నియోజకవర్గం : అసెంబ్లీ

భువనగిరి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
187846
పురుషులు :
94865
స్త్రీలు :
92972
ప్రస్తుత ఎమ్మెల్యే :
పైళ్ల శేఖర్‌రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం ఓటర్లు: 1,87,846
పురుషులు: 94,865
స్త్రీలు: 92,972 
ఇతరులు: 9
 
నియోజవకర్గంలో కీలక వర్గాలు: భువనగిరి నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల వారి ఓట్లే కీలకం. ముఖ్యంగా పద్మశాలి(చేనేత), యాదవులు, గీత కార్మికులు జనాభారీత్యా కీలకం. కానీ రాజకీయ ప్రాబల్యం, గెలుపు, ఓటములను ప్రభావితం చేసే సామాజిక వర్గం మాత్రం రెడ్డి సామాజిక వర్గమే.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: భువనగిరి
రిజర్వేషన్‌: జనరల్
జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా
నియోజకవర్గంలో ఉన్న మండలాలు: భువనగిరి, బీబీనగర్‌, వలిగొండ, పోచంపల్లి
ఏ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది: భువనగిరి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 పైళ్ల శేఖర్ రెడ్డి టీఆర్‌ఎస్ కె.అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ 24302
2014 పైళ్ల శేఖర్‌రెడ్డి టీఆర్ఎస్ జిట్టా బాలకృష్ణా రెడ్డి వైసీపీ 15416
2009 ఎలిమినేటి ఉమామాదవ రెడ్డి టీడీపీ జిట్టా బాలకృష్ణా రెడ్డి ఇండిపెండెంట్ 9353
2004 ఎలిమినేటి ఉమామాదవ రెడ్డి టీడీపీ ఎ. నరేంద్ర టీఆర్ఎస్ 17536
1999 ఎలిమినేటి మాదవరెడ్డి టీడీపీ అందెల లింగమ్ యాదవ్ కాంగ్రెస్ 8369
1994 ఎలిమినేటి మాదవరెడ్డి టీడీపీ నర్సారెడ్డి మడుగుల కాంగ్రెస్ 43519
1989 ఎలిమినేటి మాదవరెడ్డి టీడీపీ బాలయ్య గరదాసు కాంగ్రెస్ 22867
1985 ఎలిమినేటి మాదవరెడ్డి టీడీపీ వి. సురేంద్ర రెడ్డి కాంగ్రెస్ 34284
1983 కొమ్మిడి నరసింహ రెడ్డి కాంగ్రెస్ ఎమ్. బిక్షపతి ఇండిపెండెంట్ 6040
1978 కొమ్మిడి నరసింహ రెడ్డి కాంగ్రెస్(ఐ) కొండా లక్ష్మణ్ బాపూజీ జనతా 27422
1972 కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ కె. రంగారెడ్డి సీపీఎం 15234
1967 కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ ఆరుట్ల రామచంద్రరెడ్డి సీపీఐ 14147
1962 ఆరుట్ల రామచంద్రరెడ్డి సీపీఐ తుమ్మల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ 4284
1957 ఆర్. నారాయణరెడ్డి పీడీఎఫ్ వి. రామచంద్రరెడ్డి కాంగ్రెస్ 7810

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

జయిని మల్లయ్య గుప్తా: తెలంగాణ సాయుధ పోరాట యోధులయిన మల్లయ్య గుప్తా ఆంధ్ర మహాసభ నిర్వహణ నుంచి తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు. భాష, సాంస్కృతిక ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ప్రస్తుతం వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నారు.
 
కొమ్మిడి నర్సింహ రెడ్డి: కొమ్మిడి నర్సింహ రెడ్డి బీబీనగర్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గాంధేయ వాది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది కూడా సాధారణ జీవితం గడుపుతున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ నియోజకవర్గంలో సీసీఎంబీ, నిమ్స్‌తో పాటు సాగునీటి వనరులు, కాలుష్య నియంత్రణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
 
డాక్టర్‌ ఎన్‌. గోపి: ఎన్‌. గోపి ప్రముఖ కవి, రచయిత, తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన రచనలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో  ఎన్నో అవార్డులు పొందాయి.
 
జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య గౌడ్‌: ఈయనది వలిగొండ మండలం నెమిల కాల్వ గ్రామం. ఆయన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ బీసీ కమిషన్‌ చైర్మెన్‌గా భాద్యతలు నిర్వహిస్తున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

భువనగిరి నియోజకవర్గంలో నిమ్స్‌ వైద్యశాల, పోచంపల్లిలో శ్రీరామానంద గ్రామీణ శిక్షణ సంస్థ, చేనేత హాండ్లూమ్‌ పార్క్‌, ఆచార్య వినోభాబావే మందిరం, రూరల్‌ టూరిజం సెంటర్‌ ఉన్నాయి.
భువనగిరి ఏజీఐ గ్లాస్‌ ఫ్యాక్టరీ, బీబీనగర్‌ బాంబినో, హిందుస్తాన్‌ సానిటరీ వేర్‌ పరిశ్రమలు ఉన్నాయి. భువనగిరి నియోజకవర్గంలో సీసీఎంబీ పరిశోధనా సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదించారు.

అభివృద్ధి ప‌థ‌కాలు

భువనగిరి నియోజకవర్గంలో సాగునీటి, వైద్య, పారిశ్రామిక, టూరిజం రంగాల్లో అభివృద్ది పనులు సాగుతున్నాయి. పురపాలక, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం భువనగిరి సుందరీకరణ, పర్యాటకంగా భువనగిరి, పోచంపల్లి కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. పారిశ్రామికంగా భువనగిరి, పోచంపల్లి, బీబీనగర్‌లో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. సాగునీటి వనరుల కల్పనలో భాగంగా కాళేశ్వరం నీటి కోసం బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేస్తున్నారు. బునాదిగాని, పిల్లాయపల్లి కాల్వలను విస్తరణ, ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. బీబీనగర్‌ నిమ్స్‌లో ఐపీ సేవల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. భువనగిరి ఏరియా ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా అభివృద్ది చేయడానికి ప్రతిపాదించారు.

పెండింగ్ ప్రాజెక్టులు

భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన సమస్య కాలుష్యం, సాగు, తాగునీరు. పరిశ్రమల విస్తరణ, మూసీ నీటి కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసీ ప్రక్షాళన కోసం ఆందోళనలు చేస్తున్నారు. అయితే ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడంలేదు. తాగునీటికి మిషన్‌భగీరథ నీటిపై ఆధారపడినప్పటికీ. సక్రమంగా సరఫరా చేయడం లేదు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యల్లో రవాణ సమస్య ఒకటి. భువనగిరి, పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్‌ మండలాల నుంచి హైదరాబాద్‌కు సరైన ప్రజారవాణా సదుపాయం లేదు. అయితే నియోజవర్గానికి ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసి రవాణా సమస్యను పరిష్కరించారు. ఇక నిమ్స్‌ ఐపీ సేవల అమలుకు నోచుకోవడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

భువనగిరి ఖిల్లా: ఆసియాలోనే అతి ఎత్తైన ఏఖశిలా దుర్గం భువనగిరి. ఈ ఖిల్లాను జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. ఖిల్లాపైకి రోప్‌వేను కూడా ప్రతిపాదించారు.
 
మత్స్యగిరి గుట్ట: వలిగొండ మండలం వెంకటపురంలోని మత్స్యగిరి గుట్ట అత్యంత మహిమాన్వితమైనది. ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా వర్ధిల్లుతోంది.
 
బస్వలింగేశ్వర స్వామి ఆలయం: బీబీనగర్‌ మండలం పడమటి సోమారంలోని బస్వలింగేశ్వర స్వామి ఆలయం గిరిజనుల ఆరాధ్య దైవం. ఈ ఆలయంలో మొక్కుకుంటే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం.
 
సురేంద్ర పురి కళాదామం: భువనగిరి మండలం వడాయిగూడెం వద్ద గల సురేంద్రపురి ఇతిహాస, పురాణాలకు సంబంధించిన ప్రదర్శన శాల ప్రసిద్ధమైంది. దేశవ్యాప్తంగా దీనిని సందర్శిస్తారు.
 
శ్రీరామనందతీర్ధ గ్రామీణ సంస్థ: గ్రామీణ చేతివృత్తుల శిక్షణకు పోచంపల్లిలోని ఎస్‌ఆర్‌టీఐ అత్యంత ప్రతిష్టాత్మకమైంది.

ఇతర ముఖ్యాంశాలు

భువనగిరి శాసనసభా నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా చతుర్ముఖ పోటీ నెలకొననుంది. టీఆర్‌ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయాలనే యోచనలో ఉండడంతో ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారో వేచి చూడాలి. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ బలమైన పట్టుకలిగి ఉండగా గతంలో రెండు పర్యాయాలు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయిన యువ తెలంగాణ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మళ్లీ పోటీకి సై అంటున్నారు. అయితే ఆయన ఇతర పార్టీల్లో చేరి పోటీ చేస్తారా లేక మళ్లీ ఇండిపెండెంట్‌గానే బరిలో దిగుతారా అనేది ఆసక్తిగా మారింది.

వీడియోస్

ADVT