నియోజకవర్గం : అసెంబ్లీ

మక్తల్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
206909
పురుషులు :
102559
స్త్రీలు :
104331
ప్రస్తుత ఎమ్మెల్యే :
చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
ఏ.పి. జితేందర్ రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,06,909
పురుషులు:  1,02,559
స్త్రీలు: 1,04,331
ఇతరులు: 19
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
మక్తల్‌ నియోజకవర్గంలో ముదిరాజ్‌ బీసీ ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో బీసీ నినాదం కొంతమేర ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ఎస్సీలు కూడా కొంతమేర ఎన్నికల్లో ప్రభావం చేసే అవకాశముంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఓపెన్‌
నియోజకవర్గంలోని మండలాలు: మక్తల్‌, మాగనూర్‌, కృష్ణ, నర్వ, ఆత్మకూర్‌.  
లోక్‌సభ నియోజక వర్గం పరిధి: మహబూబ్‌ నగర్‌ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్‌ఎస్ జలంధర్ రెడ్డి స్వతంత్రం 47754
2014 చిట్టెం రామ్మోహన రెడ్డి కాంగ్రెస్ ఎల్లారెడ్డి టీఆర్ఎస్ 10027
2009 కె.దయాకర్ రెడ్డి టీడీపీ చిట్టెం రామ్మోహన రెడ్డి కాంగ్రెస్ 5701
2005 చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ సూగప్ప ఇండి 40079
2004 చిట్టెం నర్సిరెడ్డి కాంగ్రెస్ నాగూరావు నామాజీ బీజేపీ 2356
1999 ఎల్లారెడ్డి టీడీపీ చిట్టెం నర్సిరెడ్డి కాంగ్రెస్ 12563
1994 ఎల్లారెడ్డి టీడీపీ నాగూరావు బీజేపీ 17478
1989 చిట్టెం నర్సిరెడ్డి జనతాదళ్ నర్సింలు నాయుడు ఇండిపెండెంట్ 8552
1985 చిట్టెం నర్సిరెడ్డి జె.ఎన్.పి నర్సింలు నాయుడు టీడీపీ 25974
1983 నరసింహులు నాయుడు కాంగ్రెస్ ఎల్లా రెడ్డి జె.ఎన్.పి 6240
1978 నర్సింలు కాంగ్రెస్ (ఐ) చిట్టెం నర్సిరెడ్డి జె.ఎన్.పి. 5156
1972 కె. రామచందర్ రావు కాంగ్రెస్ - - 0
1967 కె.ఆర్. రావు కాంగ్రెస్ ఎస్. రావు ఇండిపెండెంట్ 2037
1962 రామచందర్ రావు కాంగ్రెస్ భాగోజీ అంబాదాస్ రావు ఇండిపెండెంట్ 13495

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ప్రధానంగా సంగంబండ, భూత్పూర్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కాల్వల ద్వారా సాగు చేస్తున్నారు. భూత్పూర్‌ ముంపు గ్రామంగా ప్రకటించినా నేటికీ నష్ట పరిహారం చెల్లించలేదు. మాగనూర్‌, కృష్ణ గ్రామ సరిహద్దుల నుంచి కృష్ణా, భీమా నదులు పారుతుండగా పరిసర గ్రామ రైతులు నదినీటితో పాటు ఎత్తిపోతల ద్వారా పంటలను సాగు చేస్తున్నారు. సంగంబండ నీటితో నర్వ, మక్తల్‌ మండలంలోని పలు చెరువులను నింపి సాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

అభివృద్ధి ప‌థ‌కాలు

సంగంబండ కుడి కాల్వ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. మిషన్‌ కాకతీయ కింద చెరువుల పూడికతీత పనులు, మక్తల్‌ పెద్ద చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా మార్చడం, ఊట్కూర్‌ మండలంలో ఎడివెళ్లి దగ్గర మునీరాబాద్‌ రైల్వే లైను పనులు నడుస్తున్నాయి. దేవరకద్ర నుంచి మునీరాబాద్‌ రైల్వే లైనులో భాగంగా ఊట్కూర్‌ మండలంలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో పలు మారుమూల గ్రామాలలో బీటీ రోడ్లు లేక రవాణాకు ఇబ్బందులు.
మక్తల్‌ కూరగాయల మార్కెట్‌ లేక పోవడం,
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుమతులు వచ్చినా ఏర్పాటు చేయకపోవడం,
బీసీ హాస్టల్‌ అద్దె భవనాల్లో కొనసాగుతూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భూత్పూర్‌, నేరేడ్‌గోం గ్రామ భూనిర్వాసితులకు జీవో వచ్చినా నష్టపరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు.

వీడియోస్

ADVT