నియోజకవర్గం : అసెంబ్లీ

కొల్లాపూర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
205019
పురుషులు :
10443
స్త్రీలు :
10962
ప్రస్తుత ఎమ్మెల్యే :
జి.హర్షవర్ధన్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
నంది ఎల్లయ్య

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,03,667
పురుషులు: 1,04,003
మహిళలు: 99,642
ఇతరులు: 22
 
నియోజకవర్గంలో కిలక వర్గాలు: బీసీలు(గొల్ల కురుమ ఓటర్లు కీలకం). నియోజకవర్గంలో 60వేలకు పైగా వారి జనాభా ఉంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్
నియోజకవర్గంలో ఏ ఏ మండలాలు ఉన్నాయి: కొల్లాపూర్‌, కోడేరు, పెద్దకొత్తపల్లి, వీపనగండ్ల, పాన్‌గల్‌, పెంట్లవెల్లి, చిన్నంబావి, మొత్తం 7మండలాలు
ఏ లోక్‌ సభ నియోజవర్గ పరిధిలో ఉంది: నాగర్‌కర్నూల్‌ జిల్లా
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 జి.హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ జూపల్లి కృష్ణారావు టీఆర్‌ఎస్ 12546
2014 జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ 10498
2009 జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ జగదీశ్వర రావు టీడీపీ 15024
2004 జూపల్లి కృష్ణారావు ఇండి మధుసూదన రావు టీడీపీ 1508
1999 జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కె.మధుసూదన రావు టీడీపీ 3040
1994 కె. మధుసూదన రావు టీడీపీ కొత్త రామచందర్ రావు కాంగ్రెస్ 5348
1989 కొత్త రామచంద్రా రావు కాంగ్రెస్ సురవరం సుధాకర్ రెడ్డి సీపీఐ 33774
1985 కొత్త వెంకటేశ్వర రావు కాంగ్రెస్ సుధాకర్ రెడ్డి సీపీఐ 9159
1983 వెంకటేశ్వర రావు కాంగ్రెస్ వంగూరు కృష్ణారెడ్డి ఇండి 2499
1978 కొత్త వెంకటేశ్వర్రావు కాంగ్రెస్ రంగదాసు జె.ఎన్.పి 12708
1972 కె.రంగదాస్ ఇండి కొత్త వెంకటేశ్వర రావు కాంగ్రెస్ 14663
1967 నారాయణ రెడ్డి ఇండి కె.రంగదాస్ కాంగ్రెస్ 3531
1962 రంగదాస్ కాంగ్రెస్ గోపాలరావు సీపీఐ 1572
1957 నర్సింగరావు కాంగ్రెస్ గోపాల రావు పీడీఎఫ్ 1342

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కెవైఎఫ్‌ కొల్లాపూర్‌ యూత్‌ ఫెడరేషన్‌ సంస్థ స్థానిక ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్దం అయ్యే వారికి ఉచిత శిక్షణనిస్తుంది. దీనిని ఏల్లెని సుధాకర్‌ రావు నడుపుతున్నారు. ఇతను తెలంగాణ ఇందన పునరుద్దరణీయ సంస్థ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. మరో వ్యక్తి సురభి సంస్థానాధీశులు, రాజా ఆదిత్య వెంకటలక్ష్మారావు. ఇతనికి రాజకీయాలల్లోకి వచ్చే ఆసక్తి వున్నట్లు విశ్వసనీయ సమాచారం

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ప్రధానంగా ఎంజీఎల్‌ఐ ద్వారా లక్షా 13వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు, మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం నియోజకవర్గంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్య. ఇది పూర్తి అయితే కొల్లాపూర్‌ మరింత అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజల నమ్మకం. ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా నల్లమల గ్రామాలకు సాగునీరు అందించాలి. వాటికి ఇటివలే నిధులు మంజూరు అయ్యాయి.

వీడియోస్

ADVT