నియోజకవర్గం : అసెంబ్లీ

సంగారెడ్డి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మెదక్
మొత్తం ఓటర్లు :
197188
పురుషులు :
98624
స్త్రీలు :
98546
ప్రస్తుత ఎమ్మెల్యే :
టి.జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి)
ప్రస్తుత ఎంపీ :
కొత్త ప్రభాకర్‌ రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 1,97,188
పురుషులు: 98,624
స్త్రీలు: 98,546
ఇతరులు: 18
 

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: సంగారెడ్డి
రిజర్వేషన్‌: ఓపెన్‌
ఏ జిల్లాలో ఉంది: సంగారెడ్డి
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి: సంగారెడ్డి, కొండాపూర్‌, సదాశివపేట, కంది
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: మెదక్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 జయప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ చింతా ప్రభాకర్‌ టీఆర్‌ఎస్‌ 2589
2014 చింతా ప్రభాకర్‌ టీఆర్‌ఎస్‌ జయప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ 29000
2009 టి.జయప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ చింతా ప్రభాకర్‌ టీఆర్‌ఎస్‌ 6782
2004 టి.జయప్రకాశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ కె.సత్యనారాయణ బీజేపీ 17676
1999 కె.సత్యనారాయణ బీజేపీ టి.నందీశ్వర్‌గౌడ్‌ కాంగ్రెస్‌ 17504
1994 కె.సదాశివరెడ్డి టీడీపీ పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ 57550
1989 పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ ఆర్‌.శ్రీనివాస్‌గౌడ్‌ టీడీపీ 20800
1985 పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ కె.సదాశివరెడ్డి ఇండిపెండెంట్‌ 5600
1983 పి.రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్‌ పి.వీరారెడ్డి కాంగ్రెస్‌ 5500
1978 నర్సింహారెడ్డి ఇండిపెండెంట్‌ పి.రామచంద్రారెడ్డి జనతా 18000
1972 పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ కెఎన్‌ రెడ్డి సీపీఐ 19000
1967 నర్సింహారెడ్డి ఇండిపెండెంట్‌ రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ 2000
1962 పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ కెఎన్‌ రెడ్డి సీపీఐ 14000
1957 అంతయ్య ఎస్‌సీఎఫ్‌ ఎల్‌.కుమార్‌ కాంగ్రెస్‌ 800

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

శ్రీనివాస్‌ రెడ్డి (ఇండియా కబడ్డీకోచ్‌)

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గం పరిధిలోని కంది గ్రామ శివారులో ఐఐటీతో పాటు కొండాపూర్‌లో పురావస్తు ప్రదర్శనశాల, కులబ్‌గూర్‌లో మంజీర ప్రాజెక్టు, ఎద్దుమైలారంలో ఆయుధ కర్మాగారం (ఓడిఎప్‌), సంగారెడ్డిలో ఫల పరిశోధన కేంద్రం, హెరిటేజ్‌ జైలు, సదాశివపేటలో ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమలు ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కంది నుంచి బెంగళూర్‌ హైవే రోడ్డు విస్తరణ పనులు రూ.70 కోట్లతో జరుగుతున్నాయి. సంగారెడ్డి చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ వరకు రూ.14.50 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. సంగారెడ్డి–అకోలా రోడ్డు విస్తరణ కోసం రూ.250 కోట్లు మంజూరు కాగా సర్వే పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. సదాశివపేట, సంగారెడ్డి పట్టణాల్లో రూ.20 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాల్వల పనులు జరుగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో డంపింగ్ యార్డులు లేక ప్రజలు దీర్ఘకాలికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే సంగారెడ్డి మున్సిపల్‌ పరిధిలో డంప్‌ యార్డు నిర్మాణం కోసం గత సంవత్సరం రూ.1.16 కోట్లు విడుదలైనప్పటికీ పనులు ప్రారంభం కావడం లేదు. డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణ పనులు నియోజకవర్గ పరిధిలో నత్తనడకన సాగుతున్నాయి.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలోని కొండాపూర్‌లో పురావస్తు ప్రదర్శనశాల, కులబ్‌గూర్‌లో మంజీర ప్రాజెక్టు, 11వ శతాబ్దాం నాటి కాశీవిశ్వేశ్వరాలయం, సంగారెడ్డిలో ఫల పరిశోధన కేంద్రం, హెరిటేజ్‌ జైలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గ పరిధిలో కంది సమీపంలో ఐఐటీ హైదరాబాద్‌ ఏర్పాటు కావడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది. నియోజకవర్గ పరిధిలోని ఎద్దమైలారంలో ఆయుధ కర్మాగారం ఏర్పడడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశలు మెరుగు పడ్డాయి. అయితే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలను జీహెచ్‌ఎంసిలో విలీనం చేసి గ్రీన్‌జోన్‌గా ప్రకటించడంతో పారిశ్రామికవేత్తలు సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డిలో ఉన్న పాతజైలును జైళ్ల శాఖ ఐజీ వికె సింగ్‌ హెరిటెజ్‌ జైలు(ఫీల్‌ ద జైల్‌)గా మార్చడంతో ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, సెలబ్రెటీలు ఇక్కడ ఒక రోజు జైలు జీవితం గడిపెందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

వీడియోస్

ADVT