నియోజకవర్గం : అసెంబ్లీ

నల్లగొండ

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నల్లగొండ
మొత్తం ఓటర్లు :
211737
పురుషులు :
104734
స్త్రీలు :
106989
ప్రస్తుత ఎమ్మెల్యే :
కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్ల సంఖ్య: 211737
పురుషలు:  104734
స్త్రీలు: 106989
ఇతరులు:  14
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: నల్లగొండ
రిజర్వేషన్‌: ఓపెన్‌
ఏ జిల్లాలో ఉంది: నల్లగొండ
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: నల్లగొండ మునిసిపాలిటీ, నల్లగొండ, తిప్పర్తి, కనగల్‌
ఏ లోక్‌ సభ నియోజకవర్గంలో ఉంది: నల్లగొండ
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్‌ఎస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ 23698
2014 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ కంచర్ల భూపాల్‌రెడ్డి స్వతంత్ర 10547
2009 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ నంద్యాల నర్సింహారెడ్డి సీపీఎం 8377
2004 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీడీపీ 22738
1999 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ నంద్యాల నర్సింహారెడ్డి సీపీఎం 4440
1994 నంద్యాల నర్సింహారెడ్డి సీపీఎం చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్‌ 29163
1989 మల్‌రెడ్డి రఘుమారెడ్డి టీడీపీ గుత్తా మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ 3398
1985 ఎన్టీరామారావు టీడీపీ ఎం. రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ 31587
1983 గుత్తా మోహన్‌రెడ్డి స్వతంత్ర గడ్డం రుద్రమ్మదేవి స్వతంత్ర 6639
1978 గుత్తా మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌(ఐ) చకిలం శ్రీనివాసరావు జనతా 4173
1972 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్‌ కె.ఏ.రెడ్డి సీపీఎం 9672
1967 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్‌ బిసా యలమంద సీపీఎం 6793
1962 బి. ధర్మబిక్షం సీపీఐ మహ్మద్‌ మరూఫ్‌ కాంగ్రెస్‌ 9673
1957 వెంకట్‌రెడ్డి పీడీఎఫ్‌ కె.ఆర్‌. రెడ్డి కాంగ్రెస్‌ 4558

ఇతర ముఖ్యాంశాలు

1952 నుంచి 15సార్లు నల్లగొండ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా మూడుమార్లు పీడీఎఫ్‌, ఏడుసార్లు కాంగ్రెస్‌, మూడుమార్లు టీడీపీ, సీపీఎం, సీపీఐ ఒక్కొక్కసారి, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. నల్లగొండ అసెంబ్లీ బరిలో దిగిన ధర్మ బిక్షం, చకిలం శ్రీనివాసరావు, మల్‌రెడ్డి రఘుమారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు తదుపరి లోక్‌ సభకు ఎంపికయ్యారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టు ప్రాబల్యం ఉండగా నల్లగొండ అసెంబ్లీలో ఆ కూటమి అభ్యర్ధులే విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌, టీడీపీ, కాంగ్రెస్‌ ఇలా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీల అభ్యర్ధులే నల్లగొండ అసెంబ్లీలోనూ పలుమార్లు గెలుపొందారు.
 
వరుసగా నాలుగుసార్లు 1999, 2004, 2009, 2014 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా ఎన్నకవుతూ వస్తున్నారు. వైయస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో వెంకట్‌రెడ్డి మంత్రిగా కొనసాగారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కమ్యూనిస్టులు ఉమ్మడిగా ఉన్నంత కాలం వరుస విజయాలు సాధించారు. చీలికల తర్వాత క్రమంగా ఇక్కడ ప్రాబల్యం కోల్పోతూ వస్తున్నారు. చీలికల తర్వాత ఒకమారు సీపీఐ, మరోమారు సీపీఎం గెలిచాయి. 2004 నుంచి ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీలు మూడు, నాలుగో స్థానాలకు పరిమితమవుతున్నారు.

వీడియోస్

ADVT