నియోజకవర్గం : అసెంబ్లీ

దేవరకద్ర

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
201826
పురుషులు :
100813
స్త్రీలు :
101011
ప్రస్తుత ఎమ్మెల్యే :
ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
ఏ.పీ. జితేందర్ రెడ్డి

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 2,01,826
పురుషులు: 1,00,813
స్త్రీలు: 1,01,011
ఇతరులు: 02
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: 
గ్రామీణ నియోజకవర్గమైన దేవరకద్రలో బీసీ కులాల జనాభా ఎక్కువగా ఉండడం విశేషం. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఎస్సీలవి 28 వేల ఓట్లుండగా, యాదవ సామాజికవర్గానికి చెందిన ఓట్లు 25 వేలు ఉన్నాయి. ముదిరాజ్‌ ఓట్లు 22 వేలు ఉన్నాయి. వాల్మీకీబోయల ఓట్లు 20 వేలు, సగర(ఉప్పర )కులస్తుల ఓట్లు 12వేల వరకు ఉంటాయని అంచనా. గౌడ్‌ సామాజికవర్గపు ఓట్లు 10వేల వరకు ఉండగా, రెడ్డి సామాజికవర్గపు ఓట్లు దాదాపు అదే సంఖ్యలో ఉంటాయి. ముస్లిం ఓట్లు ఆరువేలుండగా, ఎస్టీ సామాజికవర్గ ఓట్లు దాదాపు 5 వేల వరకు ఉంటాయి. బీసీ సామాజికవర్గంలోని ముదిరాజ్‌, యాదవ సామాజికవర్గాల ఓట్లు బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ వర్గాల ఓట్లు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీకి చెందినవారు గెలుపొందడం ఇక్కడ సామాజికవర్గాల ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
లోక్‌సభ నియోజకవర్గం: మహబూబ్‌నగర్‌ 
నియోజకవర్గంలోని మండలాలు: 1.దేవరకద్ర, 2. చిన్నచింతకుంట, 3. భూత్పూర్‌, 4. అడ్డాకుల, 5. మూసాపేట, 6. కొత్తకోట (వనపర్తి జిల్లా), 7. మదనాపురం (వనపర్తి జిల్లా)
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఆలవెంకటేశ్వర రెడ్డి టీఆర్‌ఎస్ పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ 34817
2014 ఆల వెంకటేశ్వరరెడ్డి టీఆర్‌ఎస్‌ పవన్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ 16922
2009 కొత్తకోటసీతాదయాకర్‌రెడ్డి టీడీపీ స్వర్ణసుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ 19036

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

జి.మధుసూదన్‌రెడ్డి (హైకోర్టు అడ్వకేట్‌), రాంకోటి (బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు)

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

కోయిల్‌సాగర్‌, శంకరసముద్రం, సరళాసాగర్‌ ప్రాజెక్టులున్నాయి. అదేవిధంగా జాతీయరహదారిని ఆనుకొని నియోజకవర్గముండడంతో ఇక్కడ పరిశ్రమలు వ్యాపించాయి. ప్రధానంగా భూత్పూర్‌ కేంద్రంగా కాటన్‌ సీడ్స్‌ కంపెనీలు, సీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటితో పాటు ఆస్బెస్టాస్‌ రేకులు తయారు చేసే ఆస్టర్‌ కంపెనీ ఇక్కడ ఏర్పాటయింది. అదేవిధంగా ఎంఎన్‌ఆర్‌ స్పిన్నింగ్‌ మిల్‌ ఉన్నది. కోజెంట్‌ గ్లాసు పరిశ్రమ, స్నేహ చికెన్‌ ఇండస్ట్రీ, వెంకటేశ్వర హాచరీస్‌ ఉన్నాయి. వీటితోపాటు నియోజకవర్గంలోని సీసీకుంట, అడ్డాకుల మండలాల్లో దాదాపు 3 వేల ఎకరాల విస్తీర్ణంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గానికే తలమానికంగా నిలిచే 19 టీఎంసీల సామర్థ్యం గల కరివెన రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధంగా శంకరసముద్రం బ్యాలన్స్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి.వీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి ఘనపురం బ్రాంచి కెనాల్‌ ద్వారా నియోజకవర్గంలోని 15వేల ఎకరాలకు నీరిచ్చేందుకు అవసరమైన కాల్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి. కోయిల్‌సాగర్‌ కాల్వల లైనింగ్‌ పనులు, కాల్వ పొడగింపు పనులు నడుస్తున్నాయి. ఈ సీజన్‌లో ఈ పనులన్నింటినీ పూర్తిచేసి ఈ ఆయకట్టుని 12 వేల ఎకరాల నుంచి 40 వేల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం ఇక్కడ రైతులకు ఉపయుక్తమైన నిర్ణయం. అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాగులపై హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అన్ని నియోజకవర్గాల మాదిరిగానే మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ పనులు ఇక్కడ కూడా కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉండే యువతకు ఉపాధి కల్పన గాను స్థానికంగా సాగునీటి వనరులు మెరుగుపరిచే క్రమంలో పాలమూరు-రంగారెడ్డిలో భాగంగా కరివెన రిజర్వాయర్‌ని ప్రతిపాదించి, పనులు కొనసాగిస్తుండడం గమనార్హం. అయితే స్థానిక పరిశ్రమల్లో స్థానికయువతకు ఉద్యోగావకాశాలు ఇప్పించే విషయంలో స్థానిక నాయకత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.

ముఖ్య ప్రాంతాలు

కోయిల్‌సాగర్‌, సరళాసాగర్‌, కందూరు రామలింగేశ్వరాలయం, కురుమూర్తి వెంకటేశ్వరాలయం, రాజమూరు ఆంజనేయస్వామి ఆలయం.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గంలోని కురమూర్తి వెంకటేశ్వరాలయ బ్రహోత్సవాలు వైభవంగా సాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఒకవైపు వైదిక సంప్రదాయాల ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తూ, గ్రామదేవతలను పూజించే తీరుగా గుట్టకింద మాంసాహారం వండుకొని తింటారు. ఒకవైపు పూజలు, మరోవైపు మాంసాహార నైవేద్యాలతో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండ జాతరగా కొనసాగుతుండడం ఇక్కడి విశేషం.

వీడియోస్

ADVT