నియోజకవర్గం : అసెంబ్లీ

కార్వాన్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
303020
పురుషులు :
159020
స్త్రీలు :
143989
ప్రస్తుత ఎమ్మెల్యే :
మహ్మద్‌ కౌసర్‌ మొయునుద్దీన్‌
ప్రస్తుత ఎంపీ :
అసదుద్దీదన్ ఓవైసీ

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు - 3,03,020
పురుషులు - 1,59,020
స్త్రీలు - 1,43,989
ఇతరులు - 11

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌ 
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: ఖైరతాబాద్‌, అమీర్‌పేట, బాలానగర్‌
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: సికింద్రాబాద్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కౌర్ మొహియుద్దీన్ ఎంఐఎం అమర్‌సింగ్ బీజేపీ 49692
2014 కౌసర్‌ మొయునుద్దీన్‌ ఎమ్‌ఐఎమ్‌ బద్దం బాల్‌రెడ్డి బీజేపీ 37777
2009 మహ్మద్‌ ముక్తాద్‌ ఎమ్‌ఐఎమ్‌ దేవర కరుణాకర్‌ బీజేపీ 19283
2004 మహ్మద్‌ ముక్తాద్‌ ఎమ్‌ఐఎమ్‌ బద్దం బాల్‌రెడ్డి బీజేపీ 22235
2003 మహ్మద్‌ ముక్తాద్‌ ఎమ్‌ఐఎమ్‌ బద్దం బాల్‌రెడ్డి బీజేపీ 19700
1999 సయ్యద్‌ సజ్జాద్‌ ఎమ్‌ఐఎమ్‌ జి.కిషన్‌రెడ్డి బీజేపీ 13542
1994 బద్దం బాల్‌రెడ్డి బీజేపీ సయ్యద్‌ సజ్జాద్‌ ఎమ్‌ఐఎమ్‌ 13293
1989 బద్దం బాల్‌రెడ్డి బీజేపీ బాకర్‌ ఆగా ఏమ్‌ఐఎమ్‌ 3036
1985 బద్దం బాల్‌రెడ్డి బీజేపీ మహ్మద్‌ విరాషత్‌ రసూల్‌ ఖాన్‌ ఇండిపెండింట్‌ 9777
1983 బాకర్‌ ఆగా ఇండిపెండింట్‌ నందకిశోర్‌ బీజేపీ 9613

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

అన్నపూర్ణ ఐటీఐ, జీయాగూడ స్లాటర్‌హౌజ్‌, తాళ్లగడ్డ రాజలింగయ్య కబడ్డీ స్టేడియం.

అభివృద్ధి ప‌థ‌కాలు

కార్వాన్‌ నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాలుగా 150 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానంగా నాలాల అభివృద్ధి పనులతో పాటు భూగర్భ డ్రైనేజీ, మంచినీటి వసతి, చెరువుల వద్ద టర్మినల్‌ పనులు, సాలార్‌బ్రిడ్జి, టోలిచౌకి వంతెన, బుల్కాపూర్‌ నాలా, నదీంకాలనీ నాలా, విరాషత్‌నగర్‌ నాలాతో పాటు నియోజకవర్గంలోని రహదారులు, విద్యుత్‌, తాగునీరు, స్మశాన వాటికల అభివృద్ధి, కమ్యూనిటీహాల్‌ అభివృద్ధి చేపట్టారు. నియోజకవర్గంలో ఉన్న శాతం చెరువు అభిృద్ధికి ప్రభుత్వం 3 కోట్లు రూపాయిలు మంజూరు చేసింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ప్రధానంగా గోల్కొండ కఠోరహౌజ్‌ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎన్నిమార్లు స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులుకు తెలిపినా లాభం లేకపోయింది. అయినా ఇప్పటికీ ఎమ్మెల్యే కఠోరహౌజ్‌ అభివృద్ధి విషయంలో ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. దాంతో పాటు చారిత్రాత్మకమైన బాపూఘాట్‌ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి జరగాల్సివుంది. ఇబ్రహీంబాగ్‌ వీకర్‌సెక్షన్‌ అభివృద్ధికి నోచుకోవడం లేదు. జీయాగూడ స్లాటర్‌హౌజ్‌ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగానే ఉంది.

ముఖ్య ప్రాంతాలు

దర్భార్‌ మైసమ్మ ఆలయం, టోలీమసీద్‌, చారిత్రాత్మకమైన గోల్కొండకోట, తారామతిబారాదారి, చారిత్రాత్మకమైన లంగర్‌హౌజ్‌ బాపూఘాట్‌, టోలిచౌకిలోని పశ్చిమ మండల ఆర్టీఏ కార్యాలయం, మెహిదీపట్నం రింగ్‌రోడ్డులోని సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయం, గోల్కొండలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, గోల్కొండలోని ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్‌ కళాశాలలు, గోల్కొండ మండల రెవెన్యూ కార్యాలయం, జలమండలి డివిజన్‌ - 3 కార్యాలయం, గుడిమల్కాపూర్‌ వ్యవసాయ కూరగాయల మార్కెట్‌, పాలకమండలి కార్యాలయం, చారిత్రాత్మకమైన జామ్‌సింగ్‌ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, లంగర్‌హౌజ్‌ సంగం రామాలయం.

వీడియోస్

ADVT