నియోజకవర్గం : అసెంబ్లీ

జహీరాబాద్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మెదక్
మొత్తం ఓటర్లు :
227874
పురుషులు :
115456
స్త్రీలు :
112394
ప్రస్తుత ఎమ్మెల్యే :
కె.మాణిక్ రావు
ప్రస్తుత ఎంపీ :
బీ.బీ.పాటిల్‌

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,27,874
పురుషులు: 1,15,456
స్త్రీలు: 1,12,394
 ఇతరులు: 24
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: జహీరాబాద్‌ నియోజకవర్గంలో వివిధ వర్గాల ఓటర్లు ఉన్నప్పటికీ ముస్లింలు, ఎస్సీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వీరు ప్రతిసారి జరిగే ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే, రెడ్లు, బీసీ వర్గాల్లో లింగాయత్‌లు, ముదిరాజ్‌, యాదవుల ఓట్లు కీలకంగా ఉన్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం: జహీరాబాద్‌
రిజర్వేషన్‌: ఎస్సీ
జిల్లా: సంగారెడ్డి(మెదక్)
నియోజకవర్గంలోని మండలాలు: కోహీర్‌, జహీరాబాద్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి
ఏ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది: జహీరాబాద్‌ లోక్‌సభ
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 మాణిక్‌రావు టీఆర్‌ఎస్‌ జె.గీతారెడ్డి కాంగ్రెస్‌ 34592
2014 జె.గీతారెడ్డి కాంగ్రెస్‌ మాణిక్‌రావు టీఆర్‌ఎస్‌ 842
2009 జె.గీతారెడ్డి కాంగ్రెస్‌ నరోత్తం టీడీపీ 2176
2004 ఫరీదుద్దీన్‌ కాంగ్రెస్‌ బాగన్న టీడీపీ 12863
1999 ఫరీదుద్దీన్‌ కాంగ్రెస్‌ గుండప్ప టీడీపీ 7188
1994 సి.బాగన్న టీడీపీ పి.నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ 34963
1989 పి.నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ ఆర్‌.దశరథ్‌రెడ్డి టీడీపీ 9497
1985 బాగారెడ్డి కాంగ్రెస్‌ ఆర్‌.దశరథ్‌రెడ్డి టీడీపీ 4951
1983 బాగారెడ్డి కాంగ్రెస్‌ టి.లక్ష్మారెడ్డి ఇండింపెండెంట్‌ 9897
1978 బాగారెడ్డి కాంగ్రెస్‌ నర్సింహారెడ్డి జనతాపార్టీ 8310
1972 బాగారెడ్డి కాంగ్రెస్‌ నారాయణరెడ్డి ఇండిపెండెంట్‌ 367
1967 బాగారెడ్డి కాంగ్రెస్‌ టి.లక్ష్మారెడ్డి ఇండిపెండెంట్ 5578
1962 బాగారెడ్డి కాంగ్రెస్‌ లతీఫ్‌ఉన్నీసాబేగం ఎస్‌డబ్ల్యుఏ 12411
1957 బాగారెడ్డి కాంగ్రెస్‌ నరేంద్రదత్తు ఎస్‌డబ్య్లుఏ 9799

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

కొబ్బాజి వీరేశలింగం: గ్రేన్‌ అసోసియేషన్‌ మర్చంట్‌లో గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన సలహాలు, సూచనల ఆధారంగానే గ్రేన్‌ అసోసియేషన్‌ మర్చంట్‌ సభ్యులు పనిచేస్తుంటారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
సాయిరెడ్డి విఠల్‌రెడ్డి: జహీరాబాద్‌ పట్టణంలో నిర్వహించే వివిధ రకాల సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారు. ఇప్పటి వరకు పలు పాఠశాలలకు, దేవాలయాలకు తన సహాయ సహకారాలు అందించారు.
అల్లాడి వీరేశం: జహీరాబాద్‌ పట్టణంలోని ప్రముఖ వస్ర్తవ్యాపారి. వ్యాపారంతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దేవాలయాల అభివృద్ధిలో సహాయ సహకారాలు అందిస్తుంటారు.
శంకర్‌పాటిల్‌: రాష్ర్టీయ బసవదళ్‌ అధ్యక్షుడు. లింగాయత్‌ సమాజ్‌ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యకలాపాలు చేపడుతూ సమాజ సేవ కోసం తన సహాయ సహకారాలు అందిస్తుంటారు.
నజీమోద్దీన్‌ గోరి: జమాతె ఇస్లామి హింద్‌, జహీరాబాద్‌ పట్టణ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లింలు సఖ్యతతో మెలిగేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
రతన్‌: జహీరాబాద్‌ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా గోశాలను నిర్వహించడమే కాకుండా వివిధ రకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

డీడీఎస్‌: జహీరాబాద్‌ మండలంలోని పస్తాపూర్‌ గ్రామంలో  30 సంవత్సరాలుగా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు డీడీఎస్‌ సంస్థను డైరెక్టర్‌ సతీష్‌ నెలకొల్పారు. చిరుధాన్యాలను సాగుచేసేందుకు గాను తరుచూ సమావేశాలను నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
నారింజ ప్రాజెక్టు: జహీరాబాద్‌ మండలంలోని కొత్తూర్‌(బి) గ్రామంలో 1967లో 3,000ఎకరాల సాగు లక్ష్యంతో కొత్తూర్‌, బూర్దిపాడ్‌, సత్వార్‌, బూచినెల్లి, మాడ్గి, చిరాగ్‌పల్లి, మల్కాపూర్‌, మిర్జాపూర్‌ గ్రామాలకు సాగు నీరు అందించేందుకు నారింజ ప్రాజెక్టును నిర్మించారు. ప్రస్తుతం నారింజ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం వల్ల ఆయకట్టు కింద ఉన్న భూములకు సాగునీరందడం లేదు.
పెద్దవాగు ప్రాజెక్టు: కోహీర్‌ మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామంలో 1980వ సంవత్సరంలో 1100 ఎకరాల సాగు లక్ష్యంతో పెద్దవాగు ప్రాజెక్టును నిర్మించారు. గొటిగార్‌పల్లి, పర్షపల్లి, శేడెగుట్టతండా, మల్‌చెల్మ తండా ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. ప్రాజెక్టు అభివృద్ధికంటూ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఎకరాకు కూడా సాగునీరందడం లేదు.

అభివృద్ధి ప‌థ‌కాలు

జహీరాబాద్‌ ప్రాంతంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జహీరాబాద్‌ నియోజకవర్గానికి కొత్తగా పది 33/11 కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్లు మంజూరు కాగా నాలుగు వినియోగంలో ఉన్నాయి. మిగిలినవి మంజూరు ప్రతిపాదన దశలో ఉన్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

జహీరాబాద్‌ ప్రాంతంలో రైతులు వాణిజ్య పంటలను(అల్లం, ఆలుగడ్డ, పసుపు) అధికంగా సాగు చేస్తున్నందున వాటిని నిలువ చేసుకోవడానికి వీలుగా కోల్డ్‌స్టోరేజీలు చాలా అవసరం. అలాగే జహీరాబాద్‌ ప్రాంతంలో అధికంగా 10 వేల ఎకరాల్లో ఏటా 8 లక్షల టన్నుల చెరుకు పంటను సాగుచేస్తున్నందున క్రషింగ్‌ చేసేందుకు గాను మరో కర్మాగారం నెలకొల్పాల్సిన అవసరం ఉంది.

ముఖ్య ప్రాంతాలు

జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో కేతకి సంగమేశ్వర ఆలయం ఉంది. ఇక్కడున్న కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. సంగమేశ్వరుని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు.

ఇతర ముఖ్యాంశాలు

వ్యవసాయం: జహీరాబాద్‌ నియోజకవర్గంలో కోహీర్‌, జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో సుమారు 65శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జహీరాబాద్‌, కోహీర్‌ మండలాల్లో వాణిజ్య పంటలైన అల్లం, అరటి, బొప్పాయి, పసుపు, చెరుకు తదితర పంటలను అధికంగా పండిస్తున్నారు. మిగిలిన ఝరాసంగం, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి మండలాల్లో చెరుకు సాగుతోపాటు, పత్తి, ఆరుతడి పంటలు, వర్షాధారిత పంటలు సాగుచేస్తున్నారు.
 ఆలయాలు: జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ఝరాసంగంలో దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీకేతకీ సంగమేశ్వరాలయం, న్యాల్‌కల్‌ మండలం రేజింతల్ గ్రామంలో సిద్దివినాయక ఆలయం, కోహీర్‌ మండలం బడంపేటలోని శ్రీరాచన్న స్వామి ఆలయాలు జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఈ ఆలయాలకు అనునిత్యం తెలంగాణ నుంచే కాకుండా మహరాష్ట్ర, కర్ణాటకలకు చెందిన భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు.
రాజకీయ పరిస్థితులు: జహీరాబాద్‌ డివిజన్‌లో జహీరాబాద్‌, మొగుడంపల్లి, కోహీర్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌, రాయికోడ్‌ మండలాలు ఉన్నాయి. జహీరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్‌ ఉంది. ఆ కారణం వల్లే కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. ఇటీవలి కాలంలో జహీరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ క్రమంగా బలం పుంజుకుంది. దీంతో ఈ నియోజకవర్గంలో ఈ సారి జరిగే శాసనసభ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
కర్మాగారాలు: జహీరాబాద్‌ ప్రాంతంలో 50 వివిధ రకాల కర్మాగారాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఆయా కర్మాగారాల్లో 10వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. జహీరాబాద్‌కు జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్‌) రావడం, బూచినెల్లి గ్రామశివారులో మరి కొన్ని కర్మాగారాలు రానున్నందున ఈ ప్రాంతంలో యువతకు, ప్రజలకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

వీడియోస్

ADVT