నియోజకవర్గం : అసెంబ్లీ

కూకట్‌పల్లి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
378733
పురుషులు :
179182
స్త్రీలు :
158558
ప్రస్తుత ఎమ్మెల్యే :
మాధవరం కృష్ణారావు
ప్రస్తుత ఎంపీ :

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 3,78,733
పురుషులు: 1,79,182
మహిళలు: 1,58,558
ఇతరులు: 93

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

2009వరకు ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న కూకట్‌పల్లి ప్రాంతాన్ని నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.
నియోజకవర్గం పేరు: కూకట్‌పల్లి
రిజర్వేషన్‌: జనరల్‌
ఏ జిల్లాలో ఉంది: మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా(రంగారెడ్డి)
నియోజకవర్గంలోని ఉన్న మండలాలు: కూకట్‌పల్లి, బాలానగర్‌
ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధి: మల్కాజ్‌గిరి
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 మాధవరం కృష్ణారావు టీఆర్‌ఎస్‌ నందమూరి సుహాసిని టీడీపీ 41049
2014 మాధవరం కృష్ణారావు టీడీపీ గొట్టిముక్కల పద్మారావు టీఆర్‌ఎస్‌ 43000
2009 డా.జయప్రకాష్‌ నారాయణ లోక్‌సత్తా వడ్డేపల్లి నర్సింగరావు కాంగ్రెస్‌ 17000

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

జేఎన్‌టీయూహెచ్‌, సీఐటీడీ కేంద్ర సంస్థ, చిన్నతరహా పరిశ్రమల శిక్షణా కేంద్రం(ఎంఎస్‌ఎంఈ), హెచ్‌ఏఎల్‌ కంపెనీ, బీహెచ్‌ఈఎల్‌ ఆర్‌అండ్‌బీ, పరిశ్రమల శాఖ కార్యాలయం, నైపర్‌, ఐడీపీఎల్‌ కంపెనీ, సుజనా ఫోరం మాల్‌, మంజీరా మాల్‌ వంటివి కూకట్‌పల్లిలో ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఇంటికీ మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో చేపడుతున్న మిషన్‌ భగీరధ పనులు కొనసాగుతున్నాయి. సుమారు రూ.400 కోట్లతో పైపులైను, రిజర్వాయర్ల పనులు చేస్తున్నారు. ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంది. నియోజకవర్గానికి ఇప్పటివరకు 4,149 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటిల్లో ఎమ్మెల్యే ఫండ్‌ రూ.12.60కోట్లు, ఫ్లైవోవర్లకు రూ.550 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.31కోట్లు, జీహెచ్‌ఎంసీ నిధులు రూ.2,811కోట్లు విడుదలయ్యాయి. మిషన్‌ భగీరధకు రూ.400కోట్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు రూ.330కోట్లు, జీహెచ్‌ఎంసీ ఎలక్ర్టికల్‌ వర్క్స్‌కు రూ.3.51కోట్లు, ఇతర కల్యాణలక్ష్మి, పింఛన్లు, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సుమారు రూ.10కోట్లు విడుదలయ్యాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

కూకట్‌పల్లి ప్రాంతాన్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల్లో ట్రాఫిక్‌ సమస్య ప్రధానమైంది. కూకట్‌పల్లి ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులు, రోడ్ల విస్తరణ, ఫ్లైవోవర్ల నిర్మాణం జరిగలేదు. దీంతో తరచూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. దీనికితోడు డ్రైనేజీ సమస్య తరచూ వేధిస్తోంది. ప్రస్తుత జనాభా ఆధారంగా వేస్తున్న భూగర్భ డ్రైనేజీ పైపులు కొద్దికాలానికే మార్చాల్సి వస్తోంది. కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు వెలుస్తుండడం, దీంతో నివాసాలు పెరిగి స్థానిక డ్రైనేజీ పొంగిపొర్లడం జరుగుతోంది. అదేవిధంగా అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపీహెచ్‌బీ కాలనీలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు, మహాప్రస్థానం, పార్కుల అభివృద్ధి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. దీంతో కేపీహెచ్‌బీ కాలనీవాసులు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కూకట్‌పల్లి ప్రాంతంలోని చెరువులు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకొనే నాధుడే కరువయ్యారు. ఫలితంగా చెరువులు కబ్జాదారుల ఆక్రమణతో కుచించుకుపోతున్నాయి.

ముఖ్య ప్రాంతాలు

కూకట్‌పల్లి ప్రాంతంలో చెప్పుకోదగ్గ పురాతన ఆలయాల్లో కూకట్‌పల్లిలోని పాత శివాలయం ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా ఒకప్పుడు కుగ్రామంగా ఉండే కూకట్‌పల్లి నేడు వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలకు నిలయంగా మారింది. ఇక్కడ జేఎన్‌టీయూహెచ్‌ విశ్వవిద్యాలయం, నైపర్‌, సీఐటీడీ, ఎంఎస్‌ఎంఈ, బీహెచ్‌ఈఎల్‌ ఆర్‌అండ్‌బీ, హెచ్‌ఏఎల్‌ సంస్థలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

గతంలో పంచాయతీగా ఉన్న కూకట్‌పల్లి ఆ తర్వాత మున్సిపాలిటీగా ఏర్పాటయింది. అనంతరం జీహెచ్‌ఎంసీలో కలిసింది. అనంతరం సర్కిళ్ల పునర్విభజనలో భాగంగా కూకట్‌పల్లి సర్కిల్‌గా ఉన్న ప్రాంతాన్ని రెండు సర్కిళ్లుగా విభజించారు. తాజాగా జరిగిన జోన్ల పునర్విభజనలో భాగంగా కూకట్‌పల్లిని ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేశారు. అయితే ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న కూకట్‌పల్లి ప్రాంతం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇక్కడే ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కేపీహెచ్‌బీకాలనీ ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల వారి ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా కేపీహెచ్‌బీ ప్రాంతం మినీ భారతదేశాన్ని తలపించేలా దేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన వారు నివాసముంటున్నారు.

వీడియోస్

ADVT