నియోజకవర్గం : అసెంబ్లీ

ఆదిలాబాద్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
అదిలాబాద్
మొత్తం ఓటర్లు :
196849
పురుషులు :
98157
స్త్రీలు :
98645
ప్రస్తుత ఎమ్మెల్యే :
జోగు రామన్న
ప్రస్తుత ఎంపీ :
గోడం నగేష్‌

ఓట‌ర్లు

నియోజకవర్గం మొత్తం జనాభా: 2,84,560
పురుషులు: 1,44,050
స్ర్తీలు: 1,40,510
 
నియోజకవర్గం మొత్తం ఓటర్లు1,96,849
పురుషులు: 98,157
స్ర్తీలు: 98,645
ఇతరులు: 47
 
నియోజక వర్గంలో కీలక వర్గాలు: ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో ప్రధానంగా మున్నూరు కాపు ఓటర్లే కీలకంగా ఉన్నారు. అలాగే మైనార్టీలు కూడా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

 1952వ సంవత్సరం నుంచి అభ్యర్థుల గెలుపోటముల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.  
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 జోగురామన్న టీఆర్‌ఎస్‌ పాయలశంకర్‌ బీజేపీ 26606
2014 జోగురామన్న టీఆర్‌ఎస్‌ పాయలశంకర్‌ బీజేపీ 14711
2012 జోగురామన్న టీఆర్‌ఎస్‌ సి.,రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ 35150
2009 జోగురామన్న టీడీపీ సి.రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ 62235
2004 సి.రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ జోగురామన్న టీడీపీ 74675
1999 పి.భూమన్న స్వతంత్ర సి.రాంచంద్రారెడ్డి స్వతంత్ర 65054
1994 సి.వామన్‌రెడ్డి టీడీపీ పి.భూమన్న స్వతంత్ర 39729
1989 సి.రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ కె.చంద్రకాంత్‌రెడ్డి టీడీపీ 45868
1985 సి.రాంచంద్రారెడ్డి స్వతంత్ర ఆర్‌.లక్ష్మణ్‌ రావ్‌ టీడీపీ 32017
1983 సి.వామన్‌రెడ్డి స్వతంత్ర సి.రాంచంద్రారెడ్డి కాంగ్రెస్‌ 48868
1978 సి.రాంచంద్రారెడ్డి స్వతంత్ర సి.వామన్‌రెడ్డి కాంంగ్రెస్-ఐ 28905
1972 మసూద్‌అహ్మద్‌ కాంగ్రెస్ బి.రావ్‌ స్వతంత్ర 30918
1967 కె.రామకృష్ణ సీపీఐ వెంకటరమణ కాంగ్రెస్‌ 17881
1962 విఠల్‌రావ్‌దేశ్‌పాండే స్వతంత్ర కె.రామకృష్ణ సీపీఐ 13949
1952 దాజిశంకర్‌రావ్‌ పీడీఎఫ్‌ రాంచంద్రరావ్‌ కాంగ్రెస్ 15230

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ప్రముఖ సంస్థలు ఏమి లేవు. సాత్నాల పాజెక్టు మాత్రమే ఉంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం 200లకు పైగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే పెన్‌గంగా నది పై కోర్టా - చనకా బ్యారేజీ, హత్తిఘాట్‌ పంప్‌హౌజ్‌ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రి ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజక వర్గంలో దీర్ఘకాలికంగా సిమెంట్‌ పరిశ్రమ (సీసీఐ) మూతబడి ఉంది. ఎరోడ్రమ్‌ పనులు ముందుకు సాగడం లేదు.అలాగే తాంసి బస్టాండ్‌ వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జీ పనులు మొదలు కావడం లేదు. ఆదిలాబాద్‌ టూ ఆర్మూర్‌ రైల్వే పనులు ప్రారంభం కావాల్సి ఉంది. సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణకు మాజీ మంత్రి జోగు రామన్న పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలవడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇదిగో పరిశ్రమ... అదిగో పరిశ్రమ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఆదిలాబాద్‌ మండలంలో గత 6 మాసాల క్రితం రేణుకా సిమెంట్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్‌ మండలం యాపల్‌గూడలో పోలీసు బెటాలియన్‌ ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. 

ముఖ్య ప్రాంతాలు

ఆదిలాబాద్‌ నియోజక వర్గంలోని జైనథ్‌ మండల కేంద్రంలో చరిత్రాత్మకమైన జైనథ్‌ లక్ష్మినారాయణ స్వామి ఆలయం ఉంది.

ఇతర ముఖ్యాంశాలు

మహారాష్ట్ర సరిహద్దులను ఆనుకొని ఆదిలాబాద్‌ నియోజక వర్గం ఉంది. సరిహద్దు మండలాల్లో ఎక్కువగా మరాఠీల ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆదివాసీల ఉద్యమ నేపథ్యంలో నియోజక వర్గంలో ఉన్న 12వేల మంది ఆదివాసీ గిరిజనులు అభ్యర్థుల గెలుపోటముల పై ప్రభావం చూపనున్నారు.

వీడియోస్

ADVT