నియోజకవర్గం : అసెంబ్లీ

శేరిలింగంపల్లి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
549773
పురుషులు :
293696
స్త్రీలు :
255961
ప్రస్తుత ఎమ్మెల్యే :
ఆరెకపూడి గాంధీ
ప్రస్తుత ఎంపీ :
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 5,49,773
పురుషులు: 2,93,696
స్త్రీలు: 2,55,961
ఇతరులు: 116
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: 
కమ్మ సామాజికవర్గం అన్ని సామాజిక వర్గాల కంటే బలంగా ఉంది. బీసీ ఓట్లు ఇక్కడ గెలుపు, ఓటములను నిర్ణయిస్తాయి. నియోజకవర్గంలో మొదటి నుంచి ఈ ప్రాంతంలో వలస వచ్చిన వారు ఎక్కువగా ఉండటంతో ప్రతి ఎన్నికల్లో వీరి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ పార్టీల మధ్యనే పోటీ ఉండేది. ఈ రెండు పార్టీల ఓట్లను మిగితాపార్టీలు చీల్చేదానిపై ఆ రెండు పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉండేవి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

శేరిలింగపల్లి నియోజక వర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది.
నియోజక వర్గం పేరు: శేరిలింగంపల్లి
రిజర్వేషన్‌: జనరల్‌
ఏ జిల్లాలో ఉంది: రంగారెడ్డి జిల్లా
నియోజక వర్గంలో ఉన్న మండలాలు: శేరిలింగంపల్లి మండలంలో ఏడు డివిజన్‌లు, బాలానగర్‌ మండలంలో మూడు డివిజన్‌లు
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: చేవెళ్ల
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఆరెకపూడి గాంధీ టీఆర్‌ఎస్ భవ్య ఆనంద్ ప్రసాద్ టీడీపీ 44295
2014 ఆరెకపూడి గాంధీ టీడీపీ శంకర్‌గౌడ్‌ టీఆర్‌ఎస్ 75904
2009 బిక్షపతి యాదవ్‌ కాంగ్రెస్ మువ్వసత్యనారాయణ టీడీపీ 1227

అభివృద్ధి ప‌థ‌కాలు

రూ.3 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 19 రిజర్వాయర్లు, 410 కిలోమీటర్ల పైపులైన్లతో 500 కోట్ల రూపాయలతో మిషన్‌ భగీరథ పనులు జరుగుతున్నాయి. రూ.1667 కోట్లతో అండర్‌ ప్రాసెస్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. డ్రైనేజీ పనుల కింద రూ.100 కోట్లు విడుదల చేశారు. రోడ్లు, చెరువుల అభివృద్ధికి చర్యలు మొదలయ్యాయి.

ఇతర ముఖ్యాంశాలు

ఐటీహబ్‌, జాతీయ - అంతర్జాతీయ ప్రతిష్టాత్మక  ప్రవేట్‌ రంగ సంస్థలు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాయి. హెచ్‌సీయూ, ఇప్లూ, ఇగ్నో, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సీటీ, మనూ, నిప్ట్‌ నిథమ్‌, సీఓడీ, ట్రీపుల్‌ఐటీ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. శిల్పారామం కూడా ఇక్కడే ఉంది. 400 సంవత్సరాలు చరిత్ర గల రంగనాథ స్వామి దేవాలయం, 400 ఏళ్ల చరిత్ర కలిగిన తుల్జాభవాని దేవాలయం, చారిత్రాత్మక నేపథ్యం కలిగిన 60 గొలుసుకట్టు చెరువులు, వెస్ట్‌జోన్‌ కార్యాలయం ఉన్నాయి. గృహనిర్మాణ రంగంలో, రియల్‌ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రస్థానంలో ఉంది. మాదాపూర్‌లో గజం స్థలం లక్షన్నర పలుకుతుందంటే నియోజక వర్గంలో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవచ్చు.
 
2009లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు శేరిలింగంపల్లి ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. అంతకుముందు చేవెళ్ల, కంటోన్మెంట్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజక వర్గం పూర్తిగా 10 డివిజన్‌లతో, పాక్షికంగా రెండు డివిజన్‌లతో ఏర్పడింది. దాదాపు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో 6.20 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. 125 కిలోమీటర్ల విస్తీర్ణం, మూడు జిల్లాల పరిధితో ఈ ప్రాంతం ఉంది. దాదాపుగా 29 రాష్ర్టాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అందుకే శేరిలింగంపల్లి నియోజకవర్గం మినీ భారత్‌ను తలపిస్తుంది.

వీడియోస్

ADVT