నియోజకవర్గం : అసెంబ్లీ

జూబ్లీహిల్స్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
328018
పురుషులు :
175935
స్త్రీలు :
152079
ప్రస్తుత ఎమ్మెల్యే :
మాగంటి గోపీనాథ్
ప్రస్తుత ఎంపీ :
బండారు దత్తాత్రేయ

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 3,28,018
పురుషులు: 1,75,935
స్త్రీలు: 1,52,079
ఇతరులు: 04 
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అన్ని వర్గాల ఓటర్లు కీలకంగా ఉన్నారు. సెటిలర్లు, బీసీ, మైనారిటీ ఓటర్లు రాజకీయాలను శాసిస్తున్నారు. అయితే సెటిలర్లు, మైనారిటీలు ఎటు మొగ్గు చూపిస్తే ఆ పార్టీనే విజయం వరిస్తుంది

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఖైరతాబాద్‌ నుంచి జూబ్లీహిల్స్‌ ఓ నియోజకవర్గంగా ఏర్పడింది. మొదటి సారి దివంగత కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించగా 2014లో టీడీపీ నుంచి బరిలో దిగిన మాగంటి గోపీనాథ్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే విధంగా గత ఎన్నికల్లో ఎంఐఎం మొదటి సారిగా ఇక్కడి నుంచి పోటీ చేసి రెండవ స్థానం దక్కించుకుంది. ఆ పార్టీ తరఫున చిన్నశ్రీశైలం కుమారుడు నవీన్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ తరఫున మురళీగౌడ్‌లు పోటీ పడ్డారు.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 మాగంటి గోపీనాథ్ టీఆర్‌ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ 15997
2014 మాగంటిగోపీనాథ్‌ టీడీపీ 0 ఎంఐఎం 9242
2009 పి. విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ మహ్మద్‌ సలీం టీడీపీ 21741

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రహ్మత్‌నగర్‌ ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో 34 లక్షల రూపాయలతో దళిత్‌ స్టడీ సర్కిల్‌, నాలుగు కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం, కోటి రూపాయలతో మంచినీటి పైప్‌లైన్‌ పనులు, రూ.2.31 కోట్లతో ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మంచినీరు, డ్రైనేజీ పనుల నిమిత్తం ఆరు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో మంచినీటి రిజర్వాయర్‌ కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 10లో స్థలాన్ని సేకరించారు. త్వరలోనే నిర్మాణం ప్రారంభమవుతుంది. కల్యాణ్ నగర్‌ ఫేజ్‌-1లో కబ్జా కోరల్లో ఉన్న 3000 గజాల స్థలాన్ని కాపాడి దాన్ని మోడల్‌ పార్క్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. రహ్మత్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో రహ్మత్‌నగర్‌ డివిజన్‌ ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో నిత్యం డ్రైనేజీ సమస్య కనిపించేది. దీన్ని పరిష్కరించేందుకు సుమారు 60 లక్షల రూపాయలతో పైప్‌లైన్‌ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారమైంది. ఎల్లారెడ్డిగూడ పీజేఆర్‌ కమ్యూనిటీహాల్‌, సంజయ్‌గాంధీ నగర్‌ కమ్యూనిటీహాల్‌, ప్రభుత్వ వైద్యశాల ఇంత వరకు అందుబాటులోకి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. దీన్ని పరిష్కరించేందుకు కొత్త పైప్‌లైన్‌లు నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో కృష్ణకాంత్‌పార్క్‌, యూసఫ్‌గూడలో విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియం, శ్రీనగర్‌కాలనీ వెంకటేశ్వరస్వామి దేవాలయం సందర్శించదగ్గవి.

ఇతర ముఖ్యాంశాలు

జూబ్లీహిల్స్‌ పేరు మీద ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్‌ ప్రాంతాలు రాకపోవడం విశేషం. అంతేకాకుండా నియోజకవర్గంలో మండల కార్యాలయం, పోలీస్ స్టేషన్‌, అగ్నిమాపక కేంద్రాలను ఇంత వరకు నెలకొల్పలేదు. ఇప్పటికీ వివిధ ప్రభుత్వ పనుల నిమిత్తం ఇతర నియోజకవర్గాల మీద ఆధారపడాల్సి వస్తోంది.

వీడియోస్

ADVT