నియోజకవర్గం : అసెంబ్లీ

బాల్కొండ

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నిజామాబాద్
మొత్తం ఓటర్లు :
189885
పురుషులు :
87243
స్త్రీలు :
102631
ప్రస్తుత ఎమ్మెల్యే :
వేముల ప్రశాంత్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
కల్వకుంట్ల కవిత

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 189885
పురుషులు: 87243
స్త్రీలు: 102631
ఇతరులు: 11 

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గ పరిధిలో బాల్కొండ, ముప్కాల్‌; మెండోరా, వేల్పూర్‌, భీంగల్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలాలు ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ నియోజకవర్గం ఉంది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 వేముల ప్రశాంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సునీల్ రెడ్డి బీఎస్పీ 32408
2014 ప్రశాంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అనిల్‌ కాంగ్రెస్‌ 25000
2009 అనిల్‌ పీఆర్‌పీ శ్రీనివాస్‌రెడ్డి 0 0
2004 కెఆర్‌.సురేష్‌రెడ్డి కాంగ్రెస్‌ వసంత్‌రెడ్డి 0 0
1999 కెఆర్‌.సురేష్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎ.గంగారెడ్డి 0 0
1995 కెఆర్‌.సురేష్‌రెడ్డి కాంగ్రెస్‌ బద్దం నర్సారెడ్డి 0 0
1990 కెఆర్‌.సురేష్‌రెడ్డి కాంగ్రెస్‌ మోతె గంగారెడ్డి 0 0
1985 మధుసూధన్‌రెడ్డి టీడీపీ ప్రమీలాదేవి 0 0
1983 మధుసూధన్‌రెడ్డి టీడీపీ జి.సుశీలాబాయి 0 0
1981 జి.సుశిలాబాయి కాంగ్రెస్‌ బి.రెడ్డి 0 0
1978 జి.రాజారాం కాంగ్రెస్‌ మధుసూధన్‌రెడ్డి 0 0
1972 జి.రాజారాం కాంగ్రెస్‌ రాజేశ్వర్‌ 0 0
1967 జి.రాజారాం కాంగ్రెస్‌ 0 0 0
1962 జి.రాజారాం కాంగ్రెస్‌ కెఎస్‌,రెడ్డి 0 0
1957 రంగారెడ్డి కాంగ్రెస్‌ రాజ్‌గౌడ్‌ 0 0
1952 కె.అనంత్‌రెడ్డి సోషలిస్ట్‌ రంగారెడ్డి 0 0

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణకు సాగునీరు అందిస్తున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఉంది. గోదావరి నదిపై పోచంపాడ్‌ వద్ద ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు పూర్వ అదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలకు తాగు, సాగునీరు ఈ ప్రాజెక్ట్‌ ద్వారానే అందుతుంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం అనేక అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్దవాగుపై లిఫ్ట్‌ల నిర్మాణం చేస్తున్నారు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ కూడా ఎస్సారెస్పీ నుంచే వెళ్తుంది. బాల్కొండ వద్ద ఇంటెక్వెల్‌ నిర్మాణం చేయడంతో పాటు గుట్టపైన ట్యాంకులను నిర్మించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో సాగునీటి కోసం ఎత్తిపోతల పథకం పనులు చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌‌రూంల ఇళ్ల నిర్మాణం, ఈ మధ్యనే భీంగల్‌ మేజర్‌ గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా ఏర్పాటు చేశారు.

పెండింగ్ ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా గల్ఫ్‌ కార్మికుల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. గల్ఫ్‌కి వెళ్లి తిరిగి వచ్చిన వారికి ఉపాధి దొరకడం లేదు.వేల్పూర్‌ మండలం పడగల్‌ వద్ద పసుపు పార్క్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు కొనసాగుతున్నాయి. పతంజలి సంస్థకు చెందిన రాందేవ్‌బాబా ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు.

ముఖ్య ప్రాంతాలు

ఎస్సారెస్పీ, భీంగల్‌ లక్ష్మినరసింహ ఆలయం, అంక్సాపూర్‌లోని పాదరస శివలింగం, పొచంపాడ్‌ కొదండ రామాలయం, తడ్‌పాకల్‌ రామాలయం, హనుమాన్‌ ఆలయాలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

ఈ నియోజకవర్గంలో అందరూ సీనియర్‌ నేతలే ఉన్నా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను మాత్రం తీసుకురాలేకపోయారు. ఈ నియోజకవర్గం పరిధిలో పసుపు అత్యధికంగా పండిస్తారు. జిల్లాలో ఎక్కువగా పసుపు సాగుచేసే గ్రామాలు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న సాగును రైతులు ఎక్కువగా చేస్తారు. మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మొదటిసారి ఎంపికయ్యారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోటీచేసి గెలిచిన వారే ఉన్నారు. వారిలో చాలా మంది రాష్ట్రస్థాయిలో మంత్రి పదవులను పొందారు.

వీడియోస్

ADVT