నియోజకవర్గం : అసెంబ్లీ

ఆసిఫాబాద్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
అదిలాబాద్
మొత్తం ఓటర్లు :
184057
పురుషులు :
92449
స్త్రీలు :
91564
ప్రస్తుత ఎమ్మెల్యే :
ఆత్రం సక్కు
ప్రస్తుత ఎంపీ :
గోడం నగేష్‌

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం జనాభా: 2,44,557
పురుషులు: 1,22,762
స్త్రీలు: 1,21,815
 
మొత్తం ఓటర్లు: 184057
పురుషులు: 92449
స్త్రీలు: 91564
ఇతరులు: 44
 
ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే కుల, మతాల ఓటర్ల వివరాలు పరిశీలిస్తే... బీసీ ఓటర్లే కీలకం.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఎస్టీ
నియోజకవర్గంలో ఎన్ని మండలాలున్నాయి: 10
(ఆసిఫాబాద్‌, రెబ్బెన, తిర్యాణి, వాంకిడి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌తో పాటు ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌, గాదిగూడ మండలాలు) 
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: ఆదిలాబాద్‌ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఆత్రం సక్కు కాంగ్రెస్ కోవలక్ష్మి టీఆర్ఎస్ 171
2014 కోవలక్ష్మి టీఆర్‌ఎస్‌ ఆత్రం సక్కు కాంగ్రెస్‌ 19055
2004 అమురాజుల శ్రీదేవి టీడీపీ గుండా మల్లేష్‌ సీపీఐ 5452
1999 డా.పాటిసుభద్ర టీడీపీ దాసరి నర్సయ్య కాంగ్రెస్‌ 11393
1994 గుండా మల్లేష్‌ సీపీఐ దాసరి నర్సయ్య కాంగ్రెస్‌ 34155
1989 దాసరి నర్సయ్య కాంగ్రెస్‌ గుండా మల్లేష్‌ సీపీఐ 5932
1985 గుండా మల్లేష్‌ సీపీఐ దాసరి నర్సయ్య కాంగ్రెస్‌ 4048
1983 గుండా మల్లేష్‌ సీపీఐ దాసరి నర్సయ్య కాంగ్రెస్‌ 303
1978 దాసరి నర్సయ్య కాంగ్రెస్‌(ఐ) గుండా మల్లేష్‌ సీపీఐ 3849
1972 కె.భీంరావు కాంగ్రెస్‌ సిడ మోతి సీపీఐ 19334
1967 కె.బి.రావు కాంగ్రెస్‌ ఎ.జి.రెడ్డి సీపీఐ 5983
1962 భీంరావు కాంగ్రెస్‌ ఆత్రం యశ్వంత్‌రావు సీపీఐ 5795
1957 జి.నారాయణరెడ్డి కాంగ్రెస్‌ కాశీరాం కాంగ్రెస్‌ 1321

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

నాగబాల సురేష్‌ చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా డాక్యూమెంటరీల నిర్మాణం చేస్తున్నారు. ఈయన మినహా ఇంకెవరు లేరు.

అభివృద్ధి ప‌థ‌కాలు

మిషన్‌ భగీరథ, జాతీయ రహదారి నిర్మాణం, కుమరం భీం ప్రాజెక్టు కాలువల తవ్వకం, సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణాలు

పెండింగ్ ప్రాజెక్టులు

ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలో ముఖ్యంగా రహదారుల సమస్య అధికంగా ఉంది. 193 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 232 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. రక్తహీనత, మలేరియా వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఇటీవలే ఆసిఫాబాద్‌కు 250 ఆసుపత్రి మంజూరైంది. అది పూర్తైతే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం. రహదారుల నిర్మాణానికి ఇప్పటికీ నిధులు ఇవ్వలేదు.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో కుమరం భీం స్మృత్యర్థం నిర్మించిన జోడేఘాట్‌, ఆదివాసీల పుణ్యక్షేత్రం జంగుబాయి, మిట్టె జలపాతం వంటివి పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. కీలక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలేమి లేవు.

ఇతర ముఖ్యాంశాలు

ఆసిఫాబాద్‌ నియోజక వర్గం భౌగోళికంగా భిన్నమైన పరిస్థితులతో కూడుకొని ఉంటుంది. నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో పూర్తిగా ఆదివాసీ మండలాలు కాగా రెండు మండలాల్లో పాక్షికంగా ఆదివాసీ జనాభా ఉంది. ఇక్కడ మరాఠి, తెలుగు, గోండి, కోలామి, లంబాడ వంటి బహుళ భాషలు వాడుకలో ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మహారాష్ట్ర, తెలంగాణకు మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. కెరమెరి మండల పరిధిలోకి వచ్చే 16 గ్రామాలపై 70 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఆ గ్రామాల్లో ఇరు రాష్ట్రాలు పోటాపోటిగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. భౌతికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజానీకం ఎక్కువగా మహారాష్ట్రతోనే సత్సంబంధాలు, బంధుత్వాలు కలిగి ఉన్నారు.

వీడియోస్

ADVT