నియోజకవర్గం : అసెంబ్లీ

సనత్ నగర్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
225063
పురుషులు :
118479
స్త్రీలు :
106575
ప్రస్తుత ఎమ్మెల్యే :
తలసాని శ్రీనివాస్ యాదవ్
ప్రస్తుత ఎంపీ :
బండారు దత్తాత్రేయ

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,25,063
పురుషులు: 1,18,479
స్త్రీలు: 1,06,575
ఇతరులు: 09
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మైనార్టీలతో పాటు బీసీ కులాలకు సంబంధించిన ఓటర్లు అధికంగాఉన్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా మున్నూరు కాపు, గౌడ సామాజికవర్గం వారు ఉన్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: సికింద్రాబాద్‌, అమీర్‌పేట మండలాలు ఉన్నాయి.
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: సికింద్రాబాద్‌ లోక్‌ సభ
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ వెంకటేశ్ గౌడ్ కూన టీడీపీ 30651
2014 టి.శ్రీనివాస్‌యాదవ్‌ టీడీపీ దండే విఠల్‌ టిఆర్‌ఎస్‌ 27461
2009 మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ (ఐ) టి.పద్మారావు టిఆర్‌ఎస్‌ 8325
2004 మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ (ఐ) శ్రీపతి రాజేశ్వర్‌ టీడీపీ 9546
1999 శ్రీపతి రాజేశ్వర్‌ టీడీపీ మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌(ఐ) 16031
1994 మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ (ఐ) శ్రీపతి రాజేశ్వర్‌ టీడీపీ 6162
1989 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్‌(ఐ) శ్రీపతి రాజేశ్వర్‌ టీడీపీ 16899
1985 శ్రీపతి రాజేశ్వర్‌ టీడీపీ పి.ఎల్‌.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌(ఐ) 9009
1983 కె. ప్రసూన టీడీపీ శ్రీలం రాందాసు కాంగ్రెస్‌(ఐ) 13168
1978 శ్రీలం రాందాసు కాంగ్రెస్‌ (ఐ) ఎన్‌.వి. భాస్కర్‌రావు సి.పి.ఎం 1762

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

బేగంపేట విమానాశ్రమం, వాతావరణ కేంద్రం, సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడ, ఈస్‌ఐ ఆసుపత్రి

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. సనత్‌నగర్‌, బేగంపేట డివిజన్లలో మోడల్‌ మార్కెళ్ల నిర్మాణం పూర్తయింది. సనత్‌నగర్‌, అమీర్‌పేట డివిజన్లలో సుమారు 90 కోట్లతో వైట్‌ ట్యాపింగ్‌ రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. సనత్‌నగర్‌లోని వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో మల్టీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, వాటర్‌, సివరేజి పైపులైన్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. బల్కంపేట స్మశానవాటికను మహా ప్రస్థానం స్థాయిలో అభివృద్ది పరిచే విధంగా అబివృద్ది పనులు చేస్తున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు

బేగంపేట బస్తీలోని ముస్లీలకు స్మశాన వాటికకు స్ధలం కేటాయింపు సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అమీర్‌పేట, సనత్‌నగర్‌లో మంచినీటి సమస్య ఉంది.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో ఉజ్జయిని మహాంకాళీ దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలు ఉన్నాయి.

వీడియోస్

ADVT