నియోజకవర్గం : అసెంబ్లీ

మల్కాజ్‌గిరి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
379894
పురుషులు :
193344
స్త్రీలు :
186543
ప్రస్తుత ఎమ్మెల్యే :
ఎం.హన్మంతరావు
ప్రస్తుత ఎంపీ :

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 3,79,894
పురుషులు: 1,93,344
స్త్రీలు: 1,86,543
ఇతరులు:  07
 
నియోజక వర్గంలో కీలక వర్గాలు: నియోజకవర్గంలో ముఖ్యంగా బ్రాహ్మణులతో పాటు రెడ్డి, యాదవ, గౌడ కులస్థులు అధికంగా ఉన్నారు.  

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

ఒకప్పుడు కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో ఉన్న మల్కాజ్‌గిరిని నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో చేరింది. ఈ నియోజకవర్గం పూర్తిగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉంది. మల్కాజ్‌గిరి, అల్వాల్‌ సర్కిళ్లతో కలిపి మల్కాజ్‌గిరి నియోజకవర్గంగా ఏర్పాటుచేశారు.
 
నియోజకవర్గం పేరు: మల్కాజ్‌గిరి
రిజర్వేషన్‌: జనరల్‌
ఏ జిల్లాలో ఉంది: మేడ్చల్‌ మల్కాజ్‌గిరి(రంగారెడ్డి)
నియోజక వర్గంలో ఏఏ మండలాలు ఉన్నాయి: మల్కాజ్‌గిరి, అల్వాల్‌
నియోజక వర్గంలో సర్కిళ్ళు:మల్కాజ్‌గిరి, అల్వాల్‌
డివిజన్లు:
మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, మౌలాలి, నేరేడ్‌మెట్‌, వినాయక్‌నగర్‌, గౌతంనగర్‌
అల్వాల్‌ సర్కిల్‌: అల్వాల్‌, మచ్చబొల్లారం, వెంకటాపురం 
ఏ లోకసభ నియోజక వర్గ పరిధిలో ఉంది: మల్కాజ్‌గిరి పార్లమెంట్‌
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఎం.హన్మంతరావు టీఆర్ఎస్ రాంచందర్ రావు బీజేపీ 73698
2014 చింతల కనకారెడ్డి టీఆర్‌ఎస్‌ రాంచందర్‌ రావు బీజేపీ 1700
2009 ఆకుల రాజేందర్‌ కాంగ్రెస్‌ చింతల కనకారెడ్డి ప్రజారాజ్యం 9250

అభివృద్ధి ప‌థ‌కాలు

ప్రపంచబ్యాంకు ఆర్థిక సహకారంతో రూ.330 కోట్ల వ్యయంతో చేపట్టిన మంచినీటి పైప్‌లైన్‌ పనులతో పాటు మంచినీటి రిజర్వాయర్ల నిర్మాణం దాదాపుగా పూర్తి అయ్యింది. అదే విధంగా మల్కాజిగిరిలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

పెండింగ్ ప్రాజెక్టులు

ఉత్తంనగర్‌ ఆర్‌యూబీ పూర్తి అయినప్పటికీ ఎంతో కాలంగా పలు సమస్యలకు కారణమవుతున్న ఆనంద్‌బాగ్‌ ఆర్‌యూబీ మాత్రం ఇంకా పూర్తి కాలేదని ప్రజల్లో అసంతృప్తి ఉంది. అదే విధంగా రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

వీడియోస్

ADVT