నియోజకవర్గం : అసెంబ్లీ

బోధన్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నిజామాబాద్
మొత్తం ఓటర్లు :
186478
పురుషులు :
90441
స్త్రీలు :
96029
ప్రస్తుత ఎమ్మెల్యే :
షకీల్ అహ్మద్
ప్రస్తుత ఎంపీ :
కల్వకుంట్ల కవిత

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 1,86,478
పురుషులు: 90,441
స్త్రీలు: 96,029
ఇతరులు:  08

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

 జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గ పరిధిలో బోధన్‌, రెంజల్‌, ఎడపల్లి, నవీపేట మండలాలు ఉన్నాయి. నిజామాబాద్‌ పార్లమెంట్ స్థానంలో ఈ నియోజకవర్గం ఉంది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 షకీల్ అహ్మద్ టీఆర్‌ఎస్ సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ 8262
2014 షకీల్ అహ్మద్ టీఆర్‌ఎస్ పి.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ 15884
2009 పి.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌ షకీల్‌ అహ్మద్‌ టీఆర్‌ఎస్ 1275
2004 పి.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌ అబ్దుల్‌ఖాదర్‌ టీడీపీ 16951
1999 పి.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌ రమాకాంత్‌ టీడీపీ 9289
1994 బసీరుద్దిన్‌బాబుఖాన్‌ టీడీపీ నర్సింహారెడ్డి బీజేపీ 20270
1989 కొత్త రమాకాంత్‌ టీడీపీ సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ 3595
1985 బసీరుద్దిన్‌బాబుఖాన్‌ టీడీపీ హన్మీరెడ్డి కాంగ్రెస్ 2653
1983 సాంబశివరావ్‌చౌదరి టీడీపీ ఎం.నారాయణరెడ్డి ఇండి 1639
1978 గులాం సందాని కాంగ్రెస్‌ నారాయణరెడ్డి కాంగ్రెస్ 23086
1972 ఎం.నారాయణరెడ్డి కాంగ్రెస్‌ ఆర్‌.డి.రావ్‌ ఇండి 7820
1967 ఆర్‌.భూంరావ్‌ ఇండిపెండెంట్‌ కెవి.రెడ్డి కాంగ్రెస్ 8624
1962 ఎం.రాంగోపాల్‌రెడ్డి ఇండిపెండెంట్‌ కెవి.రెడ్డి కాంగ్రెస్ 2831
1962 అల్లు దశవతారం కాంగ్రెస్ గొర్రిపాటి బుచ్చి అప్పారావు స్వతంత్ర 214
1957 శ్రీనివాస్‌రావ్‌ ఇండిపెండెంట్‌ కెవి.రెడ్డి కాంగ్రెస్ 1894
1952 ఎస్‌ఎల్‌.శాస్త్రి కాంగ్రెస్‌ శ్రీనివాస్‌రావ్‌ --- 0

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో ఆసియా ఖండంలోనే పేరు గాంచిన మొదటి చక్కెర కర్మాగారం నిజాంషుగర్స్‌ ఉంది. నైజాం హయాంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. వేలాది మంది కార్మికులకు ఈ ఫ్యాక్టరి ఉపాధినిచ్చింది. వేలమంది రైతులు ఈ ప్రాంతంలో చెరుకు సాగుచేస్తున్నారు. గోదావరి, మంజీర, ఆరిద్ర నదులు ఈ నియోజవర్గం పరిధిలోని కందకుర్తి వద్దనే త్రివేణి సంగమంగా మారుతాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా నిజాంషుగర్స్‌ సమస్య పరిష్కారం కావడంలేదు. ఫ్యాక్టరీ మూత పడడం వల్ల కార్మికులకు ఉపాధి దెబ్బతింది. చెరుకు రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫ్యాక్టరీ ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల చెరుకు రైతులు సాగు తగ్గించి ఇతర పంటల వైపు మళ్లారు. వరి, సోయా ఎక్కువగా రైతులు పండిస్తున్నా వాటి ఆధారిత పరిశ్రమలు మాత్రం లేవు.

ముఖ్య ప్రాంతాలు

ఎడపల్లి మండలంలో అలీసాగర్‌ సరస్సు పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. కందకుర్తిలో త్రివేణి సంగమం ఉంది. నవీపేట మండలం తుంగినిలో హనుమాన్‌ ఆలయం, బోధన్‌లో ఏకచక్రేశ్వర ఆలయం, జాన్కంపేట నర్సింహస్వామి ఆలయం, బీనోల గౌతమేశ్వర ఆలయాలు ఉన్నాయి. పంప కవి సమాధి బోధన్‌లో ఉంది.

ఇతర ముఖ్యాంశాలు

ఈ నియోజకవర్గంలో అందరూ సీనియర్‌ నేతలే అయినప్పటికీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మాత్రం ఏం రాలేదు. ఈ నియోజకవర్గ పరిధిలో వరి, సోయా, చెరుకు అత్యధికంగా పండిస్తారు. జిల్లాలో ఎక్కువగా వరి సాగుచేసే గ్రామాలు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి.

వీడియోస్

ADVT