నియోజకవర్గం : అసెంబ్లీ

ఉప్పల్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
427141
పురుషులు :
223949
స్త్రీలు :
203099
ప్రస్తుత ఎమ్మెల్యే :
బేతి సుభాష్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :

ఓట‌ర్లు

నియోజకవర్గం ఓటర్లు: 4,27,141
పురుషులు: 2,23,949
స్త్రీలు: 2,03,099
ఇతరులు: 93
 

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజవర్గం: ఉప్పల్‌
రిజర్వేషన్‌: జనరల్‌
ఏ జిల్లాలో ఉంది: మేడ్చెల్‌-మల్కాజగిరి(రంగారెడ్డి)
నియోజకవర్గంలోని మండలాలు: ఉప్పల్‌, కాప్రా
ఉప్పల్‌ నియోజకవర్గంలో సర్కిళ్ళు: కాప్రా సర్కిల్‌, ఉప్పల్‌ సర్కిల్‌
కాప్రాలో: కాప్రా డివిజన్‌, ఏఎస్‌రావు నగర్‌, చర్లపల్లి, మీర్‌పేట్‌ హౌజింగ్‌బోర్డు, మల్లాపూర్‌, నాచారం
ఉప్పల్‌లో: చిలుకానగర్‌, హబ్సిగూడ, రామంతాపూర్‌, ఉప్పల్‌ 
ఏ పార్లమెంటు నియోజకవర్గం: మల్కాజిగిరి పార్లమెంటు
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 బేతి సుభాష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ వీరేందర్ గౌడ్ టీడీపీ 48168
2014 ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ బీజేపీ బేతి సుభాష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ 17438
2009 బండారి రాజిరెడ్డి కాంగ్రెస్‌ నోమా యాదగిరిరెడ్డి టీఆర్‌ఎస్‌ 27000

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈసీఐఎల్‌, ఎన్‌ఎఫ్‌సీ, ఎన్జీఆర్‌ఐ, సర్వే ఆఫ్‌ ఇండియా, రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ క్రికెట్‌ స్టేడియం, రామంతాపూర్‌ దూరదర్శన్‌, సీడీఎఫ్‌డీ, అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రామంతాపూర్‌ హోమియోపతి కళాశాల, రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, దృశ్యశ్రవణ విద్యావికాస కేంద్రం, ఉప్పల్‌ పారిశ్రామికవాడ, నాచారం పారిశ్రామికవాడ, కుషాయిగూడ పారిశ్రామికవాడ, చర్లపల్లి పారిశ్రామికవాడ, చర్లపల్లి జైలు, సీపెట్‌, కేంద్రీయ విద్యాలయాలు, లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కళాశాల, పాఠశాలలు, మెట్రోరైల్‌ డిపో వంటి సంస్థలు  ఉప్పల్ ప్రాంతంలో ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

ప్రస్తుతం నియోజకవర్గంలో కాప్రా- ఉప్పల్‌ సర్కిళ్ల పరిధిలో మిషన్‌ భగీరథలో భాగంగా రూ.375 కోట్లతో మంచినీటి రిజర్వాయర్లు, పైప్‌లైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు తుది దశలో ఉన్నాయి. ప్రధానంగా రూ. 600 కోట్లతో ఉప్పల్‌ ప్రధాన రహదారిలో రోడ్డు విస్తరణ, ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ పనులకు ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఇంకా  ఆ పనులు మొదలు కాలేదు.

పెండింగ్ ప్రాజెక్టులు

ఉప్పల్‌ రోడ్డు విస్తరణ సమస్యకు పరిష్కారం దొరికేదెన్నడో.  ఉప్పల్‌ - నారాపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం మొదలు కాలేదు. చర్లపల్లి రైల్‌ టర్మినల్‌ పనులు మొదలు కాలేదు. చర్లపల్లి ఆర్‌ఓబీ పనులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

వీడియోస్

ADVT