నియోజకవర్గం : అసెంబ్లీ

దుబ్బాక

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మెదక్
మొత్తం ఓటర్లు :
187866
పురుషులు :
92453
స్త్రీలు :
95413
ప్రస్తుత ఎమ్మెల్యే :
సోలిపేట రామలింగారెడ్డి
ప్రస్తుత ఎంపీ :
కొత్త ప్రభాకర్‌ రెడ్డి

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం ఓటర్లు: 1,87,866
పురుషులు: 92,453
మహిళలు: 95,413
ఇతరులు: 0
 
కీలక వర్గాలు: దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కువగా ముదిరాజ్‌లు, గొల్లకురుమ, మాదిగ, గౌడ కులస్తులుంటారు. ఎక్కువ శాతం రెడ్డి వర్గాలకే అవకాశం కలిగినా కూడా బీసీ, ఎస్సీల ఓట్ల శాతమే ఎక్కువగా ఉంటుంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

దుబ్బాక నియోజకవర్గం మొదటగా దొమ్మాట నియోజకవర్గంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దుబ్బాకగా మారింది. 
నియోజక వర్గం పేరు: దుబ్బాక
రిజర్వేషన్‌: ఓసీ జనరల్‌
ఏ జిల్లా: సిద్దిపేట జిల్లా(మెదక్)
నియోజకవర్గ పరిధిలోని మండలాలు: దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోలు, తోగుట, చేగుంట( మెదక్‌ జిల్లా), నర్సింగ్‌( మెదక్‌ జిల్లా)
ఏ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది: మెదక్‌ పార్లమెంటు
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 సోలిపేట రామలింగారెడ్డి టీఆర్‌ఎస్‌ నాగేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ 62421
2014 సోలిపేట రామలింగారెడ్డి టీఆర్‌ఎస్‌ చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్‌ 37780
2009 చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్‌ సోలిపేట రామలింగారెడ్డి టీఆర్‌ఎస్‌ 2430
2008 సోలిపేట రామలింగారెడ్డి టీఆర్‌ఎస్‌ చెరుకు ముత్యంరెడ్డి టీడీపీ 5380
2004 సోలిపేట రామలింగారెడ్డి టీఆర్‌ఎస్‌ చెరుకు ముత్యంరెడ్డి టీడీపీ 24536
1999 చెరుకు ముత్యంరెడ్డి టీడీపీ బండి నర్సాగౌడ్‌ కాంగ్రెస్‌ 31485
1994 చెరుకు ముత్యంరెడ్డి టీడీపీ ఫారూఖ్‌హుస్సెన్‌ కాంగ్రెస్‌ 38782
1989 చెరుకు ముత్యంరెడ్డి టీడీపీ రంగారెడ్డి కాంగ్రెస్‌ 9273
1985 డి.రాంచంద్రారెడ్డి టీడీపీ సీతారాంరెడ్డి కాంగ్రెస్‌ 20961
1983 ఐరేని లింగయ్య కాంగ్రెస్‌-ఐ డి.రాంచంద్రారెడ్డి టీడీపీ 369
1978 ఐరేని లింగయ్య కాంగ్రెస్‌-ఐ ఎస్‌.రాంచంద్రారెడ్డి కాంగ్రెస్‌ 4084
1972 ఎస్‌.రాంచంద్రారెడ్డి కాంగ్రెస్‌ సీ.రామారావు స్వతంత్ర 16542
1967 ఎం.బీంరెడ్డి స్వతంత్ర కే.మహినొద్దీన్‌ కాంగ్రెస్‌ 2963
1962 కె.మహినోద్దిన్‌ కాంగ్రెస్‌ అనంతరెడ్డి పీడీఎఫ్‌ 4331
1957 అనంతరెడ్డి పీడీఎఫ్‌ 0 0 0

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

బీడీ పరిశ్రమ, చేనేత కార్మిక సొసైటీ, నూతనంగా మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం

అభివృద్ధి ప‌థ‌కాలు

ప్రధానంగా దుబ్బాక నియోజకవర్గం డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. సమీకృత భవనాల నిర్మాణం, సీఎం ప్రత్యేక నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారు. శ్మశాన వాటికలు, గ్రామగ్రామాన మార్కెట్‌ షెడ్లు, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, ఐదు గ్రామాలకు ఒక సబ్‌స్టేషన్‌ తదితర అభివృద్ధి పనులను చేపడుతున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గం చాలా కాలంగా కరువుతో తల్లడిల్లుతున్నది. మిషన్‌ కాకతీయతో కొంత ఊరట కలిగింది. మల్లన్నసాగర్‌ నిర్మాణం పూర్తయితే కరువు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నవంబర్‌లోగా నీళ్లిచ్చేందుకు కాలువల పనులు వేగంగా సాగుతున్నాయి. తాగునీరందించే మిషన్‌ భగీరథ పనులు చివరి దశకు చేరాయి. సాగు నీరందితే వలసలు తప్పి, ప్రజలకు ఉపాధి కలుగుతుందనే భావన ప్రజల్లో ఉంది.

ముఖ్య ప్రాంతాలు

దుబ్బాక నియోజకవర్గంలో దేవాదాయ శాఖ పరిధిలోని చారిత్రక దేవాలయాలున్నాయి. ముఖ్యంగా కూడవెళ్ళి రామలింగేశ్వరుడు ఉన్న ప్రదేశం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉంది. మాఘ అమావాస్య జాతరకు వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తారు. అలాగే రేకులకుంట మల్లికార్జున దేవాలయం దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని మల్లన్న గుట్టల్లోని నట్టడివిలో ఉంది.

వీడియోస్

ADVT