నియోజకవర్గం : అసెంబ్లీ

అం‍దోల్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మెదక్
మొత్తం ఓటర్లు :
217958
పురుషులు :
108246
స్త్రీలు :
109695
ప్రస్తుత ఎమ్మెల్యే :
చంటి క్రాంతికిరణ్
ప్రస్తుత ఎంపీ :
బీ.బీ.పాటిల్‌

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,17,958
పురుషులు: 1,08,246
స్త్రీలు: 1,09,695
ఇతరులు:  17
 
కీలక వర్గాలు: ఓటర్ల పరంగా దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వారెవరూ గెలుపోటములను నిర్ణయించే పరిస్థితిలో లేరు. రెడ్డి సామాజికవర్గమే నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తోంది.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: అందోలు
రిజర్వేషన్‌: ఎస్‌.సీ
జిల్లా: సంగారెడ్డి జిల్లాలో 5 మండలాలు, మెదక్‌ జిల్లా పరిధిలో 3 మండలాలు
పరిధిలోని మండలాలు: 8
అందోలు (సంగారెడ్డి), పుల్కల్‌ (సంగారెడ్డి), వట్‌పల్లి (సంగారెడ్డి), మునిపల్లి (సంగారెడ్డి), రాయికోడ్ ‌ (సంగారెడ్డి), అల్లాదుర్గం (మెదక్‌), రేగోడ్‌ (మెదక్‌), టేక్మాల్‌ (మెదక్‌)
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది: జహీరాబాద్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 చంటి క్రాంతికిరణ్ టీఆర్ఎస్‌ సీ. దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ 16510
2014 బాబూమోహన్‌ టీఆర్ఎస్‌ సీ. దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ 3291
2009 సీ. దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ బాబూమోహన్‌ టీడీపీ 2906
2004 సీ. దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ బాబూమోహన్‌ టీడీపీ 24846
1999 పల్లి బాబూమోహన్‌ టీడీపీ సీ. దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ 513
1998 పల్లి బాబూమోహన్‌ రావు టీడీపీ సీ. దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ 10554
1994 మల్యాల రాజయ్య టీడీపీ సీ.దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ 20759
1989 సీ.ఆర్‌. దామోదర్‌ కాంగ్రెస్‌ మల్యాల రాజయ్య టీడీపీ 3014
1985 మల్యాల రాజయ్య టీడీపీ సిలారపు రాజనర్సింహ స్వతంత్ర 16463
1983 హెచ్‌. లక్ష్మణ్‌జీ కాంగ్రెస్‌ జే.ఈశ్వరీబాయి ఆర్‌పీఐ 10515
1978 సిలారపు రాజనర్సింహ కాంగ్రెస్‌ సదానందం కాంగ్రెస్‌(ఐ‌) 738
1972 సిలారపు రాజనర్సింహ కాంగ్రెస్‌ ఎల్‌. కుమార్‌ స్వతంత్ర 13901
1967 సిలారపు రాజనర్సింహ కాంగ్రెస్‌ కే.ఈశ్వరప్ప స్వతంత్ర 9757
1962 ఎస్‌. లక్ష్మీదేవి కాంగ్రెస్‌ బస్వ మాణయ్య స్వతంత్ర 18985
1957 బస్వ మాణయ్య స్వతంత్ర ఫక్రుద్దీన్‌ కాంగ్రెస్‌ 55618

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

నాగిరెడ్డి: ఆందోలు నియోజకవర్గం పరిధిలోని పుల్కల్‌ మండలం పెద్దారెడ్డి పేట గ్రామానికి చెందిన నాగిరెడ్డి, ఐఏఎస్‌ పాసై పలు జిల్లాలకు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఈయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ప్రాజెక్టు: సింగూరు ప్రాజెక్టు
నియోజకవర్గంలోని ఏకైక నీటి ప్రాజెక్టు ఇది. 1980 దశకంలో జంట నగరాలకు తాగు నీరందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు నుంచి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఆందోలు నియోజకవర్గంలోని 40 వేల ఎకరాల సాగుకు గానూ నీరందించేందుకు నిర్ణయం జరిగింది. ఆ మేరకు కాలువల నిర్మాణానికి రూ. 89 కోట్లు సైతం విడుదలైనా, కాంగ్రెస్‌ హయాంలో ఆ పనులు పూర్తి కాలేదు. చివరికి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడగానే, నీటిపారుదల శాఖామంత్రి హరీష్‌రావు చొరవతో, రెండేళ్ళ సమయంలో కాలువ పనులు పూర్తవడమే కాకుండా, గత మూడు పంటలకు వరుసగా నీటి సరఫరా కూడా జరుగుతోంది.
సంస్థ: జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల
దామోదర రాజనర్సింహ ఉన్నత, సాంకేతిక విద్యాశాఖామంత్రిగా ఉన్న సమయంలో పట్టుబట్టి మరీ తన నియోజకవర్గానికి సాంకేతిక కళాశాలను మంజూరు చేయించుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని పుల్కల్‌ మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద జాతయ రహదారి పక్కనే సుమారు 100 ఎకరాల్లో దాదాపు రూ.340 కోట్ల వ్యయంతో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ–హైదరాబాద్‌కు అనుబంధంగా ఒక ఇంజనీరింగ్‌ కళాశాల ప్రారంభమైంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

రొటీన్‌గా జరిగే అభివృధ్ధి కార్యక్రమాలకు అదనంగా పలు సాగునీటి పనులు మాత్రం అందోలు నియోజకవర్గంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటి పంపిణీ కోసం కాల్వల తవ్వకం పూర్తైంది. ఆదే ప్రాజెక్టు నుంచి కుడి కాల్వ ( నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలో సాగునీటి కోసం) నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. దీనికి అదనంగా, అందోలు మండలంలోని తాలెల్మ వద్ద రూ. 38 కోట్లతో నిర్మంచనున్న రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పధకం కూడా ఇటీవలే ప్రారంభమైంది. దీంతో సుమారు 28 గ్రామాల ప్రజలకు సాగు నీరందే అవకాశముంది. వట్‌పల్లి మండలంలోని నిర్జప్ల వద్ద మరో ఎత్తిపోతల పథకానికి కూడా నీటిపారుదల శాఖామంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.దీనికి తోడు టేక్మాల్‌ మండలంలోని గుండవాగు ద్వారా సాగు నీరందించేందుకు మరో ఎత్తిపోతల పథకానికి కూడా ఆమోదం లభించింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు: అందోలు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఉన్న జోగిపేట పట్టణం ఉమ్మడి జిల్లాకు సరిగా మధ్యలో ఉండేది. ఎప్పుడో రెవెన్యూ డివిజన్‌ కావాల్సి ఉన్నా, కాలేదు. దీనికి తోడు జిల్లాల పునర్విభజనలో ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు సంగారెడ్డి జిల్లాలో ఉండగా, మరో మూడు మండలాలు మెదక్‌ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో ప్రాముఖ్యత తగ్గిపోయింది.
 
బస్‌డిపో ఏర్పాటు: ఇదిలా ఉంటే, జోగిపేట పట్టణం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలోని పలు మండలాలకు వ్యాపార, విద్యా కేంద్రంగా భాసిల్లుతోంది. ఈ రెండు జిల్లాలకు చెందిన సుమారు 10 మండలాలకు పైగా పరిసర మండలాల ప్రజలు ప్రతినిత్యం జోగిపేటకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇందుకోసం ఇక్కడ బస్‌ డిపో ఏర్పాటు కోసం, చంద్రబాబు హయాం నుంచీ హామీలు ఇస్తూనే ఉన్నా నేటికీ అమలు కావడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

చారిత్రక ప్రదేశం
తుంబురేశ్వరాలయం: నియోజకవర్గం పరిధిలోని టేక్మాల్‌ మండలం వేల్పుగొండ గ్రామంలో (ప్రస్తుతం జిల్లాల విభజనలో ఇది మెదక్‌ పరిధిలోకి చేరింది) వందల ఏళ్ల క్రితం నాటి తుంబురేశ్వరాలయం ఉంది. చిత్రకళా సంపదకు, నాటి చారిత్రక ఆనవాళ్ళకు ఇది ఆలవాలంగా ఉంటోంది.
 
పర్యాటకం
సింగూరు ప్రాజెక్టు: నియోజకవర్గంలోని పుల్కల్‌ మండలం సింగూరు వద్ద నిర్మించిన సింగూరు ప్రాజెక్టు ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. ప్రతీ ఆదివారం ఇక్కడికి జంటనగరాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది వస్తుంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉన్నప్పుడు, నీటి విడుదల సమయంలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు.

ఇతర ముఖ్యాంశాలు

సెంటిమెంట్‌
ఇక్కడ గెలిచే పార్టీయే అధికారంలోకి వస్తుంది: ఆందోలు నియోజకవర్గంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తాడో, ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ ఇక్కడ బలంగా ఉంటోంది. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచీ ఇదే సెంటిమెంట్‌ ఇక్కడ వర్కవుట్‌ కావడం గమనార్హం.
 
మంత్రిగా పోటీ చేస్తే అపజయమే: అయితే ఇక్కడ మరో ఆసక్తికర సెంటిమెంట్‌ కూడా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి హోదాలో పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా ఎన్నికల్లో ఓటమి పాలవడం ఖాయమనే సెంటిమెంట్‌ కూడా ఉంది. ఇది దాదాపు ప్రతీ ఎన్నికల్లోనూ నిరూపితమైనప్పటికీ, 2009 ఎన్నికల్లో, అప్పుడు కాంగ్రెస్‌ నుంచి మంత్రి హోదాలో పోటీ చేసిన దామోదర రాజనర్సింహ ఈ సెంటిమెంట్‌ను అధిగమించి మరీ విజయం సాధించడం విశేషం. అయితే, తిరిగి, 2014లో ఉపముఖ్యమంత్రి హోదాలో పోటీచేసిన ఆయన ఓడిపోవడం ఈ సెంటిమెంట్‌ను విశ్వసించేలా చేస్తోంది.
 
జీవన్ముక్త ఆలయం నుంచి ప్రచారం ప్రారంభిస్తే గెలుపే: నియోజకవర్గంలోని మునిపల్లి మండలం అంతారం గ్రామంలోని జీవన్ముక్త ఆలయం ప్రసిద్ధమైనది. ఎన్నికల ప్రచారాన్ని ఈ గుడి నుంచి ప్రారంభిస్తే విజయం తథ్యం అనే సెంటిమెంట్‌ ఇక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్థులందరికీ ఉంది. దీంతో ఇక్కడ నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ అంతారం నుంచే తమ ప్రచారాన్ని ప్రారంభించడం విశేషం. 

వీడియోస్

ADVT