నియోజకవర్గం : అసెంబ్లీ

మెదక్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మెదక్
మొత్తం ఓటర్లు :
193141
పురుషులు :
92899
స్త్రీలు :
100234
ప్రస్తుత ఎమ్మెల్యే :
పద్మా దేవేందర్‌రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
కొత్త ప్రభాకర్‌ రెడ్డి

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 1,93,141
పురుషులు: 92,899
స్త్రీలు: 1,00,234
థర్డ్‌ జెండర్స్‌: 08

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: మెదక్‌
రిజర్వేషన్: జనరల్‌
ఏ జిల్లా: మెదక్‌
నియోజకవర్గంలో ఏయే మండలాలున్నాయి: మెదక్‌, హవేళీఘణపూర్‌ రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట,
ఏ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: మెదక్
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2014 ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఎం. విజయశాంతి కాంగ్రెస్ 0
2009 మైనంపల్లి హన్మంతరావు టీడీపీ శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ 0
2004 పి.శశిధర్ రెడ్డి జనతా పార్టీ కె.ఉమాదేవి టీడీపీ 0
2002 కె.ఉమాదేవి టీడీపీ పి.శశిధర్ రెడ్డి కాంగ్రెస్ 0
1999 కె.రామచందర్ రావు టీడీపీ పి.జె.విఠల్ రెడ్డి కాంగ్రెస్ 0
1994 కె.రామచందర్ రావు టీడీపీ పి.నారాయణ రెడ్డి కాంగ్రెస్ 0
1989 పి.నారాయణ రెడ్డి కాంగ్రెస్ కె.రామచందర్‌రావు టీడీపీ 0
1985 కె.రామచందర్ రావు టీడీపీ ఎం.ఎన్.లక్ష్మీనారాయణ కాంగ్రెస్ 0
1983 కె.రామచందర్ రావు టీడీపీ ఎస్.లక్ష్మారెడ్డి కాంగ్రెస్ 0
1978 ఎస్.లక్ష్మారెడ్డి కాంగ్రెస్(ఐ) కె.రామచందర్ రావు కాంగ్రెస్ 0
1972 రామచంద్రారెడ్డి కాంగ్రెస్ దేవేందర్ స్వతంత్ర అభ్యర్థి 0
1967 రామచంద్రారెడ్డి కాంగ్రెస్ కె.సంగమేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి 0
1962 కె.ఆనంద్ దేవి సీపీఐ ఎస్.కె.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి 0

అభివృద్ధి ప‌థ‌కాలు

మెదక్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, బీటీ మరమ్మతులు, సీసీ రోడ్లు, విస్తరణ పనులకు నిధులు అధిక సంఖ్యలో మంజూరయ్యాయి. పనులు సైతం అత్యంత వేగంగా సాగుతున్నాయి. మెదక్-వడియారం రోడ్డు విస్తరణ పనులు, బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతోంది. మెదక్-అక్కన్నపేట రహదారి విస్తరణ పనులతో పాటు పట్టణంలో రోడ్డు వెడల్పు, మురుగు కాలువలు నిర్మిస్తున్నారు. మెదక్ ప్రధాన రహదారి విస్తరణకు రూ.102 కోట్లు, బీటీ రోడ్ల పునరుద్ధరణకు రూ.145.45 కోట్లు మంజూరయ్యాయి. రూ.130 కోట్ల మిషన్ భగీరథ నిధులతో మెదక్, అందోల్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాల్లో పనులు జరుగుతున్నాయి. రూ.9 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్, నియోజకవర్గ కేంద్రమైన మెదక్‌లో రూ.9 కోట్లతో పిట్లం, గోసముద్రం చెరువులను కలిపి మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం డిప్యూటీ స్పీకర్ నిధులు సైతం మంజూరు చేయించారు. గోసముద్రం తీరాన ప్రసిద్ధికెక్కిన పంచముఖి హనుమాన్ దేవాలయం ఉండడం, చుట్టూ పొలాలతో ఈ ప్రాంతమంతా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత శోభను సంతరించుకోనుంది.
 
రూ.100 కోట్లతో ఘణపూర్ ప్రాజెక్టు ఎత్తు పెంపు: జిల్లాలోనే ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు అభివృద్ధికి టీఆర్‌ఎస్ సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కేసీఆర్ 2014 డిసెంబర్ 18న ఈ ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించి అభివృద్ధికి అప్పటికప్పుడే రూ.50 కోట్లు ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిల కృషితో మళ్లిపోయిన రూ.24.50 కోట్ల నిధుల్ని వెనక్కిరప్పించి కెనాల్ సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభించారు. ప్రధానంగా ఆనకట్ట ఎత్తు పెంచడంతో పాటు ప్రాజెక్టు వద్దనున్న అన్ని గేట్లు, షెటర్లను బిగిస్తున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు

1.నిజాం దక్కన్‌ షుగర్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ మూసివేత
2.గత రెండేళ్ల క్రితం మెదక్‌ మంబోజిపల్లిలోని ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారానికి యాజమాన్యం లేఆఫ్‌ ప్రకటించడంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారికి గత రెండు సంవత్సరాలుగా వేతనాలు రావడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గం పరిధిలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రాంతాలు, నిర్మాణాలు ఉన్నాయి. పాపన్నపేట మండలం నాగ్సానిపల్లి వద్ద ఉన్న ఏడుపాయల ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా రాష్ట్రవ్యాప్త గుర్తింపు పొందింది.
 
మెదక్‌ పట్టణంలోని చర్చి ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన ప్రముఖ పర్యాటక కేంద్రం. మెదక్‌లోనే కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించిన దుర్గం (ఖిల్లా) చరిత్రకు సాక్ష్యంగా ఉంది. నిజాంకాలంలో జిల్లాలో నెలకొల్పిన తొలి ఉన్నత పాఠశాల ఫోకానియా మెదక్‌లో ఉంది. జిల్లాకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ విద్యాలయంలోనే చదివారు.
 
మెదక్‌ మండల పరిధిలోని పోచారం వన్యప్రాణి అభయారణ్యంలో కృష్ణ జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం ఉంది. నిజాం స్టేట్‌ ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయ్యాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు, జిల్లాల విభజనలో నాటి పలు జిల్లాల కేంద్రం మెదక్‌ను రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా కుదించారు.
 
1980లో ఇందిరాగాంధీ మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచి ప్రధాన మంత్రి పదవి అలంకరించడంతో మెదక్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
 
ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి మెదక్‌ పట్టణానికి తలమానికంగా భాసిల్లుతోంది. మెదక్‌లో ప్యాలెస్‌ను తలపించేలా ఉన్న వెస్లీ ఉన్నత పాఠశాల భవనం సినిమా షూటింగ్‌లకు కేంద్రంగా మారింది.

వీడియోస్

ADVT