నియోజకవర్గం : అసెంబ్లీ

ఆర్మూర్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
నిజామాబాద్
మొత్తం ఓటర్లు :
170732
పురుషులు :
80325
స్త్రీలు :
90402
ప్రస్తుత ఎమ్మెల్యే :
ఆశన్నగారి జీవన్‌రెడ్డి
ప్రస్తుత ఎంపీ :
కల్వకుంట్ల కవిత

ఓట‌ర్లు

మొత్తం ఓట్లు: 1,70,732
పురుషులు: 80325
స్త్రీలు: 90402
ఇతరులు:05
 
నియోజకవర్గంలో కీలక సామాజికవర్గాలు: ఈ నియోజకవర్గంలో కాపు, రెడ్డి, పద్మశాలి, మైనార్టీ, ఆర్య క్షత్రియ, దేవాంగి, ఎస్సీ, సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

 జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గంలో ఆర్మూర్‌, మాక్లూర్‌, నందిపేట మండలాలు ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ నియోజకవర్గం ఉంది.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 ఆశన్నగారి జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ఆకల లలిత కాంగ్రెస్ 28795
2014 ఆశన్నగారి జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సురేష్‌రెడ్డి కాంగ్రెస్‌ 13964
2009 అన్నపూర్ణమ్మ టీడీపీ సురేష్‌రెడ్డి కాంగ్రెస్ 13059
2004 సంతోష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అన్నపూర్ణమ్మ టీడీపీ 6555
1999 బాజిరెడ్డి గోవర్దన్‌ కాంగ్రెస్‌ అన్నపూర్ణమ్మ టీడీపీ 23673
1995 అన్నపూర్ణమ్మ టీడీపీ బాజిరెడ్డి గోవర్దన్‌ కాంగ్రెస్ 14043
1990 సంతోష్‌రెడ్డి కాంగ్రెస్‌ సురేందర్‌రెడ్డి టీడీపీ 11421
1985 మహిపాల్‌రెడ్డి టీడీపీ సంతోష్‌రెడ్డి కాంగ్రెస్ 6608
1983 సంతోష్‌రెడ్డి కాంగ్రెస్‌ మహిపాల్‌రెడ్డి ఇండి 5556
1978 ఎస్‌.సంతోస్‌రెడ్డి కాంగ్రెస్‌ కె.ఆర్‌.గోవింద్‌రెడ్డి జనతా 31857
1972 టి.రంగారెడ్డి కాంగ్రెస్‌ టీఎస్‌.రావ్‌ ఇండి 18042
1967 టి. రంగారెడ్డి కాంగ్రెస్‌ టీఎస్‌.రావ్‌ ఇండి 9632
1962 టి.రంగారెడ్డి కాంగ్రెస్‌(ఏకగ్రీవం) --- --- 0
1957 టి.అంజయ్య కాంగ్రెస్‌ ఎం.ఎస్‌రెడ్డి ఇండి 6629

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో పలు ముఖ్యమైన సంస్థలు ఉన్నాయి. ప్రైవేటు పరంగా ఇంజనీరింగ్‌, ఫార్మసి కళాశాలలు ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో గోదావరి నదిపై రెండు జిల్లాలను కలిపే బ్రిడ్జ్‌ నిర్మాణం చేస్తున్నారు. గ్రామాల్లోని సాగునీటి కోసం ఎత్తిపోతల పథకాల పనులు జరుగుతున్నాయి. డబుల్‌ బెడ్‌‌రూం ఇళ్ల నిర్మాణం, మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ఆర్మూర్‌ మున్సిపాలిటి పరిధిలో రోడ్డు వెడల్పు, డ్రైనేజీ, తాగునీటి పనులు కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా గల్ఫ్‌ కార్మికుల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. గల్ఫ్‌కి వెళ్లి తిరిగి స్వదేశానికి వచ్చేసిన వారికి ఉపాధి దొరకడంలేదు. నందిపేట మండలం లక్కంపల్లి సెజ్‌ ఏర్పాటు అయినప్పటికీ, ఇప్పటి వరకు పనులు మాత్రం పూర్తికాలేదు. పతంజలి సంస్థకు చెందిన రాందేవ్‌బాబా ఈ నియోజవర్గంలో పరిశ్రమలను నెలకొల్పి, పరిశీలించి వెళ్లారు.

ముఖ్య ప్రాంతాలు

ఈ నియోజకవర్గంలో చారిత్రక, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. నవసిద్దుల గుట్ట, అపురూప వెంకటేశ్వర ఆలయం, నందిపేట పల్‌గుట్ట, అంకాపూర్‌ విత్తనాభివృద్ధి కేంద్రం, కుద్వాన్‌పూర్‌ ఎల్లమ్మ ఆలయాలు ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

ఈ నియోజకవర్గంలో అందరూ సీనియర్‌ నేతలు ఉన్నా అనుకున్న విధంగా అభివృద్ధి మాత్రం జరగలేదు. మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి రెండు దఫాలు పోటిచేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మొదటిసారి ఎంపికయ్యారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోటీచేసి గెలిచిన వారే ఉన్నారు. వారిలో చాలా మంది రాష్ట్రస్థాయిలో మంత్రి పదవులను పొందారు.

వీడియోస్

ADVT