నియోజకవర్గం : అసెంబ్లీ

అంబర్‌పేట్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
235410
పురుషులు :
121488
స్త్రీలు :
113908
ప్రస్తుత ఎమ్మెల్యే :
కాలేరు వెంకటేశ్
ప్రస్తుత ఎంపీ :
బండారు దత్తాత్రేయ

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 2,35,410
పురుషులు: 1,21,488
స్త్రీలు: 1,13,908
ఇతరులు: 14
 

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం అంబర్‌పేటగా మారింది. హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా 1972లో లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలుపొందారు. 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున మహ్మద్‌ ఆసీమ్‌ గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున నారాయణగౌడ్‌ గెలుపొందారు. ఫలితాలు వెలువడిన నాడు ఆయన గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున పోటీచేసి ఆలె నరేంద్ర గెలుపొందారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ నుంచి తిరిగి నరేంద్ర విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున వి. హనుమంతరావు గెలుపొందారు. 1992లో ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆలె నరేంద్ర మరోసారి గెలుపొందారు. 1994లో టీడీపీ నుంచి సి కృష్ణయాదవ్‌ గెలుపొంది  చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి సి కృష్ణయాదవ్‌ గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్‌విభజనలో హిమాయత్‌నగర్‌ నియోజకవర్గాన్ని రద్దు చేసి కొత్తగా అంబర్‌పేట నియోజవర్గాన్ని ఏర్పాటు చేశారు.
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కాలేరు వెంకటేశ్ టీఆర్‌ఎస్ గంగాపురం కిషన్ రెడ్డి బీజేపీ 1016
2014 జి. కిషన్‌రెడ్డి బీజేపీ ఎడ్లసుధాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ 62698
2009 జి. కిషన్‌రెడ్డి బీజేపీ ఫరుదుద్దీన్ కాంగ్రెస్‌ 27243

పెండింగ్ ప్రాజెక్టులు

అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో మూసీ నది వలన దుర్గందం, దోమలబెడద.
హుస్సేన్‌సాగర్‌ నాలా ఉప్పొంగినప్పుడు బస్తీలలోని ఇళ్లలోకి వర్షపు నీరు రావడం. పురాతన డ్రైనేజీ వ్యవస్థతో మురికివాడలో ప్రజల ఇబ్బందులు
రహదారుల విస్తరణ జాప్యంతో ట్రాఫిక్‌ సమస్యలు.

ముఖ్య ప్రాంతాలు

అంబర్‌పేట నియోజకవర్గంలో చారిత్రాత్మకమైన కాచిగూడ రైల్వేస్టేషన్‌ ఉంది. అదే విధంగా వీరన్నగుట్టపైన శ్యామ్‌బాబా మందిర్, అంబర్‌పేట మహంకాళి దేవాలయం, డీడీ కాలనీలో అహోబిల్‌ మఠం, నల్లకుంటలో శృంగేరీ శంకర మఠం, బర్కత్‌పురలో రాఘవేంద్రస్వామి మఠం, అంబర్‌పేట సీపీఎల్‌ లైన్‌లో గురుద్వార్‌, బాగ్‌అంబర్‌పేటలో అయ్యప్పస్వామి దేవాలయం, శివం దేవాలయం, వీరన్నగుట్టలో శివాలయం, బర్కత్‌పురలో జైన్‌మందిర్‌, తదితర ఆలయాలు ఉన్నాయి. అదే విధంగా పీఎఫ్‌ ప్రధాన కార్యాలయం బర్కత్‌పురలో ఉంది. తూర్పుమండలం డీసీపీ కార్యాలయం, కాచిగూడ కబేళా, సీపీఎల్‌, హైదరాబాద్‌ జిల్లా బీసీ వెల్ఫేర్‌ కార్యాలయం, విద్యానగర్‌లో ఏటీఐ కళాశాల, డీడీ కాలనీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌, కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆంధ్రపాచ్చ కళాశాల, రెడ్డి కళాశాల, నృపతుంగా విద్యాసంస్థలు, మాడపాటి హనుమంతరావు హైస్కూల్‌, బూర్గుల రామకృష్ణారావు హైస్కూల్‌, తెలంగాణ యువతి మండలి, బర్కత్‌పురలో ఆయుష్‌ కార్యాలయం, నల్లకుంట ఫీవర్‌ హస్పిటల్, నారాయణగూడ ఐపీఎం, కర్ణాటక సాహిత్య మందిర్‌, గుజరాతీ భవన్‌ మొదలైనవి ఉన్నాయి.

వీడియోస్

ADVT