద్‌ లైను సర్వేలకే పరిమితం కావడం, పేట కొడంగల్‌ ఎత్తిపోతల పథకం జీవో 69 కార్యరూపం దాల్చక పోవడం, జిల్లాగా నారాయణపేట ఏర్పాటు కాకపోగా జిల్లా కోసం ఉద్యమం కూడా గతంలో జరిగింది.

వీడియోస్

ADVT