నియోజకవర్గం : అసెంబ్లీ

పటాన్‌చెరు

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మెదక్
మొత్తం ఓటర్లు :
273210
పురుషులు :
140988
స్త్రీలు :
132168
ప్రస్తుత ఎమ్మెల్యే :
గూడెం మహిపాల్‌రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
కొత్త ప్రభాకర్‌ రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,73,210
పురుషులు: 1,40,988
మహిళలు: 1,32,168
ఇతరులు: 54

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పటాన్‌చెరు ప్రత్యేక నియోజకవర్గంగా అవతరించింది. 
నియోజకవర్గం పేరు: పటాన్‌చెరు
రిజర్వేషన్‌: జనరల్‌
ఏ జిల్లాలో ఉంది: సంగారెడ్డి(మెదక్)
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి: పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: మెదక్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 గూడెం మహిపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ 37699
2014 గూడెం మహిపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సపానాదేవ్‌ టీడీపీ 0
2009 నందీశ్వర్‌గౌడ్‌ కాంగ్రెస్‌ సపానాదేవ్‌ టీడీపీ 0

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురంలో మహారత్నహోదా పరిశ్రమ బీహెచ్‌ఈఎల్‌ ఉంది. భానూర్‌లో రక్షణ పరకరాల ఉత్పత్తి సంస్థ బీబీఎల్‌, పటాన్‌చెరులో మెట్టపంటల పరిశోధనా అంతర్జాతీయ కేంద్రం ఇక్రిశాట్‌లు ఉన్నాయి. అమీన్‌పూర్‌ పెద్ద చెరువును ప్రభుత్వం జీవవైవిధ్య కేంద్రంగా ప్రకటించింది. అమీన్‌పూర్‌లో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బెటాలియన్‌ కేంద్రం ఉంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయి. అమీన్‌పూర్‌, కొల్లూరు, కిష్టారెడ్డిపేట, కర్ధనూర్‌ గ్రామాలలో సుమారు రూ.28 వేల డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు కొనసాగుతున్నాయి. తెల్లాపూర్‌, కొల్లూరు గ్రామాల మీదుగా ఔటర్‌ రింగ్‌రోడ్డును కలుపుతూ రేడియల్ రోడ్డు నిర్మాణం కొనసాగుతోంది.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రసాయన పరిశ్రమల వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. నియోజకవర్గంలో సుమారు 30 గ్రామాలను కాలుష్య పీడిత గ్రామాలుగా గుర్తించారు. కాలుష్యం సుదీర్ఘకాలంగా పటాన్‌చెరును పట్టి పీడిస్తోంది. చెరువులు, కుంటలు కలుషితమయ్యాయి. కాలుష్య పీడిత గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌భగీరథ కింద గ్రామగ్రామానికి తాగునీటి ఇచ్చే పథకం ద్వారా అయినా న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో ప్రధానంగా అమీన్‌పూర్‌ జీవవైవిధ్యకేంద్రంలో విదేశీ వలస పక్షలులను తిలకించేందుకు పక్షి ప్రేమికులు వస్తారు. బీరంగూడ గుట్టపై భ్రమరాంభామల్లికార్జున ఆలయం, రుద్రారంలోని గణేష్‌ ఆలయాలం, నవరత్న హోదా ఉన్న బీహెచ్‌ఎఎల్‌, రక్షణ పరికరాల తయారీ సంస్థ బీడీఎల్‌, వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇక్రీశాట్లు ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్శణలు.

ఇతర ముఖ్యాంశాలు

దేశంలోనే పెద్ద పారిశ్రామిక వాడగా పేరు గాంచింది. పలు పరిశ్రమల్లో పనిచేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దీంతో పటాన్‌చెరును మినీ ఇండియా అని పిలుస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెట్టపంటల పరిశోధనా కేంద్రం ఇక్రీశాట్‌ను సుమారు మూడువేల ఎకరాల్లో ఏర్పాటు చేశారు. రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ పరికరాల ఉత్పత్తి సంస్థ బీహెచ్‌ఈఎల్‌లో సుమారు 20వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. భారీ పరిశ్రమపై ఆధారపడి సుమారు 500 చిన్న పరిశ్రమలు పనిచేస్తున్నాయి. బానూర్‌లోని బీడీఎల్‌ రక్షణ పరికరాల సంస్థలో మిస్సైల్స్‌ను తయారు చేస్తున్నారు.

వీడియోస్

ADVT