నియోజకవర్గం : అసెంబ్లీ

బాన్సువాడ

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నిజామాబాద్
మొత్తం ఓటర్లు :
169697
పురుషులు :
81930
స్త్రీలు :
87750
ప్రస్తుత ఎమ్మెల్యే :
పోచారం శ్రీనివాస్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
బీ.బీ.పాటిల్

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 1,69,697
పురుషులు: 81,930
స్త్రీలు: 87,750
ఇతరులు:  17
 

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గ పరిధిలో బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌, వర్ని, రుద్రూర్‌, కోటగిరి మండలాలు ఉన్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ నియోజకవర్గం ఉంది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ బాలరాజు కాసుల కాంగ్రెస్ 18697
2014 పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ బాలరాజు కాసుల కాంగ్రెస్ 23930
2011 పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ --- --- 49889
2009 పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ బాజిరెడ్డి గోవర్దన్ కాంగ్రెస్ 26103
2004 బి.గోవర్దన్‌ కాంగ్రెస్‌ శ్రీనివాస్‌రెడ్డి 0 0
1999 పి.శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ కిషన్‌సింగ్‌ 0 0
1994 పి.శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ బీనాదేవి 0 0
1989 కత్తెర గంగాధర్‌ టీడీపీ వెంకట్రామిరెడ్డి 0 0
1985 నర్సింహారావ్‌ టీడీపీ వెంకట్రామిరెడ్డి 0 0
1983 కిషన్‌సింగ్‌ టీడీపీ శ్రీనివాస్‌రావ్‌ కాంగ్రెస్ 0
1978 ఎం.శ్రీనివాస్‌రావ్‌ కాంగ్రెస్ నారాయణరావ్‌ 0 0
1972 ఎం.శ్రీనివాస్‌రావ్‌ కాంగ్రెస్‌ రాజయ్య 0 0
1967 ఎం.శ్రీనివాస్‌రావ్‌ కాంగ్రెస్‌ కెఎల్‌ఎన్‌.గౌడ్‌ 0 0
1962 శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ కెఎల్‌ఎన్‌.గౌడ్‌ 0 0
1957 సీతాకుమారి కాంగ్రెస్‌ 0 0 0
1952 లక్ష్మిబాయి కాంగ్రెస్‌ కిషన్‌రావ్‌ 0 0

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో మంజీరా నది ఉంది. నియోజకవర్గాన్ని ఆనుకునే మహరాష్ట్ర సరిహద్దు ఉంది. మంజీరా నది వెంటే ఈ నియోజకవర్గం ఉంది. ముఖ్యంగా వరి ఎక్కువగా సాగుచేస్తారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచే సాగునీరు అందుతుంది. మంజీరా పైన ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నారు.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. నిజాంసాగర్‌ కాల్వల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. మంజీరా పరివాహక ప్రాంతంలో లిఫ్ట్‌ల నిర్మాణం చేస్తున్నారు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు కూడా జరుగుతున్నాయి. వీటితో పాటు జాతీయ రహదారి పనులు కూడా కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు మళ్లారు. వరి, సోయా ఎక్కువగా రైతులు పండిస్తున్నప్పటికీ వాటి ఆధారిత పరిశ్రమలు మాత్రం లేవు.

ముఖ్య ప్రాంతాలు

బడాపహాడ్‌ ఉర్పూ ఈ నియోజకవర్గం పరిధిలో ఉంది. నెమ్లీలోని సాయిబాబా ఆలయం, బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లో ఇందూరు తిరుమల తిరుపతి దేవాలయం ఉంది. బీర్కూర్‌లో శివాలయం ఉంది.

ఇతర ముఖ్యాంశాలు

ఈ నియోజకవర్గంలో సీనియర్‌ నేతలు ఉన్నా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మాత్రం రాలేదు. ఈ నియోజకవర్గం పరిధిలో వరి, సోయా, చెరుకు అత్యధికంగా పండిస్తారు. జిల్లాలో ఎక్కువగా వరి సాగుచేసే గ్రామాలు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి.

వీడియోస్

ADVT