నియోజకవర్గం : అసెంబ్లీ

బెల్లంపల్లి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
అదిలాబాద్
మొత్తం ఓటర్లు :
149688
పురుషులు :
75522
స్త్రీలు :
74149
ప్రస్తుత ఎమ్మెల్యే :
దుర్గం చిన్నయ్య
ప్రస్తుత ఎంపీ :

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం జనాభా: 2,23,382
పురుషులు: 1,12,324
స్ర్తీలు: 1,11,058
 
నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు: 1,49,688
పురుషులు: 75,522
స్ర్తీలు: 74,149
ఇతరులు: 17 
 
నియోజకవర్గంలో 52,833 మంది ఎస్సీలు, 30547 మంది ఎస్టీలు ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

2009లో ఆసిఫాబాద్‌ నుంచి బెల్లంపల్లి నియోజకవర్గం పునర్విభజన సందర్బంగా ఏర్పడింది. ఇక్కడ 2009 ఎన్నికలలో సీపీఐ అభ్యర్ది గుండ మల్లేష్‌ ఎంపికయ్యారు. ఆయన సమీప కాంగ్రెస్‌ అభ్యర్ది చిలుముల శంకర్‌పై విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్దిని నిలబెట్టలేదు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్ది దుర్గం చిన్నయ్య 73,779 ఓట్లు సాధించగా రన్నరప్‌గా ఉన్న గుండా మల్లేష్‌ 21,251 ఓట్లు సాధించారు. గుండా మల్లేష్‌పై 52528 ఆదిక్యంతో విజయాన్ని అందుకున్నారు.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 దుర్గం చిన్నయ్య టీఆర్ఎస్ గడ్డం వినోద్ బీఎస్పీ 11276
2014 దుర్గం చిన్నయ్య టీఆర్ఎస్ గుండ మల్లేష్ సీపీఐ 52528
2009 గుండా మల్లేష్ సీపీఐ చిలుముల శంకర్ కాంగ్రెస్ 8892

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నీల్వాయి ప్రాజెక్ట్‌, సింగరేణి గనులు

అభివృద్ధి ప‌థ‌కాలు

పోచమ్మ చెరువు వద్ద ట్యాంక్‌బండ్‌ నిర్మాణం జరుగుతోంది. తాండూర్‌ వద్ద మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది.

పెండింగ్ ప్రాజెక్టులు

ఆగిపోయిన మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో ఆందోళన జరుగుతోంది. 28 గ్రామాలకు ఇంటర్‌లింక్‌ రోడ్లు అవసరం ఉంది. మామిడి ఎక్కువగా దిగుబడి ఉన్న నియోజకవర్గంలో మార్కెట్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆసుపత్రి అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ సిబ్బందిని నియమించలేదు. చాలా గ్రామాలకు బస్సులు లేవు. వేమనపల్లి బతుకమ్మ వాగుపై వంతెన నిర్మాణం, నెన్నెల, భీమిని, తాండూర్‌, కన్నెపల్లి మండలాలలో జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

ముఖ్య ప్రాంతాలు

రాజరాజేశ్వర స్వామి ఆలయం,  బుగ్గ లాంటి ప్రదేశాలు, సింగరేణి, ఓరియంట్‌ సిమెంట్‌, సిరామిక్స్‌ పరిశ్రమలు.

ఇతర ముఖ్యాంశాలు

బొగ్గు గనులపైనే నియోజకవర్గ అభివృద్ధి ఆధారపడి ఉంది. గోదావరి నుంచి మంచినీటి కోసం చాలా కాలంపాటు ఆందోళనలు కొనసాగాయి. బెల్లంపల్లి పట్టణాన్ని ఓపెన్‌కాస్టు గనిగా మార్చవద్దని కూడా ఆందోళనలు జరిగాయి. పట్టణానికి ఇబ్బంది జరగకుండా అధునాతన పద్దతులలో మిథేన్‌ను వెలికి తీయాలని సింగరేణి ప్రయత్నం చేస్తోంది. కార్మికులందరికీ పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సింగరేణి స్థలాలను స్వాధీనం చేసుకుంది.

వీడియోస్

ADVT