నియోజకవర్గం : అసెంబ్లీ

ఎల్‌బీనగర్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
474599
పురుషులు :
250022
స్త్రీలు :
224495
ప్రస్తుత ఎమ్మెల్యే :
డి.సుధీర్ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 4,74,599
పురుషులు: 2,50,022
స్త్రీలు: 2,24,495
ఇతరులు: 82
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో సెటిలర్లు అధికంగా ఉన్నారు. ప్రధానంగా రెడ్డి, యాదవులు, గౌడ, బ్రాహ్మణ సామాజికవర్గం వారు కీలకంగా వ్యవహరించనున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: ఎల్‌బీనగర్‌
రిజర్వేషన్‌: జనరల్‌
ఏ జిల్లాలో ఉంది: రంగారెడ్డి జిల్లా
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌ అర్బన్‌ మండలాలు (నాగోల్‌, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్‌, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ, కొత్తపేట, గడ్డిఅన్నారం డివిజన్లు) 
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది: మల్కాజ్‌గిరి
ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం చరిత్ర: మలక్‌పేట నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న ఎల్‌బీనగర్‌, గడ్డిఅన్నారం మున్సిపాలిటీలలోని ప్రాంతాలను కలిపి నియోజకవర్గాల పునర్విభజనతో ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం ఏర్పడింది. 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 డి.సుధీర్ రెడ్డి కాంగ్రెస్ రామ్మోహన్ గౌడ్ టీఆర్ఎస్ 16985
2014 ర్యాగ కృష్ణయ్య టీడీపీ ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ 12525
2009 దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎస్వీ కృష్ణప్రసాద్‌ టీడీపీ 13142

అభివృద్ధి ప‌థ‌కాలు

ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌: ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజ్‌-2లో భాగంగా రూ.448 కోట్లతో ఎల్‌బీనగర్‌ జంక్షన్‌, కామినేని జంక్షన్‌, చింతలకుంట జంక్షన్‌, బైరామల్‌గూడ జంక్షన్లలో అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. వీటిలో చింతలకుంట అండర్‌పాస్‌ ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి.
ఫతుల్లగూడలో రూ. 5 కోట్లతో యానిమల్‌ కేర్‌ సెంటర్‌ నిర్మిస్తున్నారు.

సీవర్‌లైన్స్‌, ఎస్‌డబ్య్లూడీ డ్రైన్ల నిర్మాణం: సీసలబస్తీ నుంచి వివేకానందనగర్‌ వరకు రూ. 1.95 కోట్లతో, అల్కాపురి జంక్షన్‌ నుంచి మూసీ నది వరకు రూ. 12 కోట్లతో, దుర్గాభవానీ నగర్‌ నుంచి రెడ్డికాలనీ వరకు రూ. 5.9 కోట్లతో ఎస్‌డబ్ల్యూడీ డ్రైన్స్‌ నిర్మిస్తున్నారు. హస్తినాపురంలో రూ.2.75 కోట్లతో, వనస్థలిపురంలో రూ.2.90 కోట్లతో, హయత్‌నగర్‌లో రూ.3 కోట్లతో, బైరామల్‌గూడ చెరువు నుంచి సరూర్‌నగర్‌ ఎస్‌టీపీ వరకు రూ.5 కోట్లతో సివర్‌ట్రంక్‌లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ద్వారకతిరుమల కాలనీ, సాగర్‌ ఎన్‌క్లేవ్‌, రెడ్డికాలనీలలో రూ. 2 కోట్లతో సివర్‌, ఎస్‌డబ్య్లూడీ డ్రైన్‌ పనులు జరుగుతున్నాయి. రూ. 12 కోట్లతో కళానికేతన్‌ నుంచి మూసీనది వరకు నాలా రిటైనింగ్‌ వాల్‌ చేపట్టనున్నారు. రూ.316.33 లక్షలతో సరూర్‌నగర్‌ వై జంక్షన్‌ అభివృద్ధి పర్చనున్నారు.
 
ఇంజనీరింగ్‌ పనులు: రూ. 257 కోట్లతో మోడల్‌ మార్కెట్లు, మల్టిపర్పస్‌ హాల్‌, కమ్యూనిటీహాళ్లు, గౌరవగృహాలు, బస్‌బేలు, సీసీ, బీటీ, రహదారులు, భూగర్భ డ్రైనేజీ, ప్రహరీగోడల నిర్మాణం వంటి 2543 పనులు చేపట్టారు, వాటిలో 1869 పనులు పూర్తవగా 269 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా 405 పనులు చేపట్టాల్సి ఉంది.
 
డబుల్‌ బెడ్‌‌రూమ్‌ పథకం: ఎరుకల నాంచారమ్మనగర్‌, బాగ్‌ హయత్‌నగర్‌, వనస్థలిపురం రైతుబజార్‌, కర్మన్‌ఘాట్‌, న్యూఇందిరానగర్‌లలో రూ.9087 కోట్లతో 1052 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటిలో ఎరుకల నాంచారమ్మనగర్‌, బాగ్‌ హయత్‌నగర్‌, వనస్థలిపురం రైతుబజార్‌, కర్మన్‌ఘాట్‌ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నది. న్యూఇందిరానగర్‌లో 108 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
 
చెరువుల సుందరీకరణ: మిషన్‌ కాకతీయ అర్బన్‌లేక్స్‌ ద్వారా కాంప్రహెన్సీవ్‌ డెవలప్‌మెంట్‌ వర్క్స్‌లో భాగంగా రూ.7.39 కోట్లతో మన్సూరాబాద్‌ పెద్ద చెరువు, రూ. 4.07 కోట్లతో మద్దెల చెరువు, రూ.16.04 కోట్లతో సరూర్‌నగర్‌ చెరువుల సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.
 
జంక్షన్ల అభివృద్ధి: జంక్షన్ల అభివృద్ధి పనులలో భాగంగా రూ.29 లక్షలతో బీఎన్‌రెడ్డి జంక్షన్‌, రూ. 68 లక్షలతో కర్మన్‌ఘాట్‌ జంక్షన్‌, రూ. 43 లక్షలతో హస్తినాపురం జంక్షన్‌, రూ. 60 లక్షలతో మంద మల్లమ్మ జంక్షన్‌లు అభివృద్ధి చేయనున్నారు.
 
వీధిదీపాల పనులు: రూ.1,990.96 కోట్లతో వీధి దీపాల ఎల్‌ఈడీ ప్రాజెక్ట్‌ పనులు చేపట్టారు. మరో రూ. 250.09 కోట్లతో 110 అభివృద్ధి పనులు చేపట్టారు.
రూ. 58.19 లక్షలతో 12 పార్కులలో అభివృద్ధి పనులు చేపట్టారు.

రిజర్వాయర్ల నిర్మాణం: హడ్కో నిధులు రూ. 312 కోట్లతో 4.05 కోట్ల లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్లు ఆటోనగర్‌, వైట్‌ ట్యాంక్‌, రైతుబజార్‌, రెడ్‌ ట్యాంక్‌, గ్రీన్‌ ట్యాంక్‌, సాహెబ్‌నగర్‌, సౌభాగ్యపురం, అల్కాపురి ప్రాంతాలలో 14 నిర్మించారు. అదేవిధంగా 354 కిలోమీటర్ల పైప్‌లైన్లు నిర్మించారు.

విద్యుత్‌ సరఫరా: రూ.15.30 కోట్లతో 6 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఫీడర్‌లైన్లతో పాటు నిర్మించారు. రూ.2.01 కోట్లతో ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌ నిర్మించారు. రూ. 23.27 కోట్లతో 990 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు.

పెండింగ్ ప్రాజెక్టులు

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని ఆటోనగర్‌ డంపింగ్‌యార్డు ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. ప్రస్తుతం చెత్త వేయకున్నప్పటికీ ఇప్పటికే గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో భరించలేని దుర్గంధతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. నియోజకవర్గంలో ట్రంక్‌లైన్ల నిర్మాణం అత్యవసరం. చాలా కాలనీలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై ఇటీవల మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

ముఖ్య ప్రాంతాలు

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో హరిణ వనస్థలి జింకల ఎకో టూరిజం పార్కు, క్రీడా తదితర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. హయత్‌బక్షి మసీదు, దక్షిణ షిర్డీగా పేరొందిన షిర్డీ సాయి సంస్థాన్‌ ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గాల పునర్విభజనతో ఎల్‌బీనగర్‌, గడ్డిఅన్నారం మున్సిపాలిటీలలోని ప్రాంతాలతోఎల్‌బీనగర్‌ నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గం నగరానికి ఆనుకుని ఉండటంతో జనాభా రోజురోజుకు విస్తరిస్తోంది. మెట్రోకారిడార్‌తో కొత్తకళ సంతరించుకుంది.

వీడియోస్

ADVT