నియోజకవర్గం : అసెంబ్లీ

నర్సాపూర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మెదక్
మొత్తం ఓటర్లు :
199465
పురుషులు :
98174
స్త్రీలు :
101281
ప్రస్తుత ఎమ్మెల్యే :
చిలుముల మదన్‌రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
కొత్త ప్రభాకర్‌ రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 1,99,465
పురుషులు: 98,174
స్త్రీలు: 1,01,281
ఇతరులు: 10
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: నర్సాపూర్ నియోజకవర్గంలో బీసీ వర్గంలో ముదిరాజుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత యాదవులు, గౌడ్లు, ముస్లింల ప్రభావం కూడా ఎన్నికల్లో కనపడుతుంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: నర్సాపూర్‌
రిజర్వేషన్‌: ఓపెన్‌
ఏ జిల్లాలో ఉంది: మెదక్‌
నియోజకవర్గంలోని మండలాలు: నర్సాపూర్‌, శివ్వంపేట, హత్నూర, కౌడిపల్లి, కొల్చారం, చిలప్‌చెడ్‌, వెల్దుర్తి మండలాలున్నాయి.
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: మెదక్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 చిలుముల మదన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సునీతారెడ్డి కాంగ్రెస్‌ 38120
2014 చిలుముల మదన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సునీతారెడ్డి కాంగ్రెస్‌ 14742
2009 వి.సునీతారెడ్డి కాంగ్రెస్‌ మదన్‌రెడ్డి టీడీపీ 0
2004 వి.సునీతారెడ్డి కాంగ్రెస్‌ మదన్‌రెడ్డి టీడీపీ 0
1999 వి.సునీతారెడ్డి కాంగ్రెస్‌ విఠల్‌రెడ్డి సీపీఐ 5039
1994 చిలుముల విఠల్‌రెడ్డి సీపీఐ జగన్నాథరావు కాంగ్రెస్‌ 17181
1989 చిలుముల విఠల్‌రెడ్డి సీపీఐ జగన్నాథరావు కాంగ్రెస్‌ 6641
1985 చిలుముల విఠల్‌రెడ్డి సీపీఐ జగన్నాథరావు కాంగ్రెస్‌ 17285
1983 సి.జగన్నాథరావు కాంగ్రెస్‌ విఠల్‌రెడ్డి సీపీఐ 8238
1978 చిలుముల విఠల్‌రెడ్డి సీపీఐ జగన్నాథరావు కాంగ్రెస్‌ 2220
1972 సి.జగన్నాథరావు కాంగ్రెస్‌ విఠల్‌రెడ్డి సీపీఐ 731
1967 సి.జగన్నాథరావు కాంగ్రెస్‌ విఠల్‌రెడ్డి సీపీఐ 691
1962 చిలుముల విఠల్‌రెడ్డి సీపీఐ జగన్నాథరావు కాంగ్రెస్‌ 3745
1957 జి.వీరయ్య కాంగ్రెస్‌ విఠల్‌రెడ్డి పీడీఎస్‌ 1828
1952 రామిరెడ్డి కాంగ్రెస్‌ భగవాన్‌దాస్‌ సోషలిస్టు 17640

అభివృద్ధి ప‌థ‌కాలు

నర్సాపూర్‌ నియోజకవర్గంలోని గ్రామాలలో, తండాలలో రోడ్లు వేశారు. దీంతో పాటు ఈ మధ్యనే నర్సాపూర్‌లో వంద పడకల ఆసుపత్రి ప్రారంభించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని కౌడిపల్లికి 50 పడకల ఆసుపత్రి మంజూరు అయింది. నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపోకు కూడా ఈ మధ్యనే సీఎం కేసీఆర్‌ పదికోట్లు కేటాయించారు.

పెండింగ్ ప్రాజెక్టులు

నర్సాపూర్‌ నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలలో ఒకటైన ఆర్టీసీ డిపో 20 ఏళ్లుగా కళగానే మిగిలి ఉంది. ఈ మధ్యనే సీఎం దీనికోసం నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా వంద పడకల ఆసుపత్రి ప్రారంభమైనా పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది లేరు. కేవలం నలుగురు డాక్టర్లతో సేవలు అందిస్తున్నారు. పీజీ కాలేజీకి సొంత భవనం లేక ఇక్కట్లు తప్పడం లేదు.శివ్వంపేట మండలం గోమారంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలో కూడా సరిపడ ఫ్యాకల్టీ లేక విద్యార్థుల చదువులు సాఫీగా సాగడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో పర్యాటక కేంద్రాలుగా కొన్ని ఆలయాలు ఉన్నాయి. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల అటవీ ప్రాంతంలో ఆంజనేయస్వామి ఆలయం ముఖ్యమైనది. సికింద్లాపూర్‌లోని లక్ష్మీనర్సింహస్వామి, చిలప్‌చెడ్‌ మండలం చిట్కుల్‌లోని చాముండేశ్వరీ ఆలయాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఎప్పుడూ సందడిగా ఉంటాయి. ఇక నర్సాపూర్‌లోని రాయరావు చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదద్దడానికి ఆస్కారం ఉంది.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గంలో అధిక భాగం అటవీ ప్రాంతంతో ఉంటుంది. అదేవిధంగా రాజకీయంగా కూడా భిన్నమైన ప్రాంతం. 1999 వరకు కూడా ఈ నియోజకవర్గానికి రాష్ట్రంలో కమ్యునిస్టుల కంచుకోటగా పేరుంది. ప్రస్తుతం ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నర్సాపూర్‌ నియోజకవర్గం వారే కావడం విశేషం.

వీడియోస్

ADVT