నియోజకవర్గం : అసెంబ్లీ

తుంగతుర్తి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
227233
పురుషులు :
114641
స్త్రీలు :
112583
ప్రస్తుత ఎమ్మెల్యే :
గ్యాదరి కిషోర్‌కుమార్‌
ప్రస్తుత ఎంపీ :
బూర నర్సయ్య గౌడ్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 227233
పురుషులు: 114641
స్త్రీలు: 112583
ఇతరులు: 09
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: బీసీలు(యాదవులు, గౌడ్స్‌ ఎక్కవ), దళితులు (మాదిగలు ఎక్కువ)

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: తుంగతుర్తి
రిజర్వేషన్‌: ఎస్సీ
జిల్లా: సూర్యాపేట జిల్లా
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి: సూర్యాపేట జిల్లాలో ఆరు మండలాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు మండలాలు, నల్లగొండ జిల్లాలో ఒక్క మండలం.
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, నూతనకల్‌, మద్దిరాల, నాగారం, తిరుమలగిరి, అర్వపల్లి, యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు, నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం.
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది: భువనగిరి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 గ్యాదరి కిశోర్ కుమార్ టీఆర్‌ఎస్ అద్దంకి దయాకర్ కాంగ్రెస్ 1847
2014 గాదరి కిషోర్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ అద్దంకి దయాకర్‌ కాంగ్రెస్‌ 2379
2009 మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ గుడిపాటి నర్సయ్య కాంగ్రెస్‌ 11863
2004 రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ సంకినేని వెంకటేశ్వర్‌రావు టీడీపీ 13184
1999 సంకినేని వెంకటేశ్వర్‌రావు టీడీపీ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ 4999
1994 రాంరెడ్డి దామోదర్‌రెడ్డి స్వతంత్ర వర్దెల్లి బుచ్చిరాములు సీపీఎం 1028
1989 రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ మల్లు స్వరాజ్యం సీపీఎం 5053
1985 రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ మల్లు స్వరాజ్యం సీపీఎం 12095
1983 మల్లు స్వరాజ్యం సీపీఎం ఆర్‌.విజయసేనారెడ్డి కాంగ్రెస్‌ 1897
1978 మల్లు స్వరాజ్యం సీపీఎం జె.శ్యాంసుందర్‌రెడ్డి స్వతంత్ర 5647
1972 గోరుగంటి వెంకటనర్సయ్య స్వతంత్ర ఎంవీఎన్‌.రెడ్డి సీపీఎం 3887
1967 భీంరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం వీఎన్‌.రెడ్డి కాంగ్రెస్‌ 1452
1962 ఎ.రంగారెడ్డి కాంగ్రెస్‌ భీంరెడ్డి నర్సింహారెడ్డి సీపీఐ 101

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

శాలిగౌరారం ప్రాజెక్ట్‌ (మధ్య తరహా), తుంగతుర్తి నియోజకవర్గంలో ఆరు మండలాలకు విస్తరించి ఎస్సారెస్పీ కాల్వ ఉంది తప్ప ప్రాజెక్టులు లేవు.

అభివృద్ధి ప‌థ‌కాలు

గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, మూసీ నదిలో మానాయకుంట-గురజాల మధ్య బ్రిడ్జి నిర్మాణం, మోత్కూరులో మినీ ట్యాంక్‌బండ్‌

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గం విద్య, వైద్య రంగాల్లో బాగా వెనుకబడి ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేవు. మోత్కూరు, తుంగతుర్తి మినహా మిగతా మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు లేవు. అగ్నిమాపక కేంద్రం లేదు. సాగునీటి సౌకర్యం లేదు. పరిశ్రమలు లేవు.

ముఖ్య ప్రాంతాలు

నాగారం మండలంలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రం, అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం, దర్గా, నూతనకల్‌ మండలంలోని మిర్యాల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం.

ఇతర ముఖ్యాంశాలు

తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంత నాయకులు కీలక పాత్ర పోషించారు. గతంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు లేదు. గతంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు నిలయంగా ఉన్న నియోజకవర్గం ఇప్పుడు మారింది. తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారి ఈ నియోజకవర్గంలోని మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వారు.

వీడియోస్

ADVT