నియోజకవర్గం : అసెంబ్లీ

రాజేంద్రనగర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
421345
పురుషులు :
223077
స్త్రీలు :
198202
ప్రస్తుత ఎమ్మెల్యే :
టీ. ప్రకాష్ గౌడ్
ప్రస్తుత ఎంపీ :
కొండా విశ్వేశ్వరరెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 4,21,345 
పురుషులు - 2,23,077
మహిళలు - 1,98,202
ఇతరులు - 66
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు
రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు ఎక్కువ శాతంలో ఉన్నారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపు ముస్లిం మైనార్టీలు, బీసీ వర్గాల ఓట్లపై ఆధారపడి ఉంది. బీసీలలో ముదిరాజ్‌ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.అంతేకాకుండా రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే. ఇక్కడ అన్ని రాష్ర్టాలకు చెందిన ఓటర్లు కూడా ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గం చేవేళ్ళ పార్లమెంట్ పరిథిలో ఉంది. రాజేంద్రనగర్‌, గండిపేట్‌, శంషాబాద్‌ మండలాలతో పాటు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ప్రాంతం.. ఈ నియోజకవర్గ పరిథిలోకి వస్తాయి.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2014 టి.ప్రకాశ్‌గౌడ్ టీడీపీ బి.జ్ఞానేశ్వర్‌ కాంగ్రెస్‌ 25881
2009 టి.ప్రకాశ్‌గౌడ్ టీఆర్ఎస్ ఆర్.గణేష్ టీడీపీ 57011
2009 టి.ప్రకాశ్‌గౌడ్‌ టీడీపీ బి.జ్ఞానేశ్వర్‌ కాంగ్రెస్‌ 7485

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

నియోజకవర్గంలో సియాసత్‌ దినపత్రిక ఎండీ జాహెద్‌ అలీఖాన్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతులు డాక్టర్‌ టి.రాఘవరెడ్డి, డాక్టర్‌ ఎ.పద్మరాజు తదితరులున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం శంషాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, జాతీయ గ్రామీణాబివృద్ధి పంచాయతీరాజ్‌ సంస్థతోపాటు అనేక కేంద్ర ప్రభుత్వసంస్థలున్నాయి

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో కోట్లాది రూపాయాలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. చెరువులను సుందరీకరిస్తున్నారు. రోడ్లు వేయడానికి నిధులు మంజూరు అయ్యాయి. మంచినీటి వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. డ్రైనేజీ ఔట్‌లెట్‌లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. నిరుద్యోగ సమస్య చాలా ఉంది.

ముఖ్య ప్రాంతాలు

అత్తాపూర్‌ రాంబాగ్‌లో రామాలయం, అనంత పద్మనాభ స్వామి దేవాలయం, శివాలయం, మంచిరేవులలో వీరభద్ర స్వామి దేవాలయం, నర్కుడలో అమ్మపల్లి దేవాలయాలున్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు చెందిన అనేక పరిశోధనా క్షేతాల్రున్నాయి. చేప ఆకారంలో నేషనల్‌ ఫిషరీస్‌ డెవల్‌మెంట్‌ బోర్డు కార్యాలయం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. జంటనగరాలకు తాగునీరందిస్తున్న గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాలు రాజేంద్రనగర్‌లోనే ఉన్నాయి.

వీడియోస్

ADVT