నియోజకవర్గం : అసెంబ్లీ

కల్వకుర్తి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
198444
పురుషులు :
101956
స్త్రీలు :
96464
ప్రస్తుత ఎమ్మెల్యే :
జైపాల్ యాదవ్
ప్రస్తుత ఎంపీ :
నంది ఎల్లయ్య

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 1,98,444
పురుషులు: 1,01,956
స్త్రీలు: 96,464
థర్డ్‌ జెండర్‌: 24
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు:
కల్వకుర్తి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీల ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌ః ఓపెన్‌
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి:
కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి, వెల్దండ, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల మండలాలు ఉన్నాయి.
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉందిః నాగర్‌కర్నూల్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 జి. జైపాల్ యాదవ్ టీఆర్‌ఎస్ చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ 3447
2014 చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ తల్లోజు ఆచారి బీజేపీ 78
2009 జైపాల్ యాదవ్ టీడీపీ ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ 597
2004 ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ తల్లోజు ఆచారి బీజేపీ 22117
1999 జైపాల్ యాదవ్ టీడీపీ ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ 3403
1994 ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ గోపాల్ రెడ్డి ఇండి 1259
1989 చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ నందమూరి తారక రామారావు టీడీపీ 3568
1985 చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ లింగారెడ్డి జె.ఎన్.పి 9438
1983 సూదిని జైపాల్ రెడ్డి జె.ఎన్.పి రుక్మారెడ్డి కాంగ్రెస్ 17461
1978 సూదిని జైపాల్ రెడ్డి జె.ఎన్.పి కమల కాంతారావు కాంగ్రెస్ 13380
1972 సూదిని జైపాల్ రెడ్డి కాంగ్రెస్ బి. సత్యనారాయన రెడ్డి ఎస్టీఎస్ 9811
1967 జి. రెడ్డి ఇండి శాంతాబాయి కాంగ్రెస్ 4743
1964 శాంతాబాయి కాంగ్రెస్ జి.ఎం. రెడ్డి సీపీఐ 12361
1962 వెంకట్ రెడ్డి ఇండి శాంతాబాయి కాంగ్రెస్ 821

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

కల్వకుర్తి నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందించడానికి గత 30 సంవత్సరాల క్రితం కెఎల్‌ఐ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టును ఎంజీకెల్‌ఐగా గత ప్రభుత్వం పేరు మార్చింది. కల్వకుర్తి మండలం జంగారెడ్డి పల్లి వరకు ప్రధాన కాల్వ పనులు పూర్తి అయ్యాయి. చివరి ఆయకట్టు నాగిళ్ల వరకు పనులు కొనసాగుతున్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ఎంజీకేఎల్‌ఐ పనులతోపాటు ఇంటింటికి తాగు నీరు అందించడానికి మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. అన్ని గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అయ్యింది. నల్గొండ- జడ్చర్ల  ఫోర్‌ లేన్‌ పనులు కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

కల్వకుర్తి నియోజకవర్గంలో కెఎల్‌ఐ ప్రాజెక్ట్ పనులు జరగకపోవడం సమస్యగా ఉండేది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో మైసిగండి మైసమ్మ దేవాలయం, కడ్తాల్‌ సమీపంలోని పిరమిడ్‌ ధ్యాన కేంద్రం పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. మాడ్గుల మండలంలోని అంధుగుల గ్రామంలో పురావస్తు శాఖ తవ్వకాల్లో ఆదిమానవులు వాడిన వస్తువులు బయటపడ్డాయి.

వీడియోస్

ADVT