నియోజకవర్గం : అసెంబ్లీ

గజ్వేల్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మెదక్
మొత్తం ఓటర్లు :
227934
పురుషులు :
114362
స్త్రీలు :
113554
ప్రస్తుత ఎమ్మెల్యే :
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
ప్రస్తుత ఎంపీ :
కొత్త ప్రభాకర్‌ రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,27,934
పురుషులు: 1,14,362
స్త్రీలు: 1,13,554
థర్డ్‌ జెండర్‌: 18
 
నియోజకవర్గంలో కీలకవర్గాలు: ఓటర్లలో సుమారు 50 శాతం బీసీలున్నారు. అందులో అత్యధికంగా ముదిరాజ్‌ కులస్తులు ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

గజ్వేల్‌ నియోకజవర్గం 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1957లో ఎస్సీ నియోకజవర్గంగా రిజర్వ్‌ అయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం గజ్వేల్‌ నియోజకవర్గం జనరల్‌ స్థానంగా మారిపోయింది.
నియోజకవర్గం పేరు: గజ్వేల్‌
రిజర్వేషన్‌: ఓపెన్‌
ఏ జిల్లాలో ఉంది: సిద్దిపేట (మెదక్‌)
నియోజకవర్గం పరిధిలోని మండలాలు: గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, ములుగు, మర్కుక్‌, వర్గల్‌, కొండపాక, తూప్రాన్‌, మనోహరాబాద్‌ (నియోజకవర్గంలోని మరో రెండు మండలాలు తూప్రాన్‌, మనోహరాబాద్‌లు జిల్లాల పునర్విభజనలో మెదక్‌ జిల్లాలో చేరాయి)
ఏ లోక్‌సభ నియోజకవర్గ  పరిధిలోకి వస్తుంది: మెదక్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ వంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ 58290
2014 కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ వంటేరు ప్రతాప్‌రెడ్డి టీడీపీ 19391
2009 టి.నర్సారెడ్డి కాంగ్రెస్ వంటేరు ప్రతాప్‌రెడ్డి టీడీపీ 7175
2004 జె. గీతారెడ్డి కాంగ్రెస్ నంది దుర్గయ్య టీడీపీ 24260
1999 సంజీవరావు టీడీపీ జె.గీతారెడ్డి కాంగ్రెస్ 2427
1994 జి. విజయరామారావు టీడీపీ జె.గీతారెడ్డి కాంగ్రెస్ 19292
1989 జె.గీతారెడ్డి కాంగ్రెస్ సంజీవరావు టీడీపీ 3358
1985 బి సంజీవరావు టీడీపీ గజ్వేల్‌ సైదయ్య కాంగ్రెస్ 7382
1983 అల్లం సాయిలు స్వతంత్ర గజ్వేల్‌ సైదయ్య కాంగ్రెస్ 3961
1978 గజ్వేల్‌ సైదయ్య కాంగ్రెస్‌(ఐ) అల్లం సాయిలు జనతా పార్టీ 8731
1972 గజ్వేల్‌ సైదయ్య కాంగ్రెస్ అల్లం సాయిలు స్వతంత్ర 4923
1967 గజ్వేల్‌ సైదయ్య కాంగ్రెస్ జేహెచ్‌. కృష్ణమూర్తి 0 5438
1962 గజ్వేల్‌ సైదయ్య స్వతంత్ర జి. వెంకటస్వామి కాంగ్రెస్ 1035
1957 జేబీ ముత్యాలరావు కాంగ్రెస్ ఆర్‌.నర్సింహ్మారెడ్డి 0 2258

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

గుమ్మడి విఠల్‌రావు(గద్దర్‌): ప్రజా యుద్దనౌక, ప్రజా కవి గద్దర్‌ అలియాస్‌ గుమ్మడి విఠల్‌రావు గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి. గద్దర్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పరిచయం అవసరం లేని పేరు. అటు మావోయిస్టు ఉద్యమంతో పాటు ఇటు ప్రజా ఉద్యమంలో పాలు పంచుకున్న ఆయన ప్రజాకవిగా ఎన్నో పాటలు పాడారు. తెలంగాణ ఉద్యమంలో సమాజాన్ని చైతన్యపరుస్తూ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు కదిలిన వ్యక్తి ఆయన. 
బి.నర్సింగరావు: మావూరు, దాసి, రంగుకళలు లాంటి జాతీయ ఉత్తమ చిత్రాలను అందించిన బి.నర్సింగరావు గజ్వేల్‌ మండల పరిధిలోని ప్రజ్ఞాపూర్‌కు చెందినవారు. ప్రజ్ఞాపూర్‌లో పుట్టినప్పటికీ చిన్నతనంలోనే అల్వాల్‌లో ఉండే వాళ్ల చిన్నాన్న దత్తత తీసుకోవడంతో అక్కడే పెరిగారు.
బండారు రామ్మోహన్‌రావు: బండారు రామ్మోహన్‌రావు లోకసత్తా ఉద్యమ సంస్థ ఉభయ రాష్ట్రాల కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. 1990లో గజ్వేల్‌ మండల పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ గ్రామ సర్పంచ్‌ఋ‌గా, అంతకుముందు జర్నలిస్టుగా, న్యాయవాదిగా పనిచేసిన ఈయన లోకసత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్‌నారాయణకు అతి సన్నిహితుడు. జేపీ సిద్ధాంతాలు, భావాలు నచ్చి ఆయనకు దగ్గరై, ఆయనతోనే కలిసి పనిచేస్తున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గంలోని తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌(ప్రస్తుత మనోహరాబాద్‌ మండలం), ములుగు మండలం కర్కపట్లలో టీఎస్‌ఐఐసీని ఏర్పాటు చేయడంతో భారీగా పరిశ్రమలు వచ్చాయి. ములుగు మండలంలోని బండమైలారం దక్షిణ భారతదేశానికి విత్తనాలు ఉత్పత్తి చేసే విత్తన భాండాగారంగా వెలుగొందుతోంది. తాజాగా ములుగు మండల కేంద్రంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, లక్ష్మక్కపల్లిలో ఆర్‌వీఎం ఆసుపత్రి, ములుగు మండలంలోని బైలంపూర్‌, మామిడ్యాల, తనేదార్‌పల్లి గ్రామాల పరిధిలో 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టు శరవేగంగా సాగుతోంది. అంతేకాకుండా కొండపాక మండలంలోని ఎర్రవల్లి, సింగారం పరిధిలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు బుల్లెట్‌ వేగంతో సాగుతున్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో కొండపోచమ్మసాగర్‌ 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమవుతోంది. రూ. 150 కోట్లతో గజ్వేల్‌ పట్టణంలో ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మితమైంది. ఇది రాష్ట్రంలో మొట్టమొదటి కేజీ టు పీజీ విద్యాలయంగా మారనుంది. ములుగు మండల కేంద్రంలో ఉద్యాన వర్సిటీ, అటవీ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. గజ్వేల్‌ చుట్టూ 22 కిలోమీటర్ల విస్తీర్ణంలో రింగురోడ్డు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మిషన్‌ భగీరథ ద్వారా నియోజకవర్గంలో 77వేల ఇళ్లకు కుళాయి ద్వారా తాగునీరు అందుతుంది.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో కొమురవెల్లి మల్లన్న చెల్లిగా పిలువబడే కొండపోచమ్మ జగదేవ్‌పూర్‌ మండలంలోని తీగుల్‌ నర్సాపూర్‌లో కొలువై ఉండగా, వర్గల్‌ మండల కేంద్రంలో సరస్వతిదేవీ కొలువైంది. అదే మండల పరిధిలోని పడమర వైపున నాచగిరి శ్రీలక్ష్మీనర్సింహస్వామి క్షేత్రాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. కొండపోచమ్మ ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ నిర్మించిన కోమటిబండ, మర్కుక్‌ మండలంలోని సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలు పర్యాటక క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

గజ్వేల్‌ పట్టణంలోని ఎడ్యుకేషన్‌ హబ్‌, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, కోమటిబండలోని జీఎల్‌బీఆర్‌ పనులను, మర్కుక్‌ మండలంలోని సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ADVT