నియోజకవర్గం : అసెంబ్లీ

ఖైరతాబాద్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
256881
పురుషులు :
135196
స్త్రీలు :
121667
ప్రస్తుత ఎమ్మెల్యే :
దానం నాగేందర్
ప్రస్తుత ఎంపీ :
బండారు దత్తాత్రేయ

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,56,881
పురుషులు: 1,35,196
స్త్రీలు: 1,21,667
ఇతరులు: 18
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: నియోజకవర్గంలో బీసీలు,మైనారిటీలు కీలకంగా ఉన్నారు. సెటిలర్లు కూడా ప్రభావం చూపిస్తారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: షేక్‌పేట, ఖైరతాబాద్‌
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: సికింద్రాబాద్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 దానం నాగేందర్ టీఆర్‌ఎస్ చింతల రామచం్రదా రెడ్డి బీజేపీ 28402
2014 చింతలరామచంద్రారెడ్డి బీజేపీ దానంనాగేందర్‌ కాంగ్రెస్‌ 20846
2009 దానంనాగేందర్‌ కాంగ్రెస్‌ కె విజయరామారావు టీడీపీ 13858
2004 పి. జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ కె. విజయరామారావు టీడీపీ 39099
1999 కె. విజయరామారావు టీడీపీ పి. జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ 10377
1994 పి జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ - - 0
1989 పి జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ - - 0
1985 పి జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ - - 0
1983 ఎం రాంచందర్‌రావు ఇండిపెండెంట్‌ - - 0
1978 పి జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌(ఐ) - - 0
1972 నారాలసాయికిరణ్‌ కాంగ్రెస్‌ - - 0
1967 నారాలసాయికిరణ్‌ కాంగ్రెస్‌ - - 0

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

మంత్రుల నివాసాలు, జలమండలి ప్రధాన కార్యాలయం, టెలిఫోన్‌ భవన్‌, ఆర్‌టీఏ కార్యాలయం

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రశాసన్‌నగర్‌ నుంచి తట్టికానా రిజర్వాయర్‌ వరకు గ్రౌండ్‌ లెవెల్‌ గ్రావిటీలో నీరు వచ్చేందుకు 18 కోట్ల రూపాయలతో చేపడుతున్న మంచినీటి పైప్‌లైన్‌ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. దీని వల్ల పలు బస్తీల్లో మంచినీటి సమస్య పరిష్కారం అవ్వడంతో పాటు ప్రతి నెల 10 లక్షల రూపాయల విద్యుత్‌ బిల్లు జలమండలికి ఆదా అవుతుంది. 9.50 కోట్ల రూపాయలతో ఆధునిక పరిజ్ఞానంతో రోడ్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. సుమారు రెండు కోట్ల రూపాయలతో మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్‌ పనులు జరుగుతున్నాయి. మల్లీమోడల్‌ కమ్యూనిటీ హాల్‌ నిమిత్తం మూడు కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. పంజాగుట్ట శ్మశాన వాటికను వైకుంఠ మహాప్రస్థానంగా అభివృద్ధి చేసే పనులు చురుకుగా సాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

కమ్యూనిటీ హాళ్లు నిర్మాణ దశలోనే సాగుతున్నాయి. పనుల్లో వేగం పెంచేందుకు ఇటీవలే నిధులు కూడా మంజూరు అయ్యాయి. ఎన్‌.బీ.నగర్‌లో ప్రభుత్వ పాఠశాల ఇంత వరకు అందుబాటులోకి రాలేదు. అనేక బస్తీల్లో మంచినీటి సమస్య అపరిష్కృతంగానే ఉంది.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో దైవ సన్నిధానం, జగన్నాధస్వామి దేవాలయం, హరేకృష్ణ మూవ్‌మెంట్‌ నిర్మిస్తున్నస్వయంభు లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, బిర్లా మందిర్‌, చూడదగ్గ ఆలయాలు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం టీఆర్‌ఎస్‌ భవన్, టీడీపీ కార్యాలయం ఎన్‌టీఆర్‌ ట్రస్టు భవన్‌ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యే, ఎంపీ కాలనీల్లో అనేక మంది రాజకీయ ప్రముఖులు నివాసముంటున్నారు.

వీడియోస్

ADVT