నియోజకవర్గం : అసెంబ్లీ

నారాయణఖేడ్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మెదక్
మొత్తం ఓటర్లు :
203552
పురుషులు :
103014
స్త్రీలు :
100533
ప్రస్తుత ఎమ్మెల్యే :
మహారెడ్డి భూపాల్‌రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
బీ.బీ.పాటిల్‌

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,03,552
పురుషులు: 1,03,014 ; మహిళలు: 1,00,533 
 
కీలక వర్గాలు: నియోజకవర్గంలో గ్రామాలతో సమానంగా గిరిజన తండాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో గిరిజన జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. నియోజకవర్గంలో గిరిజనులతో పాటు ఎస్సీ ఓటర్లు కూడా కీలకమే.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: నారాయణఖేడ్‌
రిజర్వేషన్‌: ఓపెన్‌
జిల్లా: సంగారెడ్డి(మెదక్)
నియోజకవర్గంలోని మండలాలు: నారాయణఖేడ్‌, మనూరు, నాగల్‌గిద్ద , కల్హేర్‌, సిర్గాపూర్‌, కంగ్టి
ఏ లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: జహీరాబాద్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఎం. భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సురేష్ షెట్కార్ కాంగ్రెస్ 58508
2016 ఎం.భూపాల్ రెడ్డి(ఉప ఎన్నిక) టీఆర్ఎస్ పట్లోళ్ల సంజీవ రెడ్డి కాంగ్రెస్ 53625
2014 పట్లొళ్ల కిష్టారెడ్డి కాంగ్రెస్‌ ఎం. భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ 14746
2009 పట్లొళ్ల కిష్టారెడ్డి కాంగ్రెస్‌ ఎం. విజయపాల్‌రెడ్డి పీఆర్‌పీ 27452
2004 సురేశ్‌ షెట్కార్‌ కాంగ్రెస్‌ ఎం. విజయపాల్‌రెడ్డి టీడీపీ 6326
1999 పట్లొళ్ల కిష్టారెడ్డి కాంగ్రెస్‌ ఎం. విజయపాల్‌రెడ్డి టీడీపీ 7557
1994 ఎం. విజయపాల్‌రెడ్డి టీడీపీ పి.కిష్టారెడ్డి స్వతంత్ర 21818
1989 పట్లొళ్ల కిష్టారెడ్డి కాంగ్రెస్‌ ఎం.వెంకట్‌రెడ్డి టీడీపీ 5338
1985 శివరావుషెట్కార్‌ కాంగ్రెస్‌ ఎం.వెంకట్‌రెడ్డి టీడీపీ 4456
1983 ఎం.వెంకట్‌రెడ్డి టీడీపీ శివరావుషెట్కార్‌ కాంగ్రెస్‌ 2940
1978 శివరావుషెట్కార్‌ కాంగ్రెస్‌ ఎం.వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ 11277
1972 ఎం. వెంకట్‌రెడ్డి స్వతంత్ర శివరావుషెట్కార్‌ కాంగ్రెస్‌ 10657
1967 శివరావుషెట్కార్‌ కాంగ్రెస్‌ ఏఆర్‌.కేఆర్‌.పాటిల్‌ స్వతంత్ర 2584
1962 రాంచందర్‌రావు దేశ్‌పాండే స్వతంత్ర అప్పారావుషెట్కార్‌ కాంగ్రెస్‌ 2208
1957 అప్పారావుషెట్కార్‌ కాంగ్రెస్‌ శివలింగప్ప స్వతంత్ర 7823
1952 అప్పారావుషెట్కార్‌ కాంగ్రెస్‌ హెచ్‌. రావు సోషలిస్టు 11554

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నల్లవాగు ప్రాజెక్టు: సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా 5,900 ఎకరాల వరకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇందులో కుడి కాలువ ద్వారా కల్హేర్‌ మండలంలోని సాగు భూములకు సాగునీరు అందుతుండగా , ఎడమ కాలువ ద్వారా కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందుతోంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి పూర్తిగా వెనుకబడి ఉండేది. పది శాతం కూడా డబుల్‌ లేన్‌ రోడ్లు ఉండేవి కావు. ప్రస్తుతం రహదారుల అభివృద్ధి చురుకుగా సాగుతుండడంతో ఇప్పటికే 50 శాతం రోడ్లు డబుల్‌ లేన్‌ రోడ్లుగా అభివృద్ది చెందాయి. దీనికి తోడు నిజాంపేట బీదర్‌, రహదారిని జాతీయ రహదారిగా గుర్తించారు. అంతే కాకుండా హైదరాబాదు అకొల రహదారిని కూడా నాలుగు లేన్‌ల రోడ్డుగా విస్తరించే పనులు చురుకుగా సాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో గ్రామాలతో సమానంగా గిరిజన తండాలున్నాయి. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకపోగా అధిక శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. దీంతో ప్రతి సంవత్సరం నియోజకవర్గం నుంచి 40 శాతం జనాలు వలసబాట పడుతుంటారు. అయినప్పటికీ ప్రభుత్వం వలసల నివారణకు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడంతో వలసలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి.

ముఖ్య ప్రాంతాలు

జిల్లాలో జీవనదిగా పేరుగాంచిన మంజీరా కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గాం జన్‌వాడ వద్ద ప్రవేశిస్తుంది. మనూరు మండలం బోరంచ వద్ద పోచమ్మ దేవాలయంతో పాటు నల్లవాగు ప్రాజెక్టు మాత్రమే పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

నారాయణఖేడ్‌ నియోజకవర్గం కర్ణాటక, మహరాష్ట్రల సరిహద్దుల్లో ఉండడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు తెలుగు భాషతో పాటు కన్నడ, మరాఠి, ఉర్దూ, ఆంగ్లం, హిందీ, భాషలే కాకుండా గిరిజనులు అధికంగా ఉండడంతో గోర్‌బోలి భాషలోనూ మాట్లాడుతుంటారు. సరిహద్దు గ్రామాల్లోని వారికి తెలుగు భాష సక్రమంగా రాకపోవడం విశేషం.

వీడియోస్

ADVT