నియోజకవర్గం : అసెంబ్లీ

మలక్ పేట్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
279766
పురుషులు :
143886
స్త్రీలు :
135860
ప్రస్తుత ఎమ్మెల్యే :
అహ్మద్‌ బిన్‌ అబ్ధుల్లా బలాల
ప్రస్తుత ఎంపీ :
అసదుద్దీదన్ ఓవైసీ

ఓట‌ర్లు

మొత్తం ఓటర్ల సంఖ్య: 2,79,766
పురుషులు: 1,43,886
మహిళలు: 1,35,860
ఇతరులు: 20
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: మలక్‌పేట నియోజకవర్గంలో ముస్లీం ఓటర్లు హిందు వు ఓటర్లకు దాదాపు ఇంచుమించుగా ఉన్నారు. తర్వాత రెడ్డి, బీసీ, సామాజిక వర్గం వారు కీలకంగా వ్యవహరించనున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి: సైదాబాద్‌, చార్మినార్‌, అంబర్‌పేట
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: హైదరాబాద్‌ పార్లమెంట్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2014 అహ్మద్‌ బిన్‌ అబ్ధుల్లా బలాల ఎంఐఎం బి.వెంకట్‌రెడ్డి బీజేపీ 35713
2009 అహ్మద్‌బిన్‌అబ్ధుల్లా బలాల ఎంఐఎం ఎండీ ముజఫర్‌అలీఖాన్‌ టీడీపీ 22468
2004 మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్‌ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ 115549
1999 ఎన్‌.ఇంద్రసేనారెడ్డి బీజేపీ పి.సుధీర్‌కుమార్‌ కాంగ్రెస్‌ 69617
1994 మల్‌రెడ్డి రంగారెడ్డి టీడీపీ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి బీజేపీ 47857
1989 పి.సుధీర్‌కుమార్‌ కాంగ్రెస్‌ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి బీజేపీ 52233
1985 ఎన్‌.ఇంద్రసేనారెడ్డి బీజేపీ నాందెడ్ల భాస్కర్‌రావు స్వతంత్ర 39790
1983 ఎన్‌.ఇంద్రసేనారెడ్డి బీజేపీ కందాల ప్రబాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ 19340
1978 కందాల ప్రభాకర్‌రెడ్డి జనతా బి.సరోజినిపుల్లారెడ్డి కాంగ్రెస్‌ 24279
1972 బి.సరోజినిపుల్లారెడ్డి కాంగ్రెస్‌ గురులింగంఎస్‌సత్తయ్య స్వతంత్ర 11230
1967 బీఎస్‌పీ రెడ్డి కాంగ్రెస్‌ ఎ.రెహమాన్‌ స్వతంత్ర 8692
1962 మీర్‌ అహ్మద్‌అలీ ఖాన్‌ కాంగ్రెస్‌ ఎ.రెహమాన్‌ స్వతంత్ర 8692
1957 మీర్‌ అహ్మద్‌అలీ ఖాన్‌ కాంగ్రెస్‌ ఖతిజాఆలం పీడీఎఫ్‌ 3883

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

మలక్‌పేట నియోజకవర్గంలో మలక్‌పేట మార్కెట్‌ ఆవరణలో మహమూబ్‌మాన్షన్‌ ప్యాలెస్‌ ఉంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరింది. హెరిటేజ్‌ భవనంగా గుర్తించారు. మలక్‌పేట రైల్వే స్టేషన్‌, దీని పక్కనే త్వరలోనే మలక్‌పేట మెట్రోస్టేషన్‌ అందుబాటులోకి రానుంది. ఓల్డ్‌మలక్‌పేటలో వ్యవసాయ విత్తనాభివృద్ది సంస్థ కార్యాలయం ఉంది. మలక్‌పేట మహబూబ్‌మాన్షన్‌ మార్కెట్‌లో సీజనల్‌ వారిగా ఎండుమిర్చి, చింతపండు, ఉల్లిగడ్డ నిత్యావసర సరుకులను రైతులు తీసుకువస్తే వాటి వేలం మార్కెటింగ్‌ శాఖధికారుల పర్యవేక్షణలో కమిషన్‌ ఏజేంట్ల ద్వారా ఈ-నామ్‌ విధానంతో జరుగుతుంది. మలక్‌పేట నల్గొండ చౌరస్తాలో జాతీయ దివ్యాంగుల ఉద్యానవనం 2018 జనవరి మాసంలోనే ప్రారంభమైంది. మలక్‌పేట నల్గొండ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సహాకార సంస్థ కార్యాలయాలు, బ్రెయిలీ ప్రెస్‌ ఉన్నాయి. ఇందులోనే ప్రభుత్వ బదిరుల ఉన్నత పాఠశాల కూడా ఉంది. మలక్‌పేట బీ బ్లాక్స్‌లో ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాల ఉంది. ఆస్మాన్‌ఘడ్‌లో చారిత్రాత్మకమైన రెమాండ్స్‌ సమాదులు ఉండడం మరో ప్రత్యేకత. ముసారాంబాగ్‌లో సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయం (ఆజంపుర), మలక్‌పేట ఈస్ట్‌జోన్‌ ఆర్టీఏ కార్యాలయం, చారిత్రాత్మకమైన భవనంలోనే ఇంకా చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ కొనసాగుతుంది. పాతబస్తీలోని చెత్తను తరలించే జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌ఫోర్ట్‌ కార్యాలయం చాదర్‌ఘాట్‌లోనే ఉంది. చంచల్‌గూడలో కేంద్ర కారాగారం, ప్రభుత్వ ముద్రాణాలయం కార్యాలయం కూడా ఉన్నాయి.
నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన సంస్థల్లో మలక్‌పేట మహబూబ్‌ మాన్షన్‌ మార్కెట్‌ ఒకటని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో పండించిన ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, చింతపండును రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చి కమిషన్‌ ఏజేంట్ల ద్వారా అమ్ముకుంటారు. ఇంకా చెప్పుకోదగ్గ ప్రముఖ సంస్థలు ఏమీ లేవు.

అభివృద్ధి ప‌థ‌కాలు

మలక్‌పేట నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సుమారు రూ.70కోట్లతో అదునాతన సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఈ సబ్‌స్టేషన్‌ పూర్తయితే మలక్‌పేట నియోజకవర్గానికి దాదాపుగా విద్యుత్‌ సమస్యలు తీరనున్నాయి. తాగునీటి సమస్య నివారించేందుకు నియోజకవర్గానికి అదనంగా ఒక ఎంజీడీ నీటి సరఫరాను పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.50కోట్ల నిధులను సీసీ కెమెరాల ఏర్పాటుకు కేటాయించారు. సీసీరోడ్డు, బీటీ రోడ్డు, సివరేజి, మంచినీటి పైప్‌లైన్‌. వరద నీటి కాలువల నిర్మాణానికి సుమారు రూ.150కోట్ల వరకు వెచ్చించారు. ఇంకా చాలా చోట్ల పనులు జరుగుతున్నాయి. చంచల్‌గూడ పిల్లి గుడిసెల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

మలక్‌పేట నియోజకవర్గం నుంచి నియోజకవర్గాల పునర్విభజనతో నాలుగు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. వీటిలో మలక్‌పేట, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాలు పూర్తిగా, సరూర్‌నగర్‌ మండలంలోని పలు ప్రాంతాలు మహేశ్వరంలో, హయత్‌నగర్‌ మండలం ఇబ్రహింపట్రం నియోజకవర్గంలో కలిశాయి. విజయవాడ జాతీయ రహదారి కావడం ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రజలతోపాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలు మలక్‌పేట, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లోనే ఎక్కువగా స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.

వీడియోస్

ADVT