నియోజకవర్గం : అసెంబ్లీ

నాగర్ కర్నూల్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
198670
పురుషులు :
99934
స్త్రీలు :
98726
ప్రస్తుత ఎమ్మెల్యే :
మర్రి జనార్దన రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
నంది ఎల్లయ్య

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం ఓటర్లు: 198670
పురుషులు:99934
స్త్రీలు: 98726
ఇతరులు: 10
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
నియోజకవర్గంలో బీసీల జనాభా అధికంగా ఉంది. ప్రధానంగా మత్స్యకారులు, గొల్లకురుమలు అధికంగా ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ కేంద్రంలో ఆర్యవైశ్యుల జనాభా అధికంగా ఉండగా ఆ తరువాతి స్థానంలో ముస్లింలు, మున్నూరు కాపులున్నారు. బీసీలు విజయ అవకాశాలను తారుమారు చేయగలిగే సంఖ్యలో ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

ప్రారంభంలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న నాగర్‌కర్నూల్‌ జనరల్‌ స్థానం నుంచి బ్రహ్మారెడ్డి మొదటిసారి విజయం సాధించగా, ఎస్సీ రిజర్వ్‌ స్థానం నుంచి పుట్టపాగ మహేంద్రనాథ్‌ గెలుపొందారు. ఆ తరువాత నాగర్‌కర్నూల్‌ను జనరల్‌ స్థానంగా మార్చి అచ్చంపేటను ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ ఎస్సీ రిజర్వ్‌ స్థానం నుంచి గెలుపొందిన పుట్టపాగ మహేంద్రనాథ్‌, పీవీ నర్సింహ్మరావు క్యాబినేట్‌లో న్యాయశాఖమంత్రిగా పని చేశారు. ఆ తరువాత ఐదు పర్యాయాలు విజయం సాధించిన నాగం జనార్దన్‌రెడ్డి, ఎన్‌టీ. రామారావు, చంద్రబాబునాయుడుల మంత్రివర్గంలో ఎక్సైజ్‌, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, పౌరసరఫరాల శాఖను నిర్వర్తించారు.
 
రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలోని మండలాలు: నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట
లోక్‌ సభ నియోజకవర్గం పరిధి: నాగరకర్నూల్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 మర్రి జనార్దన్ రెడ్డి టీఆర్‌ఎస్ నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ 54354
2014 మర్రి జనార్దన రెడ్డి టీఆర్ఎస్ కె. దామోదర్ రెడ్డి కాంగ్రెస్ 14435
2012 ఎం. జనార్దన రెడ్డి ఇండి కె.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ 27325
2009 నాగం జనార్దన రెడ్డి టీడీపీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ 6593
2004 నాగం జనార్దన రెడ్డి టీడీపీ దామోదర్ రెడ్డి టీఆర్ఎస్ 1449
1999 నాగం జనార్దన రెడ్డి టీడీపీ దామోదర్ రెడ్డి ఇండి 31466
1994 నాగం జనార్దన రెడ్డి టీడీపీ వంగా మోహన్ గౌడ్ కాంగ్రెస్ 49040
1989 మోహన్ గౌడ్ కాంగ్రెస్ గోపాల్ రెడ్డి టీడీపీ 18813
1985 నాగం జనార్దన రెడ్డి టీడీపీ వి.ఎన్. గౌడ్ కాంగ్రెస్ 14667
1983 వి.ఎన్. గౌడ్ కాంగ్రెస్ ఎన్. జనార్దన రెడ్డి ఇండిపెండెంట్ 52
1978 శ్రీనివాస రావు కాంగ్రెస్ (ఐ) వి.ఎన్. గౌడ్ కాంగ్రెస్ 1369
1972 వి.ఎన్. గౌడ్ కాంగ్రెస్ రామచంద్రా రెడ్డి ఇండిపెండెంట్ 2453
1967 వీఎన్‌.గౌడ్‌ ఇండిపెండెంట్ కె.జె. రెడ్డి కాంగ్రెస్ 11574
1962 పుట్టపాగ మహేంద్రనాథ్‌ కాంగ్రెస్ మచ్చేందర్ రావు ఇండిపెండెంట్ 1107

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

సీ.ఎన్‌.రెడ్డి (విద్యాసంస్థల అధినేత).

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు

అభివృద్ధి ప‌థ‌కాలు

30కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు, 16కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం, 70లక్షల సొంత నిధులతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుద్దపూర్ణిమ ప్రాజెక్టు, జిల్లా కేంద్రంలో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల నిర్మాణం

పెండింగ్ ప్రాజెక్టులు

విద్యపరంగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం బాగా వెనుకబడింది. డిగ్రీ మినహా ఉన్నత చదువులకు సరైన విద్యాసంస్థలు ప్రభుత్వ, ప్రైవేట్‌పరంగా నెలకొల్పలేదు. జిల్లా ఆసుపత్రి ఆధునీకరణకు నిధులు కేటాయించినా డాక్టర్ల సమస్య బాగా వేధిస్తోంది. నియోజకవర్గంలో ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్‌, అత్యవసర సేవలకు ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ముఖ్య ప్రాంతాలు

గుడిపల్లిగట్టు రిజర్వాయర్‌ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. నాగర్‌కర్నూల్‌ కేసరి సముద్రం మధ్యలో ప్రతిష్టించిన 33అడుగుల ఏకశిల బుద్దవిగ్రహం రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన విగ్రహం. పర్యాటక ప్రదేశంగా రూపుదాల్చనుంది.

ఇతర ముఖ్యాంశాలు

నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ కేంద్రంలో అడుగుపెడితే అధికారంలో ఉన్న వారికి పదవిగండం ఉంటుందనే ప్రచారం బలంగా ఉంది. దీనికి తగినట్లుగానే ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఎన్‌టీ.రామారావు, సినీ నటుడు కృష్ణ ఓటమి పాలుకావడంతో ఆ తరువాత ఇంకెవరు నాగర్‌కర్నూల్‌లో అడుగుపెట్టే సాహసం చేయకపోవడం ఇక్కడి విశిష్టత.

వీడియోస్

ADVT