నియోజకవర్గం : అసెంబ్లీ

మహబూబ్ నగర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
207280
పురుషులు :
104033
స్త్రీలు :
103244
ప్రస్తుత ఎమ్మెల్యే :
వి.శ్రీనివాస్ గౌడ్
ప్రస్తుత ఎంపీ :
ఏ.పి. జితేందర్ రెడ్డి

ఓట‌ర్లు

నియోజకవర్గ ఓటర్లు: 2,07,280 
పురషులు-  1,04,033
స్త్రీలు - 1,03,244
ఇతరులు -  03
నియోజకవర్గంలో కీలక వర్గాలు: 
ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఓట్లు సాధించేందుకు రాజకీయపార్టీల మధ్య ఎత్తులు, పైఎత్తులు సాగుతూ ఉంటాయి. మొత్తం 1,87,328 మంది ఓటర్లున్న మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు 40వేల పైచిలుకు ఉంటాయి. ఆ తర్వాత ఎస్సీ సామాజికవర్గం ఓట్లు 25 వేల వరకు ఉంటాయని భావిస్తున్నారు. ముదిరాజ్‌ సామాజికవర్గం ఓట్లు సుమారు 20వేలు, కురుమ, యాదవ సామాజికవర్గం ఓట్లు 13వేల వరకు, క్రిస్టియన్‌ కమ్యూనిటీ ఓట్లు 12వేల వరకు, గౌడ్‌ సామాజికవర్గం ఓట్లు 12వేల వరకు, రెడ్డి సామాజికవర్గం ఓట్లు 12వేల వరకు ఉంటాయని అంచనా. ఆర్యవైశ్య సామాజికవర్గం ఓట్లు 4 వేలు, బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు 3 వేలు, ఎస్టీల ఓట్లు 3 వేలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బీసీ, ముస్లిం ఓట్ల సమీకరణే ప్రతి ఎన్నికల్లో కీలకంగా మారుతుంది. జిల్లా కేంద్రమవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ఓట్లకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ముస్లిం కమ్యూనిటీ ఓట్లు గంపగుత్తగా పడే అవకాశాలుండడంతో ఈ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహ,ప్రతివ్యూహాలతో వ్యవహరిస్తుంటాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలో ఉన్న మండలాలు: మహబూబ్‌నగర్‌ అర్బన్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌, హన్వాడ
ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది: మహబూబ్‌నగర్‌  
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 వి. శ్రీనివాస్ గౌడ్ టీఆర్‌ఎస్ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ 57775
2014 వి.శ్రీనివాస్‌ గౌడ్‌ టీఆర్‌ఎస్‌ యెన్నంశ్రీనివాస్‌రెడ్డి బీజేపీ 3139
2012 యెన్నంశ్రీనివాస్‌రెడ్డి బీజేపీ సయ్యద్‌ ఇబ్రహీం టీఆర్‌ఎస్‌ 1879
2009 ఎన్‌.రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర సయ్యద్‌ ఇబ్రహీం టీఆర్‌ఎస్‌ 5164
2004 పులి వీరన్న స్వతంత్ర పి.చంద్రశేఖర్‌ టీడీపీ 19282
1999 పి.చంద్రశేఖర్‌ టీడీపీ పులి వీరన్న కాంగ్రెస్‌ 6688
1994 పి.చంద్రశేఖర్‌ టీడీపీ పులివీరన్న కాంగ్రెస్‌ 35133
1989 పులివీరన్న కాంగ్రెస్‌ పి.చంద్రశేఖర్‌ టీడీపీ 6041
1985 పి.చంద్రశేఖర్‌ టీడీపీ జి.సహదేవ్‌ కాంగ్రెస్‌ 13449
1983 పి.చంద్రశేఖర్‌ స్వతంత్ర ఎం.ఏ.షూకూరు కాంగ్రెస్‌ 6237
1980 ఆంజనేయులు కాంగ్రెస్‌ రాంరెడ్డి జనతాపార్టీ 17972
1978 ఎం. రాంరెడ్డి కాంగ్రెస్‌ కేకేరెడ్డి జనతాపార్టీ 11512
1972 ఇబ్రహీం అలీ అన్సారీ కాంగ్రెస్‌ రాజేశ్వర్‌రెడ్డి బీజేఎస్‌ 6661
1967 ఇబ్రహీం అలీ అన్సారీ కాంగ్రెస్‌ రాజేశ్వర్‌రెడ్డి బీజేఎస్‌ 17100
1962 ఎం.రాంరెడ్డి స్వతంత్ర ఇబ్రహీం అలీ అన్సారీ కాంగ్రెస్‌ 3652
1957 ఏగూరు చిన్నప్ప ప్రజాపార్టీ ఎం.రాంరెడ్డి పీఎస్‌పీ 1623

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

ఎం.రాఘవాచారి (పాలమూరు అధ్యయనవేదిక కన్వీనర్‌), కే.ఎస్‌.రవికుమార్‌ (విద్యాసంస్థల అధినేత), జలజం సత్యనారాయణ (విద్యావేత్త), మనోహర్‌రెడ్డి (ప్రముఖ న్యాయవాది).

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఇరిగేషన్‌ ప్రాజెక్టులేవీ ఈ నియోజకవర్గంలో లేవు. చెప్పుకోదగ్గ సంస్థలు ప్రభుత్వరంగం నుంచి కానీ, ప్రైవేట్‌ రంగం నుంచి కానీ ఇక్కడ ఏర్పాటు కాలేదు.

అభివృద్ధి ప‌థ‌కాలు

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేయించారు. అదేవిధంగా పట్టణంలో మెడికల్‌ కాలేజీ ,డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పనులు సాగుతున్నాయి. వీటితో పాటు ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ పనులు ఇక్కడ కూడా కొనసాగుతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో మయూరి పార్కును చక్కటి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. పట్టణంలోని పెద్దచెరువును మినీట్యాంక్‌బండ్‌గా మార్చారు. అదేవిధంగా అక్కడే గ్రీనరీతో పార్కుని అభివృద్ధి చేస్తున్నారు. 

పెండింగ్ ప్రాజెక్టులు

మహబూబ్‌నగర్‌ పట్టణంలో రోడ్ల విస్తరణ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నది. జడ్చర్ల-రాయ్‌చూర్ జాతీయ రహదారి కావడంతో దీన్ని విస్తరించడానికి, మరమ్మతులు చేయడానికి ఇబ్బంది కలుగుతోంది. ఈ రోడ్డు విస్తరణపై కేంద్రమంత్రి గడ్కరీని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనచోదకులకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవలే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ రోడ్డుని త్వరలోనే విస్తరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటే దాన్ని పరిష్కరించే చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. గతంలో వారం, పదిరోజులకు ఒకసారి కృష్ణాజలాలొస్తే, ఇప్పుడు రోజు మరచి రోజు తాగునీరందుతోంది. దీన్ని ప్రతిరోజు ఇచ్చేలా మిషన్‌భగీరథ పనులను కొనసాగిస్తున్నారు.

ముఖ్య ప్రాంతాలు

పిల్లలమర్రి పర్యాటక క్షేత్రం, మయూరి పార్కు, మన్యంకొండ దేవస్థానం.

వీడియోస్

ADVT