నియోజకవర్గం : అసెంబ్లీ

సికింద్రాబాద్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
233790
పురుషులు :
118993
స్త్రీలు :
114774
ప్రస్తుత ఎమ్మెల్యే :
తీగుళ్ల పద్మారావు
ప్రస్తుత ఎంపీ :
బండారు దత్తాత్రేయ

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 2,33,790
పురుషులు: 1,18,993
స్త్రీలు: 1,14,774
ఇతరులు: 23

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌ 
మండలాలు: మారేడుపల్లి, ముషీరాబాద్‌
లోక్‌సభ నియోజకవర్గం: సికింద్రాబాద్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 తీగుళ్ల పద్మారావు టీఆర్‌ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ 45470
2014 టీ. పద్మారావుగౌడ్‌ టీఆర్‌ఎస్‌ కూనవెంకటేష్‌ టీడీపీ 0
2009 జయసుధ కపూర్‌ కాంగ్రెస్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీడీపీ 0
2008 తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీడీపీ పిట్ల కృష్ణ కాంగ్రెస్‌ 0
2004 టీ.పద్మారావు టీఆర్‌ఎస్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీడీపీ 0
1999 తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీడీపీ మేరీ రవీంద్రనాథ్‌ కాంగ్రెస్‌ 0
1994 తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీడీపీ మేరీ రవీంద్రనాథ్‌ కాంగ్రెస్‌ 0
1989 మేరీ రవీంద్రనాథ్‌ కాంగ్రెస్‌ అల్లాడి రాజ్‌కుమార్‌ టీడీపీ 0
1985 అల్లాడి పి.రాజ్‌కుమార్‌ టీడీపీ గౌరీశంకర్‌ కాంగ్రెస్‌ 0
1983 ఎం.కృష్ణారావు ఇండిపెండెంట్‌ కె.కేశవరావు కాంగ్రెస్‌ 0
1978 ఎల్‌.నారాయణ జెఎన్‌పి టి.డి.గౌరీశంకర్‌ కాంగ్రెస్‌ 0
1972 ఎల్‌.నారాయణ కాంగ్రెస్‌ జి.ఎం.అంజయ్య ఎస్‌టీఎస్‌ 0
1967 కె.ఎస్‌.నారాయణ కాంగ్రెస్‌ బి.ఎస్‌.ఎం.సింగ్‌ ఇండిపెండెంట్‌ 0
1962 కె.ఎస్‌.నారాయణ కాంగ్రెస్‌ జి.ఎం.అంజయ్య ఎస్‌ఓసీ 0
1957 కె.సత్యనారాయణ కాంగ్రెస్‌ జె.వెంకటేశం పిఎస్‌పి 0

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

రైల్వే సంస్థలు, మరోవైపు ఉస్మానియా
విశ్వవిద్యాలయం, దాని అనుబంధ సంస్థలు పెద్ద సంఖ్యలో విస్తరించి ఉన్నాయి. విజయ డైరీలో కొంత భాగం, ఆర్టీసీ ఆస్పత్రి ఈ సెగ్మెంట్‌లో ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను దశాబ్దాల కాలం నుంచి ఊరిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ కళాశాల ఆవరణలోనే కేజి టు పి.జి ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీతాఫల్‌మండిలో కోట్లాది రూపాయిల వ్యయంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాలు నిర్మాణ పనులను 3 కోట్ల రూపాయిల వ్యయంతో జరుగుతున్నది. దీని ఆవరణలోనే సెట్విన్‌ సంస్థ కార్యాలయం, శిక్షణ కేంద్ర నిర్మాణం జరుగుతున్నది. ఇందిరానగర్‌ కాలనీలో కోటీ 20లక్షల వ్యయంతో నాలా విస్తరణ పనులు జరుగుతున్నాయి. వారాసిగూడ కౌసర్‌ మసీదు వద్ద కోటి రూపాయిల వ్యయంతో నాలా విస్తరణ పనులు జరుగుతున్నాయి. అంబర్‌నగర్‌లో వాటర్‌ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి రోజూ మంచినీటి సరఫరా జరుగుతోంది. మధురానగర్‌ కాలనీలో 5 కోట్ల రూపాయిల వ్యయంతో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మెట్టుగూడ డివిజన్‌లో డబుల్‌బెడ్‌ రూమ్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. సీతాఫల్‌మండి డివిజన్‌లో డబుల్‌బెడ్‌రూమ్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. లాలాపేట్‌ వంతెన నిర్మాణ పనులు కోట్ల రూపాయిల వ్యయంతో చేపడుతున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు

ఇదిలా ఉండగా చిలకలగూడ-జామైఉస్మానియా ప్రధాన రోడ్డు విస్తరణ పనులు, న్యూఅశోక్‌నగర్‌, పుల్లయ్య బావి పరిసరాల్లో నాలా విస్తరణ పనులు పెండింగులో ఉన్నాయి. తుకారాంగేట్‌ రైల్వే వంతెన పనులు పెండింగులో ఉన్నాయి. చిలకలగూడ మున్సిపల్‌ కాంప్లెక్స్‌ ఆధునీకరణ పనులు ప్రారంభం కాలేదు. అడ్డగుట్టలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.

ఇతర ముఖ్యాంశాలు

ఒకప్పుడు రైల్వే ఓటర్లు ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగా, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దానికి కారణం.... రైల్వే ఓటర్లు చాలా వరకు ఇతర ప్రాంతాలకు మకాం మార్చడమే.ఈ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచీ ఇక్కడ స్థానిక అభ్యర్థులు గెలుపొందకపోవడం గమనార్హం. నియోజకవర్గం బయటి నాయకులనే ఈ సెగ్మెంట్‌ వరిస్తుండడం విశేషం.ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో తలపడినతలసాని శ్రీనివాస్‌యాదవ్‌, తీగుళ్ల పద్మారావుగౌడ్‌లు ప్రస్తుతం ఒకే (టీఆర్‌ఎస్‌) పార్టీలో ఉండడం, ఇద్దరూ ఇరుగు పొరుగు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం, ఇద్దరూ కూడా కేసీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతుండడం విశేషం.
 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో జరిగిన ఆ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లాలోని మొత్తం 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో గులాబీ జెండా రెపరెపలాడిన ఏకైక నియోజకవర్గం ఇదే కావడంతో పద్మారావుకు ఎనలేని ప్రాధాన్యత వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్‌ వెన్నంటే పద్మారావు ఉండడం, అడ్డగుట్ట, పార్శీగుట్ట, మాణికేశ్వర్‌నగర్‌ లాంటి బస్తీల ప్రజలు అత్యధిక శాతం తెలంగాణ సెటిలర్లు కావడంతో పద్మారావు గెలుపు నల్లేరుపై నడకగా మారుతుందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.  

వీడియోస్

ADVT